దూసుకుపోతున్న బిగ్ బాస్..దుమ్ము రేపుతున్న నాగార్జున
తెలుగు బుల్లితెరపై స్టార్ మా టీవీ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ ప్రోగ్రాం దుమ్ము రేపుతోంది. రేటింగ్స్ లో దూసుకు వెళుతోంది. ప్రారంభం కంటే ముందే ఈ ప్రాయోజిత కార్యక్రమంపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చోటు చేసుకున్నాయి. జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. వీటన్నిటి మధ్య బిగ్ బాస్ స్టార్ట్ అయ్యింది. స్టార్ యాజమాన్యం ఊహించని రీతిలో మిగతా వినోదపు ఛానల్స్ ను దాటుకుని టాప్ రేటింగ్స్ లో దూసుకు పోయింది. దీంతో భారీ ఆదాయం సమకూరుతోంది స్టార్ మా టీవీకి. బిగ్ బాస్ రోజు రోజుకు భిన్నంగా వెళుతోంది. అత్యంత జనాదరణ ఉంటోంది దీనికి. ఈ ప్రోగ్రాం మూడోది. మొదటి సారిగా బిగ్ బాస్ ను జూనియర్ ఎన్ఠీఆర్ స్టార్ట్ చేశారు.
రెండో సారి నటుడు నాని చేస్తే..ముచ్చటగా మూడో సారి అక్కినేని నాగార్జునను స్టార్ మా టీవీ ప్రత్యేకంగా ఎంచుకుంది. ఇప్పటికే తెలుగు సినిమా రంగంలో ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉన్నది. వేలాది మంది అభిమానులను ఆయన కలిగి ఉన్నారు. దీంతో స్టార్ గ్రూప్ మిగతా నటులకంటే ఉమెన్స్ ఎక్కువగా ఇష్టపడే నాగార్జున వైపే మొగ్గు చూపింది. అంతకు ముందు ఇదే నాగార్జున ఇదే టీవీలో మీలో కోటీశ్వరుడు ఎవరు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది భారీ సక్సెస్ అయ్యింది. మరోసారి నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ కోట్లు కొల్లగొట్టేలా చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రోగ్రాం 50 రోజులు పూర్తి చేసుకుంది. మొత్తంగా దీని నిడివి 100 రోజులు. రోజు రోజుకు ఉత్కంఠను రేపుతూ ..ట్విస్టులతో దుమ్ము రేపుతోంది.
బర్త్ డే సందర్బంగా నాగార్జున ఫారిన్ టూర్ కు వెళితే ఆయన స్థానంలో శివగామి రమ్యకృష్ణ హోస్టుగా వచ్చారు. ఆమెకు విపరీతమైన ఆదరణ లభించింది. ఎలా నడిపిస్తోందనని అనుకున్న వారి అంచనాలు తలకిందులు చేస్తూ రమ్యకృష్ణ సక్సెస్ అయ్యారు. బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేస్తున్న వారిని ఒక ఆట ఆడించారు. దీంతో స్టార్ మా టీవీ యాజమాన్యం ఈమెతో మరో కొత్త ప్రోగ్రాం స్టార్ట్ చేయాలని భావిస్తోందట. మా ఏది చేసినా ఇప్పుడు ఆ ప్రోగ్రాం ఆదరణ చూరగొంటోంది. ఇప్పటి వరకు బుల్లి తెరపై టాప్ రేంజ్ లో ఉన్న జీ టీవీ సీరియల్స్ ను దాటుకుని మా టీవీ సీరియల్స్ టాప్ పొజిషన్ కు చేరుకున్నాయి. వీటిలో కార్తీక దీపం మొదటి ప్లేస్ లో ఉండగా .. రాధమ్మ కూతురు సీరియల్ తో జీ టీవీ పోటీ పడుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ లో విన్నర్ గా భావించిన ఆలీ ఎలిమినేటి కావడం విస్తు పోయేలా చేసింది. చివరకు ఎవరు గెలుస్తారనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి