పల్లె నుంచి కేన్స్ ఫెస్టివల్ దాకా – కథకు దక్కిన గౌరవం – డొమ్నిక్ సంగ్మాకు సలాం
కథలు ఎట్లా రాస్తారు అంటూ ఖాదర్ మోహియుద్దీన్ పుస్తకం రాసినప్పుడు కలిగిన సందేహం ఇపుడు కలుగుతోంది. అవును..కథలు ఎట్లా పుడుతాయి. ప్రతి కథకు ప్రారంభం ..ముగింపు వుంటాయి. ప్రతి ఒక్కరికి ఏదో కథ వుండే వుంటుంది.కానీ కొందరు చెప్పుకోరు..ఇంకొందరు చెప్పటానికి ఇష్టపడతారు. తేడా ఏమిటంటే చిన్న పాటి దూరమంతే. ఇక్కడే కలలు వుంటాయి. కన్నీళ్లు వుంటాయి. వెచ్చని కబుర్లుంటాయి. కావాల్సిందల్లా ఆ సన్నివేశాలకు అనుగుణంగా పోగేసుకున్న మాటల్ని ఒడేసి పట్టుకోవడం . ఇక్కడే స్టోరీ ప్రాణం పోసుకుంటుంది. అది సినిమానో లేక కాన్వాస్ గానో తయారవుతుంది. ఒక్కొక్కరిది ఒక్కో విజన్. ఒక్కో వే. ఎవరి ప్రపంచంలో వాళ్లే. మళ్లీ అడగాలని వుంది..కథలు ఎలా రాస్తారు అని…డొమ్నిక్ మహా గట్టోడు. తీక్షణమైన కళ్లు. ప్రపంచాన్ని నివ్వెర పరిచి..ప్రశ్నించాలన్న తపన ఎక్కువ.
అదే అతడిని భిన్నంగా ఆలోచింప చేసేలా చేసింది. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్‌గా తయారయ్యేలా మార్చేసింది. మేఘాలయ గారో హిల్స్ కు..అస్సాం బోర్డర్ కు మధ్య ఉండే ఊరును ..దాని మూలాలను ఆయన అక్షరబద్దం చేశాడు. అదే కథగా రూపొందింది. సినిమాగా తెరపైకి కనిపించేలా తీర్చిదిద్దాడు డొమ్నిక్. ఇక్కడ మనవాళ్లు షార్ట్ ఫిల్మ్‌లు తీసేస్తున్నారుగా. కానీ ఇతని ఆలోచనలే వేరు. సామాజిక బాధ్యతగా తను ఫీల్ అయ్యాడు. అందుకే సోషల్ ఇష్యూస్ మీద ఎక్కువగా కాన్ సెంట్రేషన్ చేశాడు. డొమ్నిక్ సంగ్మా తీసిన రాప్చర్ మూవీ ..కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. అక్కడి వారిని ఎంతగానో ఆలోచింప చేయటమే కాదు ..ఆశ్చర్య పోయేలా చేసింది. ఇతని సినిమా ప్రతిభకు హ్యాట్స్ ఆఫ్ అంటూ వెన్నుతట్టారు అక్కడి జనం. ఈ ఫిల్మ్ మేకర్‌పై ఆస్ట్రేలియాకు చెందిన కవి రెయినర్ మారియా , రష్యన్ ఫిల్మ్ మేకర్ ఆండ్రీ తార్కోవస్కీతో పాటు ఊరు చుట్టుపక్కల ప్రాంతాలు తన సినిమాలకు వస్తువులయ్యాయి.
డొమ్నిక్ సంగ్మాకు చదువంటే ఇష్టం. అన్న ఇచ్చిన డబ్బులతో డిగ్రీ చేశాడు. 2008లో సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్‌లో చదివేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. అందులో చేరడం, సినిమాలు తీయడం, ఏదో ఒక రోజు బాలివుడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకోవడం ఇతని లక్ష్యం. తన ఐడియా మారి పోయింది. రే సంస్థలో చేరాక అతడిలో మార్పు మొదలైంది. ఇది కాదు జీవితమంటే..ఇది కాదు సినిమా అంటే అన్నది అర్థమైంది. సినిమా అంటే వినోదం కాదు..అది సామాజిక బాధ్యత అని నేర్చుకున్నాడు. తత్వం బోధ పడింది. ఇక అప్పటి నుంచి అతడిలో కసి పెరిగింది. అదే సినిమాగా బయటకు వచ్చింది. ఇంకేం కేన్స్ ఫెస్టివల్‌లో అతడి సినిమాకు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి