ఈటల మౌనం..రసమయి స్వరం..నాయని ఆగ్రహం
మంత్రివర్గ విస్తరణ తెలంగాణ రాష్ట్ర సమితిలో అసంతృప్తిని రాజేసింది. రెండవ సారి తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది మందితోనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు. పార్టీ అంటేనే కెసిఆర్ ..కేసీఆర్ అంటేనే పార్టీ అనే స్థాయికి తీసుకు వెళ్లారు. ఏ ఒక్కరు ఆయనకు ఎదురు చెప్పలేని, ప్రశ్నించలేని పరిస్థితి. మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ట్రబుల్ షూటర్ గా పేరొందిన అల్లుడు తన్నీరు హరీష్ రావు తో పాటు కొడుకు కేటీఆర్ కు కేబినెట్లో చోటు దక్కింది. రెండో సారి మంత్రివర్గ విస్తరణలో వీరిద్దరికీ చోటు దక్కలేదు. హరీష్ ను పక్కన పెట్టారనే వార్తలు గుప్పుమన్నాయి. హరీష్ కూడా ఎక్కడా కనిపించలేదు. తన నియోజకవర్గానికే పరిమితమై పోగా, కొడుకుకు మాత్రం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని కట్టబెట్టారు.
ఇదే సమయంలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో పాటు విపక్షాలు సైతం హరీష్ రావు నును పక్కన పెట్టడంపై పలు విమర్శలు సైతం చేశారు. దీంతో మెలమెల్లగా ఆ అపవాదును తొలగించేందుకు కేసీఆర్ ఇతర పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను తమ పార్టీలోకి తీసుకున్నారు. దీంతో ఏ సమయంలోనైనా ఏదైనా జరిగినా అధికారంలో ఉండేందుకు కావాల్సిన బలాన్ని, బలగాన్ని ముందే సిద్ధం చేసి ఉంచారు. ఎంతైనా దొర కదా పక్కా ప్లాన్ చేసిండు. భారీ మెజారిటీతో గత ఎన్నికల్లో దుమ్ము రేపిన సర్కార్ కు బీజేపీ లోకసభ ఎన్నికల్లో కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ అధిక శాతం గ్రామాలను చేజిక్కించుకుంది. చాలా మంది ఆశావహులు పెరిగి పోవడం, ఎమ్మెల్యేల నుంచి వత్తిళ్లు రావడం , కొంచం అసంతృప్తి చోటు చేసు కోవడంతో
గమనించిన కేసీఆర్ త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన సమయంలో సముచిత స్థానం కల్పిస్తానని చెప్పారు.
దీంతో కేటీర్ చుట్టూ తాకిడి ఎక్కువైంది. ఇదే సమయంలో ఎం.ఐ.ఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. వెంటనే కేటీర్ కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే కావాలనే కొందరు పార్టీకి చెందిన వారే ఆయనతో ఇలా అనిపించారంటూ గుసగుసలు వినిపించాయి. ఇదే సమయంలో కేబినెట్ విస్తరణకు కేసీఆర్ శ్రీకారం చుట్టారని, కొందరికి ఉద్వాసన తప్పదంటూ..అందులో ఈటెల రాజేందర్ ఉన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో న్యూస్ వైరల్ అయ్యింది. దీనిపై బీసీ సంఘాలు, నేతలు ఫైర్ అయ్యారు. చివరి నిమిషంలో ఆయనకు అధినేత చోటు కల్పించారన్న వార్తలు గుప్పుమన్నాయి. కొత్త మంత్రివర్గాన్ని సీఎం ప్రకటించారు. అంతకు ముందు మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడకా మేము పార్టీకి ఓనరులం. ఎవరో పెట్టిన భిక్ష కాదు. కష్టపడితే వచ్చిన పదవి ఇది. నేను లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈటెల చేసిన కామెంట్స్ పార్టీలో సంచలనం కలిగించాయి. ఆయనకు తోడుగా మరో ఎమ్మెల్యే రసమయి కూడా పార్టీలో మొదటి నుంచి ఉన్నామని, ఉద్యమకారులమని అన్నారు. తాజాగా పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నాయని నరసింహ్మ రెడ్డి అధినేతపై హాట్ కామెంట్స్ చేశారు.
తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మోసం చేశాడని, తన అల్లుడికి పదవి కట్టబెడతానని మాట తప్పాడంటూ మంది పడ్డారు. మాజీ మంత్రి రాజయ్య కేసీఆర్ పై తీవ్ర కామెంట్స్ చేశారు. 10 శాతానికి పైగా ఉన్న మాదిగలకు కేబినెట్ లో చోటు కల్పించ లేదంటూ ఫైర్ అయ్యారు. లోలోపట రాజుకున్న అసంతృప్తి మరోసారి బయట పడింది. అదే పార్టీకి చెందిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. అయితే పదవి దక్కక పోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన, తన గన్‌మెన్‌లను సరెండర్ చేశారు. మొత్తం మీద నిన్నటి దాకా పార్టీకి వీర విధేయులంమంటూ ప్రకటించిన వారంతా నిరసన గళం విప్పుతున్నారు. రాజకీయం అంటేనే పదవుల పందేరం కదా..దొరకు తెలియదా ఎవరికి ఏ బిస్కెట్ వేయాలో. ఎవరిని ఎలా దారికి తెచ్చుకోవాలి ..ఎలా శాంత పరచాలో.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి