అలుపెరుగని బాటసారి .. అంతులేని విజ్ఞాన వారధి,.!
భారత దేశ రాజకీయాలలో తెలుగు వారిలో పేరొందిన నాయకులలో మొదటగా గుర్తుకు వచ్చే పేరు ముప్పవరపు వెంకయ్య నాయుడు . సుదీర్ఘమైన రాజాకీయ అనుభవం కలిగిన గొప్ప నాయకుడు. ఎందరికో మార్గదర్శకుడు . విద్యార్ధి నాయకుడి నుంచి నేటి ఉప రాష్ట్రపతి దాకా ఆయన ఎన్నో పదవులు సమర్ధవంతంగా నిర్వహించారు . మొదటి నుంచి భారతీయ సంకృతి , నాగరికత , సాంప్రదాయాలు అంటే వెంకయ్య నాయుడుకు యెనలేని అభిమానం. సమయానికి విలువ ఇవ్వడమే కాదు సందోర్భోచితంగా మాట్లాడటం , ప్రసంగించడం ఆయనకు మాత్రమే చెల్లింది . వ్యంగ్యం ..హాస్యం ..వినోదం ..విజ్ఞానం కలిపితే ఆయనవుతారు .
విధాన సభలో నైనా ..పార్లమెంట్ లోనైనా ఏ అంశంపైనా అనర్గళంగా ..పూర్తి వివరాలతో విపక్షాలు విస్తు పోయేలా చేయడంలో జైపాల్ రెడ్డి ఒకరైతే మరొకరు వెంకయ్య నాయిడు. ఆయన అభిప్రాయలు , సిద్ధాంతాలతో ఏకీభవించక పోయినా సాహిత్యం పట్ల అభిమానం కలిగిన వ్యక్తిగా వెంకయ్యను గౌరవించకుండా ఉండలేం. ఎందుకంటే వృత్తి పరంగా ఎన్నో వత్తిళ్లు ఉన్నప్పటికీ ఆయన నిత్యం చదవడం మాత్రం మానలేదు. ఎంతటి స్థాయికి చేరుకున్నా తన మూలాలు మరిచి పోలేదు . ఇది ఆయనకున్న వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. వెంకయ్య చేసిన ప్రసంగాలతో పుస్తకం రాశారు . దేశంలోని ప్రధాన సమస్యలపై కూడా తక్షణమే స్పందించడం ..వాటి గురించి రాయడం ఆయనకు మాత్రమే సాధ్యం .దేశంలో ఇన్నేళ్ల కాలంలో ఎందరో రాజకీయ నాయకులు వచ్చారు . కొందరు నిలబడ్డారు ..మరికొందరు తెరమరుగయ్యారు.
కానీ వెకయ్య నాయుడు మాత్రం అలాగే చెక్కు చెదరకుండా ఉన్నారు. ఇటీవల కొన్నేళ్ల పాటు తనతో కలిసి నడిచిన బెస్ట్ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి మరణించినప్పుడు వెంకయ్య కన్నీటి పర్యంతమయ్యారు . గొప్ప నేతను , అంతకంటే మనసున్న సహచరుడిని కోల్పోయానని వాపోయారు . ప్రకృతి అన్నా , సకల సమస్యలపై పూర్తిగా తెలుసు కోవడం రోజు చేసే దినచర్య. తాజాగా చెన్నైలో స్ఫూర్తి కలిగించేలా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన కార్యదక్షతకు ఇది ఓ మచ్చుతునక. విద్య ఉద్దేశం ఉపాధి ఒక్కటే కాదు. జ్ఞానోదయం, సాధికారత, విజ్ఞాన వికాసం కూడా. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే యువతకు నాదో సలహా…అక్కడ నేర్చుకోండి, ఆర్జించండి, స్వదేశానికి తిరిగి రండి .. అంటూ వెంకయ్య నాయుడు పిలుపునిస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి