శివప్రసాద్ ఇక లేరు

మాజీ ఎంపీ, తెలుగుదేశం సీనియర్ నాయకుడు శివప్రసాద్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో పార్టీ గొప్ప కళాకారుడు, సామాజిక చైతన్యం కలిగిన రాజకీయ నాయకుడిని కోల్పోయింది. ఆయన పలు సినిమాల్లో నటించారు. గతకొంత కాలంగా ఆయన కిడ్నీ సంబంధిత  వ్యాధితో బాధ పడుతున్నారు.ఆయనకు 68  ఏళ్ళు. చిత్తూర్ జిల్లా పొట్టిపల్లిలో 1951 లో జన్మించారు. తిరుపతిలోని ఎస్వీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సమాచార శాఖా మంత్రిగా పని చేశారు. ఎంపీగా గెలిచారు. అనేక పార్లమెంటరీ కమిటీలలో సభ్యుడిగా పని చేశారు. రాష్ట్ర విభజన సమయంలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు.

శివప్రసాద్ కు కళలన్నా, సాహిత్యమన్నా యెనలేని ప్రేమ. స్వతహాగా కళాకారుడైన ఆయన పాటలు, పద్యాలు పాడటంలో ఆయనకు ఆయనే సాటి. నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. సమైక్య ఆంధ్ర పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. శివ ప్రసాద్ స్వతహాగా రంగస్థల నటుడు. ఎన్నో వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. అనుకోకుండా సినిమా రంగంలోకి ప్రవేశించారు. క్యారెక్టర్ నటుడిగా , ప్రతి నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో నటించి మెప్పించారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. తులసి, దూసుకెళ్తా, ఆటాడిస్తా, మస్కా, కుబేరులు, ఒక్క మగాడు, కితకితలు, డేంజర్, ఖైదీ చిత్రాల్లో నటించారు. మరో వైపు ప్రేమ తపస్సు, టోపీ రోజా స్వీటీ రాజా , ఇల్లాలు, కొక్కరోకో సినిమాలకు డైరెక్షన్ చేశారు.

ఆయన భార్య కూడా డాక్టర్. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న రోజాను టీడీపీలో వచ్చెనందుకు కృషి చేశారు. శివప్రసాద్ ఎల్లప్పుడు ప్రజల మధ్యనే వున్నారు. ఆయన మృతితో చిత్తూరు జిల్లాతో పాటు ఏపీ మంచి నాయకుడిని, రాజకీయ వేత్తను కోల్పోయింది. శివప్రసాద్ తనకు అత్యంత ఆత్మీయమైన స్నేహితుడని ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నారు. కళాకారుడిగా తన పాటను, వేష ధారణను ఇష్టపడేవాడని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శివప్రసాద్ కలిసి చదువుకున్నారు. చిత్తూరు జిల్లా అభివృద్ధిలో శివప్రసాద్ కీలక పాత్ర పోషించారు. దేశ వ్యాప్తంగా తన వేషధారణతో  ఆకట్టుకున్నారు. ఎంతో ప్రేమాస్పదమైన వ్యక్తిగా శివప్రసాద్ చివరి వరకు ఉన్నారు. రాజకీయ నాయకుడి కంటే టీడీపీ హృదయమున్న కళాకారుడిని కోల్పోయింది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!