ప్రపంచంలోనే నెంబర్ వన్ - హీనా సింధు రికార్డు బ్రేక్
శాస్త్ర, సాంకేతిక రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను కలిగి ఉన్న ఇస్రో సైంటిస్టులు చంద్రుని వద్దకు చంద్రయాన్-2 ను విజయవంతంగా పంపించడంతో దేశమంతటా సంతోషం వ్యక్తమవుతున్న తరుణంలో..ఉన్నట్టుండి మరో రికార్డును స్వంతం చేసుకుంది ఇండియా. అదేమిటంటే ప్రపంచంలోనే పిస్టల్ షూటర్స్ పోటీల్లో ఏకంగా మన ఇండియాకు చెందిన హీనా సింధు టాప్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా నెంబర్ వన్ స్థానంలో నిలిచి చరిత్రను తిరగ రాసింది.
దీంతో భారత జాతి యావత్తు సైంటిస్టులకు , మొక్కవోని ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో దేశం పేరు నిలబెట్టిన హీనా సింధుతో పాటు పరుగు పందెంలో చిరుతపులిలా గోల్డ్ మెడల్ సాధించిన 19 ఏళ్ల సింధులకు జేజేలు పలికింది. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింది, దేశ ప్రధాని నరేంద్ర మోదీ, సోనియా, రాహుల్, ప్రియాంక, తదితరులు ఎందరో ప్రశంసలు కురిపిస్తున్నారు. పిస్టల్ షూటర్స్ అనేది చాలా కష్టమైన ఆట. దీనిపై ఎక్కువగా గురి పెట్టాల్సి ఉంటుంది. కానీ వీటన్నింటిని తట్టుకుని ముందుకు దూసుకు వెళ్లింది మన హీనా సింధు. బిడీఎస్ చదివిన ఈమె ఎన్నో కష్టాలను అనుభవించింది.
పంజాబ్ రాష్ట్రంలోని లూధియానాలో 1989 ఆగస్టు 29న జన్మించింది హీనా. షూటర్స్ ఆటకు సంబంధించిన సౌకర్యాలు ఎక్కువగా ఉండడంతో తన మకాంను ముంబయికి మార్చింది. వుమెన్స్ షూటింగ్ విభాగంలో నిర్వహించిన ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో తన ప్రతిభా పాటవాలతో ప్రపంచాన్ని విస్మయ పరిచేలా చేసింది సింధు. జర్మనీలో 2013లో జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో మొదటి స్థానం సాధించి..ఏకంగా గోల్డ్ మెడల్‌ను చేజిక్కించుకుంది. 2017లో న్యూఢిల్లీలో జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ టీంలో సభ్యురాలిగా ఉంటూనే నెంబర్ వన్‌గా ఉంటూ మరో బంగారు పతకాన్ని తీసుకుంది.
బీజింగ్‌లో జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీ్ల్లో రెండో స్థానం పొందింది. 2014లో జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో రెండో పొజిషన్‌లో ఉండగా, డిల్లీలో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్‌లో టాప్ వన్‌లో నిలిచింది. ఏకంగా బంగారు పతకాన్ని ముద్దాడింది. 2018లో 25 మీటర్ల పిస్టల్ పోటీల్లో మరో పతకాన్ని చేజిక్కించుకుంది. 2010, 2014, 2018 సంవత్సరాలలో వివిధ దేశాలలో జరిగిన పిస్టల్ షూటర్స్ పోటీల్లో హీనా టాప్ రేంజ్ దక్కించుకుంది. పతకాలు సాధించింది. ఏసియన్ గేమ్స్ లలో హీనా ఆట తీరును చూసిన జనం ఫిదా అయి పోయారు. ఒక్కసారి గురి పెడితే ఇక అంతే. అంతలా ఆమె తన ఆటతీరును మెరుగు పర్చుకున్నారు.
2013లో రోనిక్ పండిట్‌ను పెళ్లి చేసుకుంది హీనా. అతను కూడా మేల్ పిస్టల్ షూటర్. తన ఆటను మానుకుని ..తన భార్య సింధును టాప్‌లో నిలిపేందుకు తానే కోచ్‌గా మారాడు. ఆమెను పరిణతి చెందిన క్రీడాకారిణిగా తీర్చిదిద్దాడు. 2006లో ఆమె తన కెరీర్‌ను ప్రారంభించింది. పిస్టల్ షూటర్స్ సీనియర్స్, జూనియర్స్ విభాగంలో తాను పార్టిసిపేట్ చేసింది. పాటియాలా క్లబ్‌లో సభ్యత్వం తీసుకుంది. ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు ఆమె. ఆడిన ప్రతి టోర్నమెంట్‌లో ఏదో ఒక మెడల్‌ను సాధించింది.
కేరళలో జరిగిన పిస్టల్ షూటర్స్ జాతీయ స్థాయి ఛాంపియన్ షిప్‌లో టాప్‌లో నిలిచి రికార్డు సృష్టించింది.ఈ ఘనతను సాధించిన మహిళ ఈమె ఒక్కరే కావడం విశేషం. 2016లో రియో డి జెనీరియోలో జరిగిన సమ్మర్ ఒలంపిక్స్ లో ఆమె భారత జట్టు తరపున పాల్గొన్నారు. తాజాగా ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకింగ్స్ ప్రకటించింది. మొదటి స్థానంలో ఇండియాకు చెందిన హీనా సింగ్ నిలిచి...ప్రపంచ రికార్డును బ్రేక్ చేసింది. ఆమె మరిన్ని పతకాలు సాధించాలని కోరుకుందాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి