పోటీ పడాలంటే ..మనం మారాలంతే..?
ప్రపంచంలో మనదైన ముద్ర అంటూ లేకపోతే ఎలా..? ఒకరితో పోటీ పడాలన్నా..అందరికంటే ముందు ఉండాలన్నా కావాల్సింది కష్టపడాలి. అన్నిటికంటే మనం మారాలి. మహిళలమన్న భావన నుండి బయట పడాలి. లేకపోతే మనం వున్నా చోటనే వుండి పోతాం అంటోంది సోయగాల నటీమణి ప్రియాంక చోప్రా. ప్రతి రంగంలో పోటీ అన్నది సర్వ సాధారణం. అలాగని భయపడుతూ కూర్చుంటే ఎలా అంటోంది ఈ అమ్మడు . ఉన్నది ఒక్కటే జిందగీ. పొద్దస్త మానం దీని గురించే ఆలోచిస్తూ కూర్చోవడం కంటే, టైం ను ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తే అద్భుతంగా రాణించవచ్చు. ఇక్కడ ఎవ్వరూ ఎక్కువ కాదు ..ఇంకొకరు తక్కువ కాదు. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఉన్నాయి.సమాజంలో కొందరే గొప్ప వారనుకుని మీ సున్నితమైన మనసుల్ని ఎందుకు పాడు చేసుకుంటారని ప్రశ్నిస్తోంది చోప్రా. సమాజంలో మనకంటూ ఓ గుర్తింపు ఉంది . దానిని కాపాడు కోవడమే మనల్ని మనం మరింత బలోపేతం చేసు కోవడం . ప్రతి ఒక్కరం మగాళ్లు మారాలని కోరుకుంటారు. అసలు ముందు మహిళలమైన ..అమ్మాయిలమైన మనం ఎందుకు మారాలని అను కోవడం లేదు . సినిమా రంగంలో ప్రతిసారి నన్ను అడుగుతుంటారు..మీకు ఎవరితో పోటీ అని. నాకు నవ్వు వస్తూ ఉంటుంది. ఇది సిల్లీ క్వచ్చన్. మగాళ్లు, ఆడవాళ్లు వేరు కాదు . ఇద్దరూ మానవ జాతి సమూహం. అలా ఆలోచించ గలిగితే ఇన్ని సమస్యలు ఉత్పన్నం కావు అంటోంది ప్రియాంక చోప్రా. ఎవరికి ఇంకొకరు పోటీ కాదు . ఇది ఏమన్నా పరుగు పోటీనా. ప్రతి రంగంలో ఉన్నట్టే ఇక్కడ కూడా ఇబ్బందులు ..కస్టాలు ..కన్నీళ్లు ఉంటాయి. కొందరికి అవకాశాలు వస్తాయి . ఇంకొందరికి ఆలస్యంగా రావొచ్చు . రాలేక పోవచ్చు కూడా . ఇదే జీవితమని అనుకుంటూ ఇక్కడే ఆగి పోతే ఎలా. ఒకటి కాక పోతే ఇంకో దారి చూపుతుంది లైఫ్. మీరు అనుకున్నట్టు మాలో మాకు ఎలాంటి పోటీ అంటూ ఉండదు. ఎక్కడికి వెళ్లినా సరే, చాలా సార్లు ఇదే ప్రశ్న నాకు ఎదురవుతోంది. నాకు నాతోనే పోటీ. వేరే వాళ్ళతో నేను పోల్చుకోను . అలా అయితే నేను ప్రియాంక చోప్రా ఎలా అవుతానంటోంది ..ఈ ముద్దులగుమ్మ. జీవితం మీద తనకు పట్టుంది కాబట్టే ప్రపంచం ఈమెకు ఫిదా అవుతోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి