మోదీతో లంక మైత్రీ బంధం
దౌత్య సంబంధాలు మెరుగు పరుచు కోవడంలో నరేంద్ర మోదీ తర్వాతే ఎవ్వరైనా. ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీలంక ప్రధాన మంత్రి రాజపక్స కొడుకు, ఎంపీ నమల్ రాజపక్స కామెంట్స్ తో స్పష్టమైంది. ఇతర దేశాలతో స్నేహాన్ని కొనసాగించే అలవాటు ఎక్కువగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కు ఉందని కొనియాడారు ఈ యువ ఎంపీ. సరిహద్దు దేశాలతో సఖ్యతగా మెలిగేందుకు ఏమాత్రం వెనుకాడబోరన్న విషయం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. శ్రీలంక తాజా అధ్యక్ష ఎన్నికల్లో గోటబయ రాజపక్స గెలుపొందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తన సోదరుడు మహిందా రాజపక్సను ప్రధానిగా ఆయన ఎంపిక చేశారు.
మహిందాకు చైనాతో సత్సంబంధాలే ఉన్నాయి. ఆయన హయాంలో రక్షణ మంత్రిగా పనిచేసిన ప్రస్తుత అధ్యక్షుడు గోటబయ ఎల్టీటీఈ ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణిచి వేయడం, భారత్‌కు కనీసం సమాచారం ఇవ్వకుండానే చైనాకు చెందిన జలాంతర్గాముల్ని హిందూ సముద్ర జలాల్లోకి అనుమతినివ్వడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గోటబయ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అంశం ప్రస్తుతం చర్చ నీయాంశంగా మారింది. అంతేగాక ఇటీవలి ఎన్నికల్లో శ్రీలంకలో మైనార్టీలుగా ఉన్న తమిళులు, ముస్లింలు అధికంగా ఉండే శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో గోటబయకు పెద్దగా ఓట్లు రాక పోవడంతో భారత్, లంక బంధంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
భారత్, శ్రీలంక, చైనా దేశాల మధ్య ఉన్న సంబంధాల గురించి కొంత మంది తప్పుగా అన్వయిస్తున్నారు. నాయకుల్లో కూడా దీనిపై కొన్ని అపోహలు ఉన్నాయి. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ సరిహద్దు దేశాలతో బంధం మెరుగు పరచు కోవడంలో ఎల్లప్పుడూ ముందుంటారు. ఆయన పొరుగు దేశాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు అని నమల్ పేర్కొన్నారు. శ్రీలంక రాజకీయ పరిణామాలపై తమిళనాడు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను నమల్ ఖండించారు. శ్రీలంక ఇప్పుడు సంక్షోభంలో ఉంది. 30 ఏళ్లుగా ఇక్కడ పాశవిక యుద్ధాలు జరిగాయి. ఎల్టీటీఈ ఈ యుద్ధాలను సింహళీయులు, తమిళుల మధ్య శత్రుత్వంగా చిత్రీకరించింది. ఇది దారుణమైన విషయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి