ప‌క్కా లోక‌ల్..భారీగా రిక్రూట్‌మెంట్..ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం..!

సందింటి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత భారీ నిర్ణ‌యానికి శ్రీ‌కారం చుట్టారు. దేశంలో ఏ సీఎం తీసుకోని నిర్ణ‌యాన్ని ఆయ‌న ప్ర‌క‌టించారు. త‌మ రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ల‌క్ష‌లాది మంది నిరుద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పారు. ఏకంగా ఒక‌టి కాదు వంద‌లు కాదు..4 ల‌క్ష‌ల పోస్టుల‌ను త్వ‌ర‌లోనే భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు సీఎం వెల్ల‌డించారు. ఇందులో 75 శాతం స్థానికుల‌కే ఉద్యోగాలు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. ప‌రిశ్ర‌మ‌ల్లో కూడా వారికే ప్రాధాన్య‌త ఇస్తామ‌న్నారు. బీసీలు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీల‌కు ప‌ద‌వులతో పాటు పనుల్లో 50 శాతం కోటాను అమ‌లు చేస్తామ‌న్నారు. వీటిలో స‌గానికి పైగా మ‌హిళ‌లే ఉంటార‌న్నారు. కౌలు దారు ఇక సాగుదారుగా మార్చేస్తామ‌ని, శాశ్వ‌త బిసి క‌మిష‌న్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. విధాన‌స‌భ‌లో ఆరు ప్ర‌ధానమైన బిల్లులు పాస్ చేశారు. ఈ మేర‌కు ఏపీలో నామినేటెడ్ ప‌ద‌వులు, నామినేష‌న్ ప‌నుల్లో ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్లు, మొత్తం మీద మ‌హిళ‌ల‌కు మ‌రో 50 శాతం రిజ‌ర్వేష‌న్లు వ‌ర్తింప చేసే నాలుగు వేర్వేరు బిల్లుల‌ను ప్ర‌భ‌/త‌్వం స‌భ‌లో ప్ర‌వేశ పెట్టింది. 

వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల సంక్షేమ శాఖ మంత్రి శంక‌ర నారాయ‌ణ ఈ బిల్లుల‌ను స‌భ ముందుంచారు. అన్ని కార్పొరేష‌న్లు, ఏజెన్సీలు, సొసైటీలు, బోర్డులు, క‌మిటీల‌లో ప్ర‌భుత్వం నియ‌మించే ఛైర్మ‌న్లు, డైరెక్ట‌ర్లు, స‌భ్యుల ప‌ద‌వుల‌కు ఇది వ‌ర్తిస్తుంద‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. ఆయా కార్పొరేష‌న్, ఏజెన్సీ, సొసైటీ లేదా క‌మిటీని ఒక యూనిట్‌గా చేసుకుని రిజ‌ర్వేష‌న్‌ను అమ‌లు చేస్తామ‌ని వెల్ల‌డించింది. బీసీలు, మైనార్టీలల‌కు 29, ఎస్సీలు, ఎస్టీల‌కు 6 శాతం చొప్పున రిజ‌ర్వేష‌న్లు వ‌ర్తించ‌గా హిందూ దేవాదాయ ధార్మిక చ‌ట్టం -1987 , వ‌క్ఫ్ బోర్డు చ‌ట్టం -1995 ప్ర‌కారం భ‌ర్తీ చేసే నామినేష‌న్ పోస్టుల‌కు మాత్రం ఈ రిజ‌ర్వేష‌న్లు వ‌ర్తించ‌బోవంటూ స్ప‌ష్టం చేసింది స‌ర్కార్. నామినేటెడ్ ప‌ద‌వుల్లో మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేస్తారు. అన్ని ప‌నుల్లోను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల‌కు 50 శాతం వ‌ర్తింప చేయ‌నున్నారు. ప్ర‌భుత్వ ప‌నుల్లో కూడా వీరికి 50 శాతం వ‌ర్తిస్తుంది. కాగా జిల్లా స్థాయిలో రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేసే బాధ్య‌త ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు పూర్తి బాధ్య‌త వ‌హించాల్సి వుంటుందంటూ ప్రభుత్వం స్ప‌ష్టం చేసింది. 

ఏపీ స‌ర్కార్ ఉద్యోగాల క‌ల్ప‌నే ధ్యేయంగా ముందుకు క‌దులుతోంది. ఈ మేర‌కు భారీ ఎత్తున కొలువుల‌ను భ‌ర్తీ చేసేందుకు శ్రీ‌కారం చుట్టింది. ఆయా ప‌రిశ్ర‌మ‌ల్లో సైతం 75 శాతం ఉద్యోగాల‌ను స్థానికుల‌కు క‌ల్పించే బిల్లును ప్ర‌వేశ పెట్టింది. అయితే అవ‌స‌ర‌మైన అర్హ‌త‌లు, అనుభ‌వం క‌లిగిన అభ్య‌ర్థులు దొర‌క‌ని ప‌క్షంలో ..స్థానికుల‌నే ఎంపిక చేసుకుని..వారికి మూడేళ్ల పాటు ఆయా విభాగాల‌కు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేసింది. లోక‌ల్ క్యాండిడేట్ల‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని ప్రైవేట్ ప‌రిశ్ర‌మ‌ల మేనేజ్‌మెంట్లు ప్ర‌క‌టించినా అవి ఆచ‌ర‌ణ‌లో అమ‌లు కావ‌డం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని జ‌గ‌న్ ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. త‌ప్ప‌నిస‌రిగా స్థానికుల‌కే ఇవ్వాల‌నే నిబంధ‌న‌ను క‌చ్చితంగా అమ‌లు చేయాల్సిందేనంటూ ఆదేశించారు సీఎం. గ్రూప్ 1, గ్రూప్ 2 , గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల‌లో ఖాళీగా ఉన్న వేలాది పోస్టుల‌ను త‌క్ష‌ణ‌మే భ‌ర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేయాల‌ని సంబంధిత శాఖాధికారుల‌ను జ‌గ‌న్ ఆదేశించారు. దీంతో నిరుద్యోగులు, విద్యార్థుల‌లో ఆనందం వ్య‌క్త‌మ‌వుతోంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!