వికసిస్తున్న కమలం ..క్యూ కట్టిన నేతలు
బీజేపీ అనూహ్యంగా చాప కింద నీరులా భారత దేశంలో పుంజుకుంటోంది. తాజాగా దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ థంపింగ్ మెజారిటీ సాధించి కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో నరేంద్ర మోదీ ..అమిత్ షా లు ఇద్దరు బీజేపీకి ఆయువుపట్టులా ఉన్నారు. వీరు ఏది అనుకుంటే దానిని అమలు చేస్తున్నారు . వీరికి అటు ఆర్.ఎస్సెస్ , భజరంగ్ దళ్ , వీహెచ్ పి లు వెన్ను దన్నుగా నిలుస్తున్నాయి . మరో వైపు మహారాష్ట్రలో శివశేన తో పొత్తు పెట్టుకున్నప్పటికీ బీజేపీ నే హవా కొనసాగిస్తోంది. ఇప్పుడు మోదీ , షా ల గాలి వీస్తోంది . ఇండియా అంతటా కాషాయ జెండా ఎగుర వేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు వీరిద్దరూ . ఆ దిశలోనే పావులు కదుపుతూ ..వ్యూహాలకు పదును పెడుతూ విపక్షాలకు చెక్ పెడుతున్నారు .
తమకు , తమ పార్టీకి అడ్డు అంటూ లేకుండా చేస్తున్నారు. పక్కాగా స్కెచ్ ను మోదీ వేస్తే దానిని షా అమలు చేస్తున్నాడు . ఇదే సమయంలో సౌత్ లో నిన్నటి దాకా కాంగ్రెస్ , జేడీఎస్ లు సంకీర్ణ సర్కార్ ను కర్ణాటకలో ఏర్పాటు చేసిన సర్కార్ ను కూలదోశారు . అన్ని అన్ని రాష్ట్రాలలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఏ ఒక ప్రాంతీయ పార్టీలకు చోటు లేకుండా చేయాలన్నది వీరి లక్ష్యం . ఇందు కోసం భారీగానే కసరత్తు సాటర్ట్ చేసారు . నిన్నటి దాకా స్తబ్దుగా ఉన్న పార్టీకి యెనలేని మద్దతు లభించింది. కాశ్మీర్ విషయంలో 370 ఆర్టికల్ ను రద్దు చేయడం ..దానిని విభజించడం , అంతర్జాతీయ స్థాయిలో ఇండియాకు పూర్తి సహకారం , మద్దతు లభించడంతో మోదీ హవా మరింత పెరిగింది.
దేశంలో ఇతర పార్టీల నుండి వలసలు, చేరికలు భారీ ఎత్తున ఊపందుకున్నాయి . బీజీపీ అటు ఏపీ లోను ఇటు తెలంగాణలోనూ అధికారంలోకి రావాలని అనుకుంటోంది. ఇందు కోసం పక్కా ప్లాన్ వేశారు . కాంగ్రెస్ ఇప్పుడు తన ఇంటిని తానే చక్కదిద్దుకోలేక తల్లడిల్లుతోంది . దీంతో తనకు ఎదురే లేక పోవడంతో ముఖ్యమైన నేతలను, మేధావులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది . ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టారు షా. తెలంగాణాలో డీకే అరుణ, జితేందర్ రెడ్డి తో పాటు మాజీ ఎంపీ గడ్డం వివేకానంద కూడా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. మరో వైపు దమ్మున్న నేతగా పేరున్న మోత్కుపల్లి నర్సింలు కూడా బీజేపీలో చేరబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. కిషన్ రెడ్డి , లక్షణ్ లు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. చేరమని కోరారు. మొత్తం మీద బీజేపీ రాబోయే కాలంలో అధికారంలోకి రావాలని ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి