కోహ్లీ, శ్రేయస్ కమాల్..విండీస్ ఢమాల్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ , శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ప్రదర్శించడంతో అవలీలగా విండీస్ జట్టుపై రెండో వన్డే లో 59 పరుగుల తేడాతో గెలిచింది . పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ లో జరిగిన ఈ మ్యాచ్ లో మొదటగా ఇండియా బ్యాటింగ్ చేసింది. కోహ్లీ 125 బంతుల్లో 125 పరుగులు చేశాడు . భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్ లో చెలరేగడంతో విండీస్ తలవంచక తప్పలేదు . వర్షం కారణంగా మ్యాచ్‌ను 46 ఓవర్లకు కుదించారు. 270 పరుగుల టార్గెట్ ముందుంచారు. ఓపెనర్ లూయిస్ ఒక్కడే పోరాడినా ఫలితం లేక పోయింది . కేవలం 42 ఓవర్లలోనే కథ ముగిసింది . 80 బంతులు ఎదుర్కొన్న లూయిస్ 65 పరుగులు చేస్తే , పూరన్ 42 పరుగులు కొట్టినా లాభం లేక పోయింది . ఇండియన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇండియాకు గెలుపు లభించింది.

షమీ, కుల్దీప్ ఇద్దరు మెరుగైన బౌలింగ్ ఆట తీరుతో ఆకట్టుకున్నారు. మరో వైపు భారత ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ 68 బంతులు ఎదుర్కొని 71 పరుగులు సాధించాడు. మూడు వన్డేలలో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్ కు కూడా వాన అడ్డంకిగా నిలిచింది . అందుకే అంపైర్లు ఓవర్లను, పరుగులను కుదించారు. దీంతో ఈ ఒక్క విజయంతో భారత జట్టు సరి పెట్టుకుంది. 43 వ ఓవర్ లో వర్షం కురిసింది. దీంతో వాన వెలిశాక తిరిగి ఆడాల్సి వచ్చింది .అరగంటకు పైగా వాన ఎడతెరిపి లేకుండా కురియడంతో ఈ మ్యాచ్ జరుగుతుందో లేదోనని ఫ్యాన్స్ ఆందోళన చెందారు .దాదాపు అరగంటకు పైగా వాన కురిసింది. మరో వైపు విండీస్ ఆడుతుండగా 13 వ ఓవర్ లో వాన కురిసింది.

భారత , విండీస్ల మధ్య వర్షం దోబూచులాడింది. వరల్డ్ క్రికెట్ పంచ్ హిట్టర్ గా పేరొందిన క్రిస్ గేల్ పై విండీస్ పెట్టుకున్న ఆశలు నిరాశే అయ్యాయి. కేవలం 11 పరుగులు మాత్రమే చేసి వెనుతిరిగాడు. దీంతో భారత ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు . తక్కువ స్కోర్ కే హోప్ , మేయర్ లు పెవిలియన్ బాట పట్టారు . తక్కువ స్కోర్ కే ఆటగాళ్లు వెనుతిరగడంతో క్రీజ్ లోకి వచ్చిన పూరన్ , లూయిస్ లు మెలమెల్లగా పరుగులు చేస్తూ వెళ్లారు. వీరిద్దరూ వికెట్లు పోకుండా కాపాడుతున్న సమయంలో కుల్దీప్ , భువనేశ్వర్ ల దెబ్బకు ఔట్ అయ్యారు. అంతకు ముందు ఇండియా ఓపెనర్లు ధావన్ , రోహిత్ శర్మలు అంతగా ఆడలేక పోయారు . మైదానంలోకి వచ్చిన సారధి కోహ్లీ ధాటిగా ఆడుతూ భారీ స్కోర్ సాధించేందుకు దోహద పడ్డాడు . మొత్తం మీద అటు బ్యాట్టింగ్ లోను ఇటు బౌలింగ్ లోను భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేయడంతో విజయం వరించింది .దీంతో కథ ముగిసింది . విండీస్ కు ఓటమే మిగిలింది .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!