విశ్వనాథా విజయీ భవ..కుచేలుడి ఇంటికి శ్రీకృష్ణుడు..!
ఎవరూ ఊహించని సన్నివేశం అది. తెలంగాణ చరిత్రలో అరుదైన సందర్భం అది. ఎంతైనా కేసీఆర్ అంటేనే సంచలనాలకు మారు పేరు. ఆయన మదిలో ఏముందో ఎవరికీ అర్థం కాదు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో పక్కన ఉన్న వారికి కూడా తెలియదు. వాహనం ఎక్కే దాకా ఎవరి దగ్గరికి వెళుతున్నారో అంతు పట్టదు. ఒక్క ఇంటెలిజెన్సీ విభాగానికి, రాష్ట్ర డీజీపీ కి తప్ప. నిన్నటి దాకా తెలుగు సినిమా రంగంలో అత్యధిక శాతం పొరుగు రాష్ట్రానికి చెందిన వారే అధికంగా ఉన్నారు. ఉద్యమ సమయంలో కొన్ని గ్యాప్ ఏర్పడింది. దానిని రాష్ట్రం ఏర్పాటు అయ్యాక తొలగించే ప్రయత్నం చేశారు సీఎం కేసీఆర్. సినీ పెద్దలు కలలో కూడా అనుకోని రీతిలో ముఖ్యమంత్రి ఏకంగా భారత దేశం గర్వించే దర్శకులలో దిగ్గజ దర్శకుడిగా పేరొందిన కాశీనాథుని విశ్వనాధ్ ఇంటికి స్వయంగా వెళ్లారు .
ఈ సందర్బంగా గంటకు పైగా ఆయనతో ముచ్చటించారు. స్వతహాగా సీఎం సాహితీ పిపాసి , ఆయనకు కళలన్నా , సాహిత్యం అన్నా యెనలేని అభిమానం . ఆయన అనుభవం కలిగిన రాజకీయ నాయకుడే కాదు అద్భుతమైన రచయిత, కవి. సినిమాలన్నా , పాటలన్నా కేసీఆర్ కు పిచ్చి . విశ్వనాధ్ తో పాటు ఆయన సతీమణి కి స్వయంగా శాలువాలు కప్పారు , దుస్తులు అందజేశారు . తనకు ఉన్న కళాభిమానాన్ని సీఎం చాటుకున్నారు. తాను విశ్వనాథుని వీరాభిమానిని చెప్పారు కేసీఆర్. ఆయన నుంచి మరో సందేశాత్మక చిత్రం రావాలి అని కోరారు . ఇందు కోసం తానే నిర్మాణ బాధ్యతలు తీసుకుంటానాని చెప్పారు . సినిమాలు, సాహిత్యం గురించి ఇరువురు చర్చించారు. విశ్వనాథ్‌ను తాను చిన్నతనం నుంచే అభిమానించే వాడినని కేసీఆర్ అన్నారు. ఆయన్ను కలవాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నానని, ఇప్పటికి ఆ కల నెరవేరిందన్నారు.
ఈ సందర్భంగా విశ్వనాథ్, ఆయన భార్య జయలక్ష్మి, కొడుకు రవీంద్రనాథ్, కోడలు గౌరి, దర్శకుడు ఎన్.శంకర్ తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. విశ్వనాధ్ ను ప్రసంశలతో ముంచెత్తారు కేసీఆర్. మీ సినిమాలంటే ఇష్టం. ప్రతి సినిమా చూసా.. అందులో శంకరాభరణం నన్ను ఎక్కువగా కదిలించింది. పాత్రల ఎంపిక , సన్నివేశాల చిత్రీకరణ నన్ను కదిలించాయి. అన్ని సినిమాలు చూసా. వాడే భాష , పాటలు , సంగీతం ఆకట్టుకున్నాయి . ఎప్పటి నుంచో కలవాలని అనుకున్నా, ఇప్పుడు వీలు కుదిరింది. మీ నుండి సందేశాత్మక చిత్రం రావాలి. అందుకు నేనే నిర్మాణం చేస్తానని చెప్పారు సీఎం. దీంతో ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు దర్శకుడు విశ్వనాధ్ . కేసీఆర్ కళాభిమాని, సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించారు . మీరు రావడం తో మా ఇల్లు పావనం అయ్యిందన్నారు విశ్వనాధ్. అయితే కుచేలుడు ఇంటికి శ్రీకష్ణుడు వచ్చినట్టుగా ఉందన్నారు. మా ఇద్దరి మధ్య సాహిత్యం , సినిమాల గురించే చర్చ జరిగిందన్నారు .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి