దిగ్గజ మొబైల్స్ కంపెనీల మధ్య పెరిగిన పోటీ
ఇండియన్ మార్కెట్ ను చైనా స్మార్ట్ ఫోన్స్ డామినేట్ చేస్తున్నాయి. ఓ వైపు అమెరికా కంపెనీ యాపిల్ , శాంసంగ్ , వన్ ప్లస్ కంపెనీల మొబైల్స్ ఇప్పటికే ఉన్నాయి. మరో వైపు ఇండియాలో బిగ్ డిమాండ్ ఉండడంతో అన్ని మొబైల్స్ కంపెనీలన్నీ ఇండియా జపం చేస్తున్నాయి. గత కొంత కాలంగా ఎన్ని కొత్త మోడల్స్ మార్కెట్ లోకి వచ్చినా చైనా మొబైల్స్ కు పోటీ ఇవ్వలేక పోతున్నాయి. ధరల్లో భారీ తేడాలు ఉండడం, సేమ్ టూ సేమ్ ఫీచర్స్ ఉండడంతో చైనా మొబైల్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇదే కంట్రీకి చెందిన వివో, ఒప్పో, షావోమి , జేడీటీఈ, టీసీఎల్, అల్కా టెల్ , హువాయి , కూల్ పాడ్ కంపెనీల స్మార్ట్ ఫోన్స్ పోటాపోటీగా అమ్ముడు పోతున్నాయి. ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ లో భారీ ఆఫర్లు, బిగ్ డిస్కౌంట్స్ తో కస్టమర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో దిగ్గజ కంపెనీల మొబైల్స్ అమ్మకాలు పూర్తిగా తగ్గు ముఖం పట్టాయి.
ఒకప్పుడు యాపిల్ ఫోన్స్ మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయంటే చాలు జనం క్యూ కట్టే వారు. కానీ ఆ సీన్ కనిపించడం లేదు. యాపిల్ కు శాంసంగ్ పోటీ ఉన్నప్పటికీ చైనా మొబైల్స్ సూపర్ గా అమ్ముడవుతున్నాయి. ఇక ఒక్కో కంపెనీ ఒక్కో స్ట్రాటజీతో ముందుకు వెళుతోంది. కొన్ని కంపెనీలు ఈ కామర్స్ కంపెనీలతో టై అప్ పెట్టుకు న్నాయి. దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. పైగా టైమ్ తో పాటు మనీ సేవ్ అవుతోంది. స్టోర్ రూమ్స్ ఏర్పాటు చేయాలంటే పెద్ద ప్రాసెస్. బిజినెస్ కావాలంటే సెంటర్లో ప్లేస్ కావాల్సి ఉంటుంది. సిబ్బంది, స్టోర్ నిర్వహణ, ఇతర ఖర్చులు అన్నీ భారమవుతాయి. ఎప్పుడూ లేనంతగా కంపెనీల మధ్య పోటీ వల్ల ఏ కంపెనీ ఎప్పుడు తన మొబైల్స్ ధరలను తగ్గిస్తుందో తెలియడం లేదు. దీంతో కస్టమర్స్ తక్కువ ధరలు, ఎక్కువ ఫీచర్స్ ఉండే వాటికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు.
ఇప్పటికే మొబైల్స్ షాప్స్ , రెటైల్స్ షాప్స్ తో చైనా కంపెనీలు నేరుగా ఒప్పందం చేసుకుంటున్నాయి. ఇక లెనోవో మోటోరోలా ను టేకోవర్ చేసుకుంది. ఇప్పుడు ఇది కూడా చైనాకు చెందిన కంపెనీగా మారి పోయింది. ఇప్పటికే ఇండియా అంతటా లెనోవో మొబైల్స్, లాప్ టాప్స్, మొబైల్ , కంప్యూటర్స్ యాక్సెససరీస్ ను తన అవుట్లెట్స్ ద్వారా అమ్ముతోంది. ఇదే సమయంలో అనూహ్యంగా చైనాకు చెందిన షావో మీ అన్ని కంపెనీలను తోసిరాజని ఇండియాలో అమ్మకాల్లో టాప్ రేంజ్ లోకి చేరుకుంది. ఇప్పటికే 100 మిలియన్ల తన ప్రోడక్ట్స్ ను విక్రయించి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా షావోమి అగుపిస్తోంది. మొబైల్స్ తో పాటు లెడ్ టీవీలను తీసుకు వచ్చింది. అత్యంత తక్కువ ధరల్లో అందించడంతో షావోమి అతి తక్కువ కాలంలోనే బిగ్ సక్సెస్ మూటగట్టుకుంది. ఈ కంపెనీకి మనోజ్ జైన్ కంట్రీ హెడ్ గా ఉన్నాడు. ఇతను వచ్చాక కంపెనీ రూపు రేఖలను మార్చేశాడు. మొత్తం మీద ఇండియాలో చైనా కంపెనీలే హవా చెలాయిస్తున్నాయి. దిగ్గజ కంపెనీలకు చుక్కలు చూపిస్తున్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి