క‌న్న‌డ నాట క‌థ మారింది..ఉత్కంఠ‌నే మిగిలింది..!

దేశం ఓ వైపు చంద్రయాన్ -2 స‌క్సెస్‌తో సంబురాల్లో మునిగి పోతే..క‌ర్నాట‌క‌లో రాజ‌కీయం మ‌రింత హీటెక్కింది. రోజు రోజుకు ట్విస్టులు..వ్యూహాలు..ప్ర‌తివ్యూహాలు..ఎత్తులు..పై ఎత్తులు..రాజీనామాలు..డ్రామాలు..నిర‌స‌న‌లు..ఒక‌రిపై మ‌రొక‌రు దుమ్మెత్తి పోసుకోవ‌డాలు..ఆరోప‌ణ‌లు..విమ‌ర్శ‌లు..వెర‌సి ఆద్యంతమూ వేడిని పుట్టిస్తూ..ఏం జ‌రుగుతుందోన‌నే ఆందోళ‌న క‌లిగించే రీతిలో సంకీర్ణ అధికార ప‌క్షం..విప‌క్షం వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చాయి. దీంతో బంతి ఓ వైపు క‌ర్నాట‌క గ‌వ‌ర్న‌ర్ కోర్టులో చేరితో మ‌రో బంతి స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం కోర్టులోకి చేరింది. గ‌త కొన్ని రోజులుగా ఎడ‌తెగ‌ని ఉత్కంఠ‌ను రేపుతున్న క‌న్న‌డ రాజ‌కీయం మాత్రం దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తీసిన సినిమాల‌ను త‌ల‌పింప చేస్తున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్‌ల ఆధ్వ‌ర్యంలో సంకీర్ణ ప్ర‌భుత్వం నుంచి కొంద‌రు ఎమ్మెల్యేలు రాజీనామా స‌మ‌ర్పించ‌డంతో మొద‌లైన ఈ రాజ‌కీయ ఆట ..చివ‌ర‌కు ఎవ‌రు ఉంటారు..ఎవ‌రికి ప‌వ‌ర్ ద‌క్కుతుంద‌నే టెన్ష‌న్‌కు గురి చేశాయి.

రెబల్స్ ముంబ‌యిలోని హోట‌ల్‌లో బ‌స చేయ‌డం, త‌మ రాజీనామాల‌ను ఆమోదించ‌డం లేదంటూ సుప్రీంకోర్టు మెట్లు ఎక్క‌డం, దీనిపై త‌మ‌కు ఎలాంటి అధికారాలు లేవ‌ని స్పీక‌ర్ దే తుది నిర్ణ‌య‌మ‌ని తేల్చ‌డం జ‌రిగింది. అయితే పూర్తి అధికారాలు మాత్రం స‌భాప‌తికి ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేసింది. ఎవ‌రైనా ..ఎంత‌టి వారైనా స‌రే రాజ్యాంగానికి కంక‌ణ బ‌ద్దులై ఉండాల్సిందేన‌ని ధ‌ర్మాస‌నం వెల్ల‌డించింది. దీంతో క‌థ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. ఎమ్మెల్యేలు స‌మ‌ర్పించిన రాజీనామాలు చెల్ల‌వంటూ స్పీక‌ర్ ర‌మేష్ కుమార్ వెల్ల‌డించారు. స్పీక‌ర్ ఫార్మాట్‌లో లేవంటూ తేల్చి చెప్పారు. దీంతో మ‌ళ్లీ రాజీనామాలు చేస్తూ లేఖ‌లు ఇచ్చారు. స‌భ‌లో అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టాల‌ని..త‌మ బ‌లాన్ని నిరూపించు కోవాల‌ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ స్పీక‌ర్‌ను , సీఎంను ఆదేశించారు. ఈ మేర‌కు లేఖ‌లు కూడా పంపించారు. దీనిని స్పీక‌ర్ ర‌మేష్ కుమార్ బేఖాత‌ర్ చేశారు. త‌న ప‌రిమితులు ఏమిటో..త‌న విధి విధానాలేమిటో..త‌న‌కు పూర్తిగా తెలుసున‌ని, గ‌వ‌ర్న‌ర్ ప్ర‌భుత్వాన్ని కాపాడ‌టం, రాజ్యాంగ విలువ‌ల‌ను ప‌రిర‌క్షించాలే కానీ..ఇలా త‌న‌పై ఆధిప‌త్యం చెలాయించ‌డం స‌బ‌బు కాదంటూ ఘాటుగా స‌మాధానం ఇచ్చారు. దీంతో గ‌వ‌ర్న‌ర్ తీవ్ర అస‌హ‌నానికి గురై..ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొన‌డంతో స‌భ‌ను వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తిరిగి రెండు రోజుల త‌ర్వాత స‌భ ప్రారంభం కావ‌డంతో మ‌ళ్లీ క‌థ మొద‌టికి వ‌చ్చింది. కావాల‌నే సంకీర్ణ స‌ర్కార్ డ్రామాలు ఆడుతోందంటూ బీజేపీ అధినేత యెడ్డీ గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే బ‌ల నిరూప‌ణ చేసుకోవాల‌ని కోరారు. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని కోరుతూ కాంగ్రెస్ నేత గుండురావు, సీఎం కుమార స్వామిలు కోర్టును ఆశ్ర‌యించారు. తీవ్ర ఉత్కంఠ మ‌ధ్య స‌భ‌ను మ‌ళ్లీ వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. ఎవ‌రికి వారు చ‌ర్చ‌ల్లో మునిగి పోయారు. రాత్రి 11.40 నిమిషాల వ‌ర‌కు స‌భ సాగింది. మ‌ళ్లీ ఓటింగ్ నిర్వ‌హించాల‌ని తెలిపారు స్పీక‌ర్. విశ్వాస ప‌రీక్ష‌కు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించిన సీఎం ..వాయిదా వేసే దిశ‌లోనే ప్ర‌య‌త్నం చేశారు. కాగా విప్ అధికారాల‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వ‌డంతో సీఎల్పీ నేత సిద్ధిరామ‌య్య లేవ‌నెత్తిన అభ్యంత‌రానికి స్పీక‌ర్ రూలింగ్ ఇచ్చారు. పాల‌క ప‌క్షం స‌భ్యులు సుదీర్ఘ ఉప‌న్యాసాలు ఇవ్వ‌డంతో త‌మ‌కు ఛాన్స్ ఇవ్వాలంటూ విప‌క్షాలు ప‌ట్టుప‌ట్టాయి. స‌భ వాయిదా ప‌డింది. తిరిగి 8 గంట‌ల‌కు వాయిదా ప‌డింది. ఎంత‌కూ తేల్చ‌క పోవ‌డంతో మ‌రోసారి రేప‌టికి వాయిదా వేస్తున్న‌ట్లు ..ఓటింగ్ త‌ప్ప‌నిస‌రి చేస్తూ స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. మొత్తం మీద అధికార‌, విప‌క్షాల మ‌ధ్య ఎవ‌రు మిగిలి పోతార‌నేది ప్ర‌శ్న‌గానే మిగిలి పోయింది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!