చుక్క‌లు చూపించిన విండీస్ - చెమ‌టోడ్చిన శ్రీ‌లంక - వారెవ్వా పూర‌న్ ..!

వెస్టిండీస్ జ‌ట్టు తానేమిటో మ‌రోసారి రుచి చూపించింది లంకేయుల‌కు. పూర‌న్ పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఆడాడు. గెలుపు అంచుల దాకా తీసుకెళ్లాడు. ఒకానొక ద‌శ‌లో లంక ఓడిపోతుంద‌నిపించింది. అడ్డుగోడ‌లా ఫెర్నాండ్ నిల‌బ‌డ‌క పోతే ఆ జ‌ట్టు ఆశ‌లు గ‌ల్లంత‌య్వేవి. ఇప్ప‌టికే ఏడు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి ..ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ ను దాదాపు నిష్క్ర‌మించిన విండీస్ జ‌ట్టు ఆఖ‌రు మ్యాచ్ శ్రీ‌లంక‌తో త‌ల‌ప‌డాల్సి వ‌చ్చింది. ఎలాగైనా లంక‌పై గెలిచి పోయిన ప‌రువును నిల‌బెట్టు కోవాల‌నే క‌సితో విండీస్ ఆట‌గాళ్లు క‌సితో ఆడారు. దుమ్ము రేపారు. లంకేయుల‌కు ద‌డ పుట్టించాడు ఒకే ఒక్క‌డు పూర‌న్. మొద‌ట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జ‌ట్టు 339 ప‌రుగులు చేసింది. ఈ టార్గెట్‌ను ఛేదించేందుకు రంగంలోకి దిగిన విండీస్ జ‌ట్టు ..199 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయింది.

ఈజీగా గెలుస్తుంద‌నుకున్న లంక జ‌ట్టు చెమ‌టోడ్చాల్సి వ‌చ్చింది. ఈ స్థితిలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన అసాధార‌ణ‌మైన రీతిలో నికోలాస్ పూరన్ వ‌స్తూనే దాడి చేయ‌డం ప్రారంభించాడు. 103 బంతులు ఆడి 11 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో 118 ప‌రుగులు చేశాడు. విండీస్ ను గెలిపించినంత ప‌ని చేశాడు. కీల‌క ద‌శ‌లో వెనుదిర‌గ‌డంతో లంక చేతిలో క‌రేబియ‌న్ జ‌ట్టుకు ఓట‌మి త‌ప్ప‌లేదు. ఇప్ప‌టికే విండీస్, శ్రీ‌లంక జ‌ట్లు టోర్నీ నుంచి నిష్క్ర‌మించాయి. ప్ర‌పంచ‌క‌ప్‌లో స‌మీక‌ర‌ణాల‌తో సంబంధం లేని విండీస్ - శ్రీ‌లంక మ్యాచ్ మ‌రింత ఆస‌క్తిని రేపింది. ఇరు జ‌ట్ల ఫ్యాన్స్‌కు క్రికెట్ ఆట‌కున్న క్రేజ్‌ను మ‌రింత పెంచింది. లంక మొద‌ట 6 వికెట్లు కోల్పోయి 338 ప‌రుగులు చేసింది. భారీ స్కోర్ విండీస్ జ‌ట్టు ముందు ల‌క్ష్యంగా ఉంచింది. లంక జ‌ట్టులో అవిష్క ఫెర్నాండో విండీస్ బౌల‌ర్ల‌తో ఆడుకున్నాడు. 103 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 9 ఫోర్లు, 2 సిక్స‌ర్లు కొట్టాడు. 104 ప‌రుగులు చేశాడు.

మైదానంలోకి దిగిన విండీస్ జ‌ట్టులో పూర‌న్ ఒక్క‌డే పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఆడాడు. ఆఖ‌రు వ‌ర‌కు నిల‌దొక్కుకునే ప్ర‌య‌త్నం చేశాడు. 9 వికెట్లు కోల్పోయి ఆ జ‌ట్టు 315 ప‌రుగులు చేసి చతికిల ప‌డింది. విండీస్ 10 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 2 వికెట్లు కోల్పోయి 37 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఈ స్థితిలో గేల్ 35 ప‌రుగులు చేయ‌గా హెట్ మ‌య‌ర్ 29 ప‌రుగులు చేసి..ధాటిగా ఆడేందుకు ప్ర‌య‌త్నించినా ..కీల‌క స‌మ‌యంలో వెనుదిర‌గ‌డంతో 4 వికెట్లు కోల్పోయి 84 ప‌రుగులు చేసింది. అయితే పూర‌న్, హోల్డ‌ర్‌తో క‌లిసి పోరాటం కొన‌సాగించాడు. కీల‌క స‌మ‌యంలో హోల్డ‌ర్, బ్రాత్ వైట్ లు అవుట్ కావ‌డంతో విండీస్ ఓట‌మి దిశ‌గా సాగింది. కానీ పూర‌న్ ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడు లాగా లంక బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా సిక్స్‌లు, ఫోర్లు కొడుతూ ర‌న్ రేట్‌ను అదుపులో ఉంచాడు. పూర‌న్‌కు తోడుగా అలెన్ ఆఫ్ సెంచ‌రీ సాధించాడు. అయినా జ‌ట్టును గెలిపించ‌లేక పోయారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!