సక్సెస్ దేముంది బాస్ .. ఓటమి ఇచ్చే కిక్కేవేరు
అపజయం, ఓటమి, అవమానం ఇవ్వన్నీ బతుకులో మామూలే. ఫెయిల్యూర్ అన్నది ఓ ప్రయాణం మాత్రమే. అది నేర్పే పాఠం ఇంకెవ్వరూ నేర్పించలేరు. విజయంలో అందరూ దగ్గరవుతారు. కానీ అపజయం మనల్ని వరించినప్పుడు ఏ ఒక్కరూ మనతో ఉండరు. ఆ దరిదాపుల్లో చూద్దామన్నా కనిపించరు. లోకం నువ్వు ఎన్ని మెట్లు ఎక్కి వచ్చావని చూడదు. ఎంత మందిని దాటుకుని గెలుపు వాకిళ్ళల్లో తోరణాలు కట్టావన్నదే చూస్తుంది. అప్పుడే నీకు లోకం సలాము చేస్తుంది. చరిత్ర అంటే విజేతల చరిత్ర కాదు. అది కోట్లాది జనం బలిదానాల, ఆత్మ త్యాగాల సమ్మేళనమే చరిత్ర. ప్రతి పేజీలో రక్తపు మరకలు లేకుండా హిస్టరీ ఉన్నదా. నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం అని అనలేదా..గొంతు చించుకు అరవలేదా మహాకవి శ్రీ శ్రీ. సక్సెస్ సమాజంలో ఓ గుర్తింపును, ఇమేజ్ ను ఇస్తుంది. కానీ సముద్రమంత జీవితాన్ని ఈదాలంటే మాత్రం ఓటమి మనల్ని పలకరించాల్సిందే.
అందుకే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ చోట అంటాడు..ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అని. చూస్తే చిన్న పదాలు. కానీ కొన్ని తరాలకు సరిపడా కిక్కు వుంది ఇందులో. అది కొందరికే సాధ్యం. ఈ జర్నీ ఎప్పుడూ ఉండేదే..కానీ కలుస్తాం..విడిపోతాం. మాటలు మాత్రం అలాగే వుండి పోతాయి. కొన్ని గాయం చేస్తాయి. కొన్ని పదాలు పెదవులను దాటి రావు. కానీ ఇంకొన్ని మాత్రం వెంటాడుతూనే ఉంటాయి. ప్రపంచాన్ని శాసించే ఒకే ఒక్క దేశం అమెరికాలో ప్రెసిడెంట్ పదవికి ఎనలేని డిమాండ్ ఉంటుంది. ఆ అత్యున్నత పదవి కోసం ఎందరో పోటీ పడతారు. ఒకానొక సమయంలో అబ్రహం లింకన్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. తొమ్మిది సార్లు ఓటమి పొందారు. కానీ పదో సారికి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం చేసాక అయన ఒకే ఒక్క మాట చెప్పారు.
నేను పోటీ చేసిన ప్రతి సారి ఓటమి పొందానని మీరు అనుకుంటున్నారు. కానీ నాకు మాత్రం విజయానికి కావాల్సిన బలాన్ని ఇచ్చింది. గుండె ధైర్యం కలిగింది. అపజయం నేర్పిన ఈ అనుభవం ఈ దేశాన్ని ఎలా పరిపాలించాలో తెలిసేలా చేసింది. దీనిని నేను అపజయంగా భావించడం లేదు అని స్పష్టం చేసారు. సో..ఓటమి ఇచ్చే కిక్కు సక్సెస్ ఇవ్వలేదు. అందుకే పాడు పడిన ఇళ్లల్లో బలమైన దూలాలు ఉంటాయి. మూత పడిన సంస్థలలో సమర్థులైన వారుంటారు. పఠనం..అపజయం..ఫెయిల్యూర్ ..ఓటమి కూడా ఓ స్థితే ..అదే అంతిమం కాదు. ఇంతకంటే ఇంకేమీ అక్కర్లేదు. అందుకే నేటికీ జార్జి వాషింగ్టన్, లింకన్, మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ , నెల్సన్ మండేలా, లెనిన్, క్యాస్ట్రో , చావెజ్, చేగువేరా, మహమ్మద్ అజహరుద్దీన్ ..ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో అవమానాలు ఎదుర్కున్న వారే. అపజయం పొందిన వాళ్ళే. ఫీనిక్స్ పక్షిలాగా తిరిగి గెలుపు అంచులను అందుకున్నారు. నేటికీ స్ఫూర్తి దాయకంగా ఉన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి