వరల్డ్ కప్ గెలవక పోయినా కోచ్ కు బంపర్ ఆఫర్
అధికారం మన చేతుల్లో వుంటే చాలు ఏమైనా చెయ్యొచ్చు. ఎంతైనా బలగం ఉన్నోడు కదా. అందుకే అందరినీ కాదని టీమిండియా జట్టుకు కోచ్ గా ఎంపికయ్యాడు. వడ్డించే వాడు మనోడైతే ఇంకేం వద్దన్నా కాసులు వాలి పోతాయి. ఇదే అదృష్టం అంటే. మొదటి నుంచి భారత దేశంలో ప్రభుత్వానికి లేనంతటి పవర్ ఒకే ఒక్క సంస్థకు ఉంది. అదే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఎప్పుడైతే మాజీ క్రికెట్ సారధి కపిల్ దేవ్ విండీస్ ను ఫైనల్ లో ఓడించి ప్రపంచ కప్పు ఎగరేసుకు వచ్చాడో, అప్పటి నుంచి క్రికెట్ ఇండియాను ఊపేస్తోంది. శాసిస్తోంది. అంతేనా సర్కార్ ను తన దరిదాపుల్లోకి కూడా రానీయడం లేదు. మొదటి నుంచి ఇండియన్ క్రికెట్ లో ముంబై ఆటగాళ్లదే ఆధిపత్యం. దీనిని కపిల్ దేవ్, హైదరాబాద్ ఆటగాడు అజహరుద్దీన్ బ్రేక్ చేశారు.
వారికి చెక్ పెట్టాడు అజ్జూ భాయి. ఆయన హయాంలోనే ఇండియాలోని ఇతర ప్రాంతాలకు చెందిన క్రికెటర్లు ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. దేశ ప్రధానమంత్రికి కూడా దక్కని ప్రచారం, హోదా , గౌరవం , బ్రాండ్ ఇమేజ్ అంతా క్రికెటర్లకు ఉంటోంది. ఇది నమ్మశక్యం కాని వాస్తవం. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన, భారీ ఆదాయం కలిగిన సంస్థగా బీసీసీఐ చరిత్ర సృష్టించింది. ఆటగాళ్లు ఒక్క మ్యాచ్ ఆడితే చాలు కరోడ్ పతులవుతారు. ఆ ఆటకు ఉన్న పవర్ అలాంటిది. ఇప్పటికే ఇండియన్ సారధి కోహ్లీ ఆదాయం వంద కోట్లు దాటేసింది. ఇక మిగతా క్రికెటర్ల గురించి చెప్పాల్సిన పని లేదు. సారధితో పాటు భారత జట్టుకు కోచ్ పదవి అంటే మాటలా, ఇండియాకు ప్రెసిడెంట్ లాంటి వ్యక్తి. ఈ అత్యున్నత పోస్ట్ కోసం భారీ కసరత్తే జరిగింది. ఇండియన్ సెలెక్షన్ కమిటీ ప్రత్యేకంగా ప్రపంచ వ్యాప్తంగా దరఖాస్తులను ఆహ్వానం పలికింది.
చాలా మంది అప్లై చేసుకున్నా ఎందుకనో కమిటీ చైర్మన్ గా ఉన్న మాజీ సారధి కపిల్ దేవ్ రవి శాస్త్రి మీదే ప్రేమ చూపించారు. ఇంకేం మరోసారి ముంబై వాసులు ఎలా పదవి ని చేజిక్కించు కుంటారో చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే కోచ్ గా ఉన్న రవి శాస్త్రికి బీసీసీఐ ప్రతి ఏటా 8 కోట్ల రూపాయలు వేతనంగా ఇస్తోంది. ఇంత భారీ ఎత్తున మనోడికి చెల్లిస్తున్నా టీమిండియా ప్రపంచ కప్పు పోటీల్లో సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో చేతులెత్తాశారు. దీంతో కోట్లాది అభిమానులు సారధి కోహ్లీ, కోచ్ రవి శాస్త్రి లను తొలగించాలంటూ కోరారు. వీటిని ఏమాత్రం పట్టించు కోలేదు బీసీసీఐ చైర్మన్ ఎమ్మెస్కె ప్రసాద్. తిరిగి విండీస్ టూర్ కు వీరిద్దరికి పూర్తి భాద్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా రవి శాస్త్రి కోచ్ గా బాగా పని చేస్తున్నాడంటూ ఏకంగా మరో రెండు కోట్లు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో రవి శాస్త్రి పంట పండుతోంది. ఏకంగా ఎనిమిది కోట్ల నుంచి 10 కోట్లు అవుతుందన్నమాట. ఎంతైనా ముంబై కదూ.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి