ఆదిత్య అదుర్స్ .. ఓయో సూపర్
రితీష్ అగర్వాల్ ఏ ముహూర్తంలో ఓయోను స్టార్ట్ చేశాడో కానీ పట్టిందల్లా బంగారమే అవుతోంది. ప్రపంచ ఆతిథ్య రంగాన్ని ఓయో శాసిస్తోంది. అమెరికా, చైనా, ఇలా ప్రతి దేశంలో ఓయో తన హవాను కొనసాగిస్తోంది. రూములు అద్దెకు ఇవ్వడంతో ప్రారంభమైన ఈ కంపెనీ ఇప్పుడు డాలర్లను కొల్లగొడుతోంది. ఇండియాతో ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వే చైనాలో సైతం రితీష్ అగర్వాల్ సక్సెస్ అయ్యాడు. ఇండియాకు ఉన్న పవర్ ఏమిటో చెప్పాడు. అంతేనా దిగ్గజ హోటల్స్ కు ముచ్చెమటలు పట్టిస్తూ రోజుకో నిర్ణయంతో తన ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటూ వెళుతున్నాడు. ప్రపంచంలోనే ఆతిథ్య రంగంలో 30 శాతానికి పైగా ఓయో వాటాను పెంచుకునేలా చేశాడు. కాలేజీ మానేసిన ఈ కుర్రాడు. హోటల్స్ లో బుకింగ్ కోసం 2012 లో ఓ వెబ్ సైట్ తాయారు చేశాడు. 2013 లో థాయి ఇంటర్నేషనల్ ఫెలోషిప్ సాధించాడు.
ఇండియా నుంచి ఫెలోషిప్ అందుకున్న మొదటి వ్యక్తి ఇతడే. వెబ్సైట్ పేరును ఓరావెల్ గా మార్పు చేశాడు. పేరు పలకడం ఇబ్బందిగా ఉంటుందని అనుకున్న రితేష్ దానిని ఓయో గా మార్చేశాడు. ఆనాడు చిన్న గదిలో స్టార్ట్ అయిన ఈ స్టార్ట్ అప్ ఇప్పుడు వేలాది కోట్ల రూపాయలను సాధించే కంపెనీగా ఎదిగింది. 2014 లో ఓయోకు పెట్టుబడులు వచ్చాయి. 2015 లో ఓయో యాప్ ను స్టార్ట్ చేశాడు రితీష్ . 100 నగరాలు, 10000 వేల రూములు బుకింగ్ చేసే స్థాయికి ఓయో చేరుకుంది. 2016 లో ఓయో మలేషియా లో ఎంటర్ అయ్యింది. 2017 లో నేపాల్, చైనాలోకి ప్రవేశించింది. 2018 లో యుకె, ఇండోనేషియా, యూఏఈ లలో స్టార్ట్ చేసింది ఓయో . 2019 లో వియత్నాం, ఫిలిప్పైన్స్ , సౌదీ అరేబియా, జపాన్, అమెరికాలో తన బిజినెస్ ను ప్రారంభించాడు రితీష్. అమెరికాలోని పేరున్న హోటల్స్ తో ఓయో జత కట్టింది. అమెరికాలో జెండా ఎగురవేసిన ఘనత మనోడిదే. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఓయో ఉండాలన్నదే ఈ చైర్మన్ కల.
అది త్వరలోనే నెరవేరడం ఖాయమంటున్నారు ఓయో సీయివో ఆదిత్య ఘోష్. ఇండిగో లో పని చేశాక ఓయోలో చేరాడు. రితీష్ కు కుడి భుజంగా ఉంటూనే ఓయో ను మరింత విస్తరించేలా ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా ప్రకటించిన వరల్డ్ వైడ్ లిస్టులో అత్యంత నమ్మకమైన బ్రాండ్ గా ఓయో టాప్ 100 లో ఒకటిగా నిలిచింది. దీని వెనుక రితీష్ తో పాటు అఆదిత్య కూడా ఉన్నారు. ఇండియా అంతటా ఎక్కడికి వెళ్లినా ఓయో నే దర్శనమిస్తుంది. ఇటీవల ఆయా హోటల్స్, లాడ్జ్ యజమానులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో ఓయో డబ్బులు పే చేస్తోంది. ఇది కూడా ఓనర్స్ కు అదనపు ఆదాయం సమకూరుతోంది. నగరాలకే పరిమితమైన ఓయో ను చిన్న చిన్న పట్టణాలకు విస్తరించాలన్నది టార్గెట్ గా పెట్టుకున్నారు. డేటింగ్ లో ఉన్న జంటలకు ప్రత్యేకంగా రూములను ఏర్పాటు చేస్తోంది ఓయో . దీంతో ఎక్కడికి వెళ్లినా టూరిస్టులు, ఇతరులు , ప్రవాస భారతీయలు అంతా ఓయో జపం చేస్తున్నారు. ఒక్కసారిగా త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నీ కునారిల్లి పోయాయి ఓయో కొట్టిన దెబ్బకు. ఒకే ఒక్క ఐడియా ఇప్పుడు ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసేస్తోంది. రితీష్ సాధించిన ఈ సక్సెస్ సామాన్యమైనది కాదు కదూ.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి