యప్ టీవీకి బంపర్ ఆఫర్

ఒకప్పుడు వార్తలు వినాలన్నా, చూడాలన్నా చాలా ఇబ్బందులు ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బందులంటూ ఏమీ లేవు. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడుకలోకి వచ్చిందో ఇక ప్రపంచ స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ఇంటర్నెట్ దెబ్బకు లోకం చిన్నదై పోయింది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ భారీ ఎత్తున తమ సేవలను దేశమంతటా విస్తరించడంతో కోట్లాది మంది నెట్ తో కనెక్ట్ అవుతున్నారు. న్యూస్, ఎంటర్ టైన్మెంట్ రంగాలు రాకెట్ కంటే వేగంగా దూసుకు వెళుతున్నాయి. వినోద రంగం మాత్రం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇక భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రపంచంలోనే అత్యంత అత్యధిక ఆదాయం కలిగిన క్రికెట్ సంస్థగా పేరు తెచ్చుకున్నది. ఇప్పటికే దాని టెలికాస్ట్ హక్కులను స్టార్ టీవీ సీయివో ఉదయ్ శంకర్ వేలం పాటలో భారీ ఆఫర్ ఇచ్చి చేజిక్కించుకున్నాడు.

భారతీయ క్రీడా రంగంలో ఇది ఓ రికార్డుగా నమోదు అయ్యింది. 1647 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు. ఇంతకు ముందెన్నడూ ఇంత పెద్ద మొత్తంలో ఓ టీవీ యాజమాన్యం భారీ ఎత్తున వేలం పాడింది లేదు. ఉదయ్ శంకర్ ముందు చూపుతో తీసుకున్న ఈ డెసిషన్ ..స్టార్ టీవీకి ఎనలేని ఆదాయం సమకూరుతోంది. తాజగా ఆసియా వార్తలను ముందుంచడంలో ప్రపంచ వ్యాప్తంగా దూసుకు పోతున్న ఇంటర్‌నెట్‌ ఆధారిత స్ట్రీమింగ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ యప్‌ టీవీ తమ సేవలను మరింత విస్తరించేందుకు శ్రీకారం చుట్టింది. ఏకంగా భారత్‌ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకుంది. 2019-20 సీజన్‌ కు గాను మ్యాచ్‌లను అందించడానికి బీసీసీఐతో యప్‌ టీవీ ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది తమ సర్వీసును మరింత విస్తరించాలని యోచిస్తున్న యప్‌ టీవీ.. ఈ మేరకు బీసీసీఐ నిర్వహించే హోమ్‌ సీజన్‌ మ్యాచ్‌లను ప్రసారం చేయడానికి సిద్ధమైంది.

యప్‌టీవీ ప్లాట్‌ ఫామ్‌ ద్వారా దక్షిణాఫ్రికా-భారత్‌ల సిరీస్‌తో పాటు మిగతా సిరీస్‌లను కూడా వీక్షించే అవకాశం లభించింది. ఇక నుంచి బీసీసీఐ హోమ్‌ సీజన్‌ మ్యాచ్‌లను యప్‌ టీవీ ప్లాట్‌ఫామ్‌పై అందించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు సీయివో వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులను దృష్టిలో పెట్టుకుని స్పోర్ట్స్‌ స్టార్స్‌ను ముందుకు తీసుకు వస్తున్నామన్నారు. మొత్తం 26  మ్యాచ్‌లను యప్‌ టీవీ అందించనుంది. అదే సమయంలో బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్ల భారత్‌ పర్యటన మ్యాచ్‌లను కూడా యప్‌ టీవీ డిజిటల్‌  స్ట్రీమింగ్‌  ద్వారా వీక్షించవచ్చు. మొత్తం మీద యప్ టీవీ ఈ రూపకంగా బంపర్ అఫర్ కొట్టేసింది. ఇదంతా డిజిటల్ టెక్నాలజీలో వచ్చిన పెను మార్పులకు సంకేతం. 

కామెంట్‌లు