మాట‌లే క‌దా మ‌న‌సు దోచేది..మాట‌లే క‌దా గుండెల్ని మీటేది..త్రివిక్రం పంచ్‌లు..!

తెలుగు సినిమా రంగంలో త‌న‌కంటూ ఓ స్టార్ డ‌మ్‌ను ఏర్పాటు చేసుకున్న ఒకే ఒక్క ద‌ర్శ‌కుడు త్రివిక్రం శ్రీ‌నివాస్. ర‌చ‌యితగా ప్ర‌స్థానం ప్రారంభించి దిగ్గ‌జ డైరెక్ట‌ర్‌గా ఎదిగిన ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. మ‌న‌సు బావో లేన‌ప్పుడు..గుండె మండుతున్న‌ప్పుడు..బ‌తుకు దుర్భ‌రమ‌ని అనిపించిన‌ప్పుడు..ఆయ‌న రాసిన మాట‌లు ..డైలాగ్స్ కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తాయి. వాట‌న్నింటిని ఏరికోర్చి ఇక్క‌డ మీకోసం.నాకోసం కూడా..త్రివిక్రం క‌లం ఇంకా రాటు దేలాలి. మ‌రికొన్ని మాట‌ల‌తో మంట‌లు రేపాలి. హృద‌యాలు తేలిక అయ్యేలా చేయాలి. సినీవాలిని ప‌రిపుష్టం చేయాలి.
1) సినిమా ఎందుకు గొప్పది అంటే,మందు కొట్టి పడిపోడం కంటే,డ్రగ్స్ లో మునిగి తేలడం కంటే,రోడ్డు చివర కూర్చుని అమ్మాయిలని ఏడిపించడం కంటే, థియేటర్ లో కూర్చుని ఒక హీరోని చూసిఇన్‌స్పైర్ అవ్వడం మంచిది. కచ్చితంగా మంచిది.
2) నాన్న కృతజ్ఞత కొరుకోడు ,, బ్రతికినంత కాలం నాన్నని ఒక జ్ఞాపకంలా గుర్తుంచుకుందాం !
3) రావణుడికి పది తలకాయలు ఉండొచ్చు , వాడి కోటకు లంకిణి కాపలా ఉండొచ్చు , అశోక వనానికి అడ్రస్ తెలియకపోవచ్చు
కానీ అవన్నీ దాటడానికి ఒక ఆంజనేయుడు ఎప్పుడైనా రావచ్చు.
4)అబద్దానికి నోరు పెద్దది, అన్యాయనికి చేతులు పెద్దవి.
5) సామి అంటే హామీ తానై ఉంటాడురా చివరంటా, లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు , ఏయ్ నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనేపోడూ
6) ఎవరైనా నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావ్ అంటే, ఊరి చివర మర్రి చెట్టులా ఉంటే మంచిది అని.
7)అతని కలలు గొప్పవైతే పైకి ఎక్కుతాడు అతని అలవాట్లు ఆశలు చెడ్డవైతే కిందకి పడిపోతాడు.
8) మనిషి గొప్పోడు అందరికంటే అతని కలలు కాని అతని ఆశయాలు కాని అతని అలవాట్లు కాని అతని జీవితంలో ఎంత ముందుకు తీసుకెళ్తున్నాయ్ లేదంటే ఎంత వెనక్కు తీసుకెళ్తున్నాయ్ అది..
9) చీకట్లో పోగొట్టుకున్న వస్తువును అక్కడే వెతకాలి వెలుగు ఉంది కదా అని వేరే చోట వెతకలేం!
10) జింకను వేటాడేటప్పుడు పులి ఎంత ఓపిగ్గా ఉంటుందో తెలుసా, అలాంటిది పులినే వేటాడాలంటే మనం ఎంత ఓపిగ్గా ఉండాలి.
11) జీతాలు ఇచ్చే వాడి మీద జోకులు వేస్తె జీవితం తలకిందులు అయిపోతుంది!
12) అబద్దం చెప్పడం ఎంత సులువో... నిజం చెప్పడం అంత కష్టం!
13) దేవుడైన రాముడు కూడా వాలిని వెనకనుండే చంపాడు, ముందు నుండి చంపడం చేతకాక కాదు చంపడం కుదరక.
14) అడగ్గానే నీ సీక్రెట్స్ అన్నీ నాకు చెప్పేసావ్ నేనెవరికైనా చెప్పేస్తే? నువ్వు అడిగావు కాబట్టి చెప్పలేదు.. నేను నమ్మాను కాబట్టి చెప్పాను. ఎందుకంటే హనుమంతుడి కన్నా రాముడి కి నమ్మకస్తుడు ఎవరుంటారు క‌నుక‌.
15) అబద్దానికి నోరు పెద్దది, అన్యాయనికి చేతులు పెద్దవి.
16) ఒక డైరెక్టర్ కి అభినందించే లక్షణం అర్ధం చేసుకునే జ్ఞానం లేకపోతే రచయిత వ్రాయలేడు.
17)ఇష్టం ఉంటే భయపడ కూడదు, భయపడితే ఇష్టపడకూడదు
18) ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు, పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం ఉండదు.
19)ఒక బూతు మాట్లాడి నవ్వించడం ఈజీ అందరికంటే ముందు ప్రతి వారూ నవ్వుతారు, కానీ నవ్విన వెంటనే మనల్ని చాలా తక్కువగా చూస్తారు కానీ , ఒక గొప్ప మాట మాట్లాడితే Maybe అర్ధంకాక వెళ్లిపోవచ్చు..కానీ వెళ్ళిపోతున్న దారిలోనైనా సరే అది ఆలోచనలోకి వస్తే మనల్ని ఫోన్ చేసి మరీ అభినందిస్తారు.
20) మనకంటే పెద్ద వాళ్ళంటే గౌరవం ఉండాలి,మన వయసు వాళ్ళతో పోటీ ఉండాలి. మనకంటే చిన్న వాళ్లంటే ప్రేమ ఉండాలి.

21) ఆక్సిడెంట్ అంటే కారో బైకో రోడ్డు మీద పడిపోవడం కాదు..ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవడం.
22) ఓ సాయంకాలంనీరెండ, ఓ సంక్రాంతిగొబ్బెమ్మ, ఓ ఆడపిల్లజడలో మొగలిపువ్వు, ఓ లేగదూడ మెడలోగంట, ఓ వర్షం ముందు వచ్చే మట్టివాసన, ఓ వేసవిలోఅమ్మకలిపేగొంగూరముద్ద,ఇలా మనతోమనం గడిపే సందర్భాల్లో విశ్వనాధ్ గారి సినిమాలుకూడా ఉంటాయి..!
23) పంటకి పురుగు పట్టిందని పొలం తాకట్టు పెట్టి మరీ పురుగు మందు కొని వాడాడు. మందు పని చెయ్యలేదు.అతనికి కోపం వచ్చింది ఆ మందు తనే తాగాడు.. పని చేసింది...పాపం చనిపోయాడు.
24) మనకు జ్వరం వచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది. భయమేసినప్ప్పుడు నాన్న ఉంటే దైర్యంగా ఉంటుంది.
బాధ వేసినప్పుడు పక్కన ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు మనం ప్రేమించిన వాళ్ళు ఉంటే బాగుంటుంది.
25) మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాలో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు.
26) వాడి కోపం ప్రళయం. వాడి ప్రేమ సముద్రం. వాడి జాలి వర్షం.
27) మోసం చెయ్యడం తప్పు కాని మోసపోవడం తప్పు కాదు. కన్నీళ్లు చాలా విలువైనవి విలువ లేని వాళ్ళకోసం వేస్ట్ చేయకూడదు..
28) అమ్మితే కొనుక్కో అది వ్యాపారం లాక్కోవద్దు అది దౌర్జన్యం.జీవితంలో ప్రతీ సమస్య మనిషికి రెండు దారులిస్తుంది ..ఒకటి ప్రేమతో ఉన్నది రెండు ద్వేషంతో కూడినది.
29) కౌరవులు జూదంలో గెలిచారు కురుకేత్రంలో ఓడిపోయారు..ఓడిపోయి ఉంటే బ్రదర్స్ అందరూ కలిసి ఇలా పార్టీ చేసుకుంటూ ఉండేవారేమో..కొన్నిసార్లు పట్టుకోవడం కంటే వదిలేయడం గొప్ప..గెలవడం కంటే ఓడిపోవడం గొప్ప.
30) పట్టుకోవడం గొప్పా?వదిలేయడం గొప్పా? గెలవడం గొప్పా ? ఓడిపోవడం గొప్పా? రావణాసురుడు సీతని పట్టుకున్నాడు రాముడి చేతిలో చచ్చాడు..వదిలేసి ఉంటే కనీసం బ్రతికి ఉండేవాడు..
31) మనకు ఇష్టంలేని పనులు ఎంత ఈజీగా ఉన్నా చెయ్యకూడదు.
32) ఒక మనిషిని కదిలించగలిగే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంటుంది, అక్షరానికి మాత్రమే ఉంటుంది..
33)విందా మీలాగే ఒక సాదారణ మనిషి..కానీ అతని ఆశయం మాత్రం సాయం కాలం నీడలా చాలా పెద్ద..
34) మన మీదకి సంధిస్తాడు..మన ఇంట్లోకి వస్తాడు..మన హాళ్ళో కూర్చుంటాడు..మన బెడ్ రూమ్ లో మన పక్కనే నిలబతాడు..మనల్ని క్వశ్చన్ చేస్తాడు..`రా ఎప్పుడూ ఒప్పుకోవద్దు ఓటమి '' అంటాడు మన తోటి.
35)ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయిన లేస్తాడు..ఆయిన రాత్రి ఉదయించే సూర్యుడు..అర్ద రాత్రి ఉదయించే సూర్యుడు..ఆయిన పదాలు అనే కిరణాలు తీసుకుని అక్షరాలు అనే తూటాలు తీసుకుని
ప్రపంచం మీద వేటాడటానికి బయలుదేరుతాడు రాత్రి పుట.రండి నాకు సమాధానం చెప్పండి..మనం సమాధానం చెప్పలేని ప్రశ్నల్ని.
36) సాంబార్ చప్పగా ఉంది..ఒరేయ్ గ్లాస్ మార్చండి ..సాంబార్ అనుకుని దోసెను మంచి నీళ్లలో ముంచుకుని తినేస్తున్నాడు.
37)పెళ్లా ఎందుకు?
భోజనానికి కష్టం అయిపోతుంది సార్
కుక్ ని పెట్టుకో.
ఇల్లు చూసుకోవడానికి కూడా ఎవరూ లేరు సార్?
కుక్కని పెంచుకో
ఇప్పటికిప్పుడు కట్నం ఇచ్చే కుక్క ఎక్కడ దొరుకుతుంది సార్
సెటైరా?
మీతో సెటైర్ వేస్తే రిటైర్ అయిపోతానని తెలుసు సార్..
38) మనకు తెలిసిన పని ఫ్రీ గా చేయకూడదు ..మనకు రాని పని ట్రై చేయకూడదు.
39) ఎప్పుడూ జరిగేదాన్ని అనుభవం అంటారు..ఎప్పుడో జరిగేదాన్ని అద్భుతం అంటారు.
40) ఆడవాళ్ళని గౌరవించండి మన సంప్రదాయం .ఏంటి అలా చూస్తున్నావ్ ఓల్డ్ గా ఉందనా,
మంచి విషయాలు ఎప్పుడు ఓల్డ్ గానే ఉంటాయి ..మార్చాలని ప్రయత్నం చేయకూడదు ఫాలో అయ్యిపోవాలి అంతే.

41) తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది..విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది.
42) ప్రేమించే వాడికి భయం ఉండకూడదు..భయపడే వాడు ప్రేమించకూడదు..భయపడుతూ ప్రేమించే వాడు బాధపడకూడదు.
43) గాలొస్తుందని మనమె తలుపు తీస్తాం , కాని ఆ గాలితొ పాటు దుమ్ము కుడా వస్తుంది .
44) వినే టైము ,చెప్పే మనిషి వల్ల... విషయం విలువే మారిపోతుంది.
45)మనం గెలిసినప్పుడు చప్పట్లు కొట్టే వాళ్ళు..మనం ఓడిపోయినప్పుడు.. భుజం తట్టే వాళ్ళు నలుగురు లేనప్పుడు..
ఎంత సంపాదించినా పోగొట్టుకున్నా తేడా ఏమి ఉండదు.
46) ఎవరైనా బస్సు దొరకకపోతే ఆటోలో వెళ్తారు అది దొరక్కపోతే రిక్షాలో వెళ్తారు. కానీ వెళ్లాల్సిన చోటుకి బస్సు దొరకలేదని వేరే రూట్ బస్సు ఎక్కుతామా? ప్రేమ కూడా అంతే మనకు నచ్చిన వాళ్ళు దొరకలేదని, దొరికిన వాళ్లతో సర్దుకుపోవడం కుదరదు.
47) నేను ఎవరికీ నచ్చకపోతే అది వాళ్ళ ప్రాబ్లం నాది కాదు.
48) మిమ్మల్ని చూసి నేను ఒకటి గ్రహించాను.."జీవితాన్ని చదివే వాడికి, జీతాలు సంపాదించడం పెద్ద లెక్కేంకాదు"
కొందరికి పుటినరోజు నాడు, డబ్బు ఖర్చు పెట్టాలి కానీ, మీ పుట్టినరోజుకు మాత్రం, అక్షరాలు వరసలో పెట్టాలి."పదాలకి ప్రాణం పోస్తారు అక్షరాలతో..( ఓ అభిమాని)
49) పిల్లని ఇచ్చేటప్పుడు డబ్బులు ఉన్నోడా? లేనోడా? అని కాదు..మనసున్నోడా, చెడు అలవాట్లు లేనోడా అని చూడండి ఎందుకంటే.."సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ సంస్కారం రాదు."
50) ఆకలేసి తినడానికి తిండి ఉండి తినకపోవడం ఉపవాసం.నిద్ర వచ్చినప్పుడు ఎదురుగా మంచం ఉండి కూడా పడుకోక పోవడం జాగారం ..కోపం వచ్చినప్పుడు చేతిలో కత్తి ఉండి తెగ నరకడానికి తల ఉండి కూడా నరకక పోవడమే మానవత్వం.
51) ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే ఆ వెదవ నవ్వు ఎందుకు?..సక్సెస్ లో ఏ వెదవ అయినా నవ్వుతాడు ఫెయిల్యూర్ లో నవ్వే వాడే హీరో..
52) నీ నవ్వు వరం..నీ కోపం శాపం..నీ మాట శాసనం.
53) క్లాస్ లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు..ఎగ్జామ్ లో రాసేవాడే టాపర్ అవుతాడు.
54) నిన్నెవరూ అర్ధం చేసుకోవటం లేదని, నీకు ఎవరూ సాయం చేయటం లేదని అంటున్నావు! అసలలా అనుకోవటమే తప్పు! నిన్నునీవే అర్ధం చేసుకుని, నీకునీవే సాయపడాలి!
55) అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. కానీ ..దురదృష్టం తలుపు తీసే వరకు తడుతుంది.
56) మనకు వస్తే కష్టం మనవాళ్లకు వస్తే నరకం.విడిపోవడం తప్పదు అన్నప్పుడు అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది.
57) అందరూ వెళ్లే దారిలో వెళ్లనంటున్నాడు అంటే ..ఆ వ్యక్తి మహా మేధావి అయినా అయి ఉండాలి, లేదా పిచ్చివాడు అయి ఉండాలి.
58) నా దగ్గర మీలాగా కోట లేకపోవచ్చు కానీ రాణి నా దగ్గర ఉంది.
59) తెలివితేటలు వాడాల్సింది ఎదుటివారిని మోసం చేయడానికో, మోసం చేస్తున్నారని తెలుసు కోవ‌డ‌డానికో కాదు పని చెయ్యడానికి అంతే... అంతకుమించి వాటివల్ల ఏ ఉపయోగం లేదు.
60) మాటలకందని మహర్షి, చూపులకందని శిఖరం. గడ్డం పెంచిన మేధావి,పెన్ను పట్టిన డిక్టేటర్..చివరగా బ్రొటనవేలు అడగని ద్రోణాచార్యుడు.

61) రోజు మనం వెన్నెలని చూస్తుంటాం. ఎప్పుడో ఒకసారే బాగుందనిపిస్తుంది..కానీ రోజూ అది అలాగే ఉంటుంది.తేడా అక్కడ లేదు మనలో ఉంది.
62) ఒక మనిషి ఎదిగాక అందరూ అతన్ని నమ్ముతారు..కానీ మనకు ఏమి లేనప్పుడు మనం ఏదన్నా సాధిస్తామని నమ్మేవాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు.
63) కారు అనగానే టైర్లు, బ్రేకులు, స్టీరింగ్ మాత్రమే కనబడతాయి. అన్నిటికన్నా ముఖ్యం పెట్రోలు. అది కనబడదు అది లేకుండా కారు నడవదు.
64) జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనకాల ఒక మినీ యుద్ధమే ఉంటుంది..
65) ఇది మనం కూర్చునే కుర్చీ! పచ్చని చెట్టుని గొడ్డలితో పడగొట్టి, రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి, బెరడుని బ్లేడుతో సానపెట్టి, ఒళ్ళంతా మేకులతో కొట్టి కొట్టి తయారుచేస్తారు.ఎంత హింస దాగుందో కదా!
66) రావిచెట్టుకు పూజ చేస్తాం దేవుడు అంటాం..కానీ అదే మన గోడలో మొలిస్తే పీకేస్తాం .
67) తెలిసి చేస్తే మోసం, చేసాక తెలిస్తే తప్పు. దేవుడి డెఫినేషన్ అర్ధం అయ్యింది. వాడు ఎక్కడో పైన ఉండదు, నీలోను నాలోనూ ఇక్కడే ఉంటాడు.అవతలివాడు సాయం కోసం అడిగినప్పుడు టపీమని బయటకు వస్తాడు.
68) నీకు ఏ ఊరంటే ఇష్టం ఏ కూరంటేఇష్టం ఏ రంగంటేఇష్టం అని..అన్ని విషయాల్లోనూ ఏదంటేఇష్టం అని అడుగుతాం..కానీ ఒక్క మనిషి విషయంలో మాత్రమే ఎందుకంటే ఇష్టం అని అడుగుతాం..ఒక మనిషిని ద్వేషించడానికి కారణాలు ఉంటాయి కానీ ప్రేమించడానికి కారణాలు చెప్పలేం..
69) అదే మనం తప్పుగా మనసుల్ని తీసేసి, మనుషుల్ని కూడి, స్వార్థాన్ని గుణించి, వ్యర్థంగా డివైడ్ చేస్తే అర్ధం లేని సున్నగా మిగిలి పోతుంది..
70) ప్రేమ అనేది ఎక్కాల పుస్తకంలో లెక్క లాంటిది..రెండు మనసులను కూడి, ఇద్దరు మనుషుల్ని తీసేసి,
ఆనందాన్ని గుణకారం చేసి, దుఃఖంతో భాగిస్తే ప్రేమ అనే శేషం మిగులుతుంది.
71) రావణుడికి పది తలకాయలు ఉండొచ్చు . వాడి కోటకు లంకిణి కాపలా ఉండొచ్చు ..అశోక వనానికి అడ్రస్ తెలియక పోవచ్చు ..కానీ అవన్నీ దాటడానికి ఒక ఆంజనేయుడు ఎప్పుడైనా రావచ్చు..
72) అందంగా ఉండటం అంటే మనకి నచ్చేలా ఉండటం, ఎదుటవాళ్ళకి నచ్చేలా ఉండడం కాదు.
73) మనం తప్పు చేస్తే తప్పని, కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పేవాళ్ళు మంచి వాళ్ళు ...మనం ఏమి చేసినా భరించే వాళ్ళు ప్రేమించే వాళ్ళు..
74) ఎవడన్నా కోపంగా కొడతాడు..లేకపోతే బలంగా కొడతాడు. వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏదో ఒక గోడ కడుతున్నట్టు...గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు..చాలా జాగ్రతగా పద్దతిగా కొట్టాడు రా ..ఆడు మగాడ్రా బుజ్జి.
75) వంట రుచి తినెదాక తెలీదు..పుస్తకం విలువ చదివెదాక తెలీదు..ప్రేమ విలువ, ప్రేమించే వాళ్ళని కోల్పోయేదాక తెలీదు.
76) పెళ్లంటే మూడు ముళ్ళు... ఏడు అడుగులు, పది మూరల మల్లెపూలు, పావు లీటరు పాలు కాదు, ఇద్దరు మనుషులు చచ్చేదాకా కలిసి చేయాల్సిన ప్రయాణం..
77) కోటి రూపాయల లాటరీలో ముప్పై లక్షలు టాక్స్ కింద పోతుంది, అందుకే అదృష్టం డిస్కౌంట్ లో వస్తుంది అంటారు. కానీ దురదృష్టం మాత్రం బోనస్ లో వస్తుంది.
78) ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నప్పుడు వచ్చే ఆనందం చాలా వర్ణనాతీతం.. చాలా అందంగా ఉంటుంది అది. దానిని ఎన్ని కోట్లిచ్చినా కొనలేం..
79) ఆడపిల్లకి గుణాన్ని మించిన ఆస్తి లేదు.బాధలో ఉన్న వాడిని బాగున్నావా అని అడగడం అమాయకత్వం..
బాగున్న వాడిని ఎలా ఉన్నావ్ ..అని అడగడం అనవసరం..
80) పెళ్ళి అనేది ఒకే తలుపున్న గది లాంటిది..పెళ్లి కానీ వాళ్ళందరూ ఎప్పుడు లోపలికి వెళ్దామా అని చూస్తుంటారు..
పెళ్లి అయిన వాళ్ళందరూ బయటకు ఎలా వచ్చేద్దామా అని చూస్తుంటారు.

81) మనల్ని చంపాలనుకునే వాడిని చంపడం యుద్ధం..మనల్ని కావాలనుకునే వాడిని చంపడం నేరం.. మనల్ని మోసం చేయాలనుకునే వాడిని చంపడం న్యాయం..
82) తండ్రికి, భవిష్యత్తుకి భయపడని వాడు జీవితంలో పైకి రాలేడు.
83) తగ్గాడు కదా అని పిండేయడానికి సూడకు బాలిరెడ్డి. అక్కడున్నది పాలిచ్చే ఆవు కాదు, పులి..!
84) సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు..చెప్పే దైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు.
85) వాడిదైన రోజు ఎవడైనా కొట్టగలడు, అసలు గొడవ రాకుండా ఆపుతాడు.. చూడు వాడే గొప్పోడు.
86) కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం.బాధ్యత లేని యవ్వనం..జ్ఞాపకం లేని వృద్యాప్యం అనవసరం.
87) కొన్ని సందర్భాల్లో మాట్లాడటం కంటే, మాట్లాడకుండా ఉండడం ఇంకా అందంగా ఉంటుంది.
88) జీవితంలో ఒక మంచి ఫ్రెండ్ ని సెలెక్ట్ చేసుకుంటే చాలు. లైఫ్ ధైర్యంగా ఉంటుంది అనడానికి ఉదాహరణ త్రివిక్రమ్..
89 ) మీ తాత కత్తి పట్టినాడు అంటే అది అవసరం. అదే కత్తి మీ నాయన ఎత్తినాడు అంటే అది వారసత్వం.. అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం... ఆ కత్తి నీ బిడ్డ నాటికి లోపం ఐతుందా ..!
90) డబ్బులున్న వాళ్ళందరూ ఖర్చు పెట్టలేరు..ఖర్చు పెట్టిన వాళ్ళందరూ ఆనందించ లేరు.
91 ) మనుషులు పుట్టాక, సంప్రదాయాలు పుట్టాయి. కానీ సంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు.
92) బాగుండడం అంటే బాగా ఉండటం కాదు. నలుగురితో ఉండటం ..నవ్వుతూ ఉండటం..!
93) భయం ఉన్నవాడు అరుస్తాడు. బలం ఉన్నవాడు భరిస్తాడు..
94) యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు ఓడించడం.
95) మనం ఇష్టంగా అనుకునేదే అదృష్టం. బలంగా కోరుకునేది భవిష్యత్తు.
96) ఒక మనిషికి ఉంటే కోపం..అదే ఒక గుంపుకుంటే ఉద్యమం.
97) పని చేసి జీతం అడగవచ్చు. అప్పు ఇచ్చి వడ్డీ అడగవచ్చు ..కానీ హెల్ప్ చేసి థాంక్స్ అడగకూడదు.
98) ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు.
99) అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించలేరు. జరిగిన తర్వాత ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరం లేదు.
100) ప్రేమంటే కలవడం కాదు - విడిపోవడమూ కాదు, జీవించడం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!