ఆరోగ్యానికి బలం..తల్లి పాలు శ్రేయస్కరం
పాలివ్వడం అనేది నేరం కాదని, అది బిడ్డకు తల్లికి మధ్య బంధం బాల పడేందుకు దోహదం చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. కనీసం బిడ్డ పుట్టాక ఆరు నెలలపాటు ఇస్తే బావుంటుందని పేర్కొంటున్నారు. ప్రపంచమంతటా తల్లి పాల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. పాలు ఇవ్వడం వల్ల ఎలాంటి రోగాలు రావని, పిల్లలు ఆరోగ్యకరంగా ఉంటారని ప్రచారం చేయాలని అన్ని దేశాల ప్రభుత్వాలను కోరింది సంస్థ. తల్లి పాలు ఇవ్వని పిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారని, అదే పాలు తాగిన పిల్లలు తెలివి తేటల్లోను ..ఆరోగ్యకరంగా ఉన్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
పిల్లలకు జన్మను ప్రసాదించే తలిదండ్రులు ఈ విషయంలో పూర్తి అవగాహన కలిగి ఉండాలని, కనడం ఒక్కటే కాకుండా వారి బాగోగులతో పాటు ఆరోగ్య కరంగా ఉండేందుకు పాలు ఇవ్వడం , ఇచ్చేలా చూడటం బాధ్యతగా తీసు కోవాలని స్పష్టం చేసింది. అమ్మ పాలు అమృతం. వాటిని నేరంగానో భావించడం , అందానికి అడ్డుగా ఉంటుందనే భ్రమల్లో ఉండటం మంచిది కాదు. మెరుగైన..ఆరోగ్యకరమైన సమాజం కావాలంటే తల్లులు పాలివ్వడం నేర్చు కోవాలి. అదో వరంగా భావించాలి. తల్లులు మరోసారి ఆలోచించండి. బాల్యానికి భరోసా కల్పించండి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి