నిత్యానంద కోసం ఖాకీల వేట
పలు లైంగిక ఆరోపణలు ఎదుర్కుంటున్న, వివాదాస్పద స్వామీజీగా పేరొందిన బిడిది ధ్యాన పీఠాధిపతి నిత్యానంద ఆచూకీ లభించడం లేదు. ఆయనను పట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ముందస్తుగానే అరెస్టు చేస్తారనే విషయం తెలుసుకున్న నిత్యానంద ఆశ్రమంలో లేకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. నిత్యానందకు లెక్కలేనంత మంది భక్తులు ఉన్నారు. ఆయన ప్రధాన ఆశ్రమం బెంగళూర్ లోని బిడిదిలో ఉంది. ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నాయి. నిత్యానంద జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అయినా ఇంకా ఆరోపణలు వెంటాడుతూనే ఉన్నాయి.
లైంగిక వేధింపులు, పలు వివాదాస్పద కేసులు ఎదుర్కొంటున్న నిత్యానంద ఏడాదిన్నరగా బిడది ధ్యాన పీఠానికి రావడం లేదు. స్వామీజీ కోసం ధ్యాన పీఠంలో వాకబు చేయగా ఆయన ఉత్తర భారత పర్యటనలో ఉన్నట్లు చెబుతున్నారు. గుజరాత్‌లోనూ నిత్యానందకు మఠం ఉండడంతో అక్కడకి వెళ్లి ఉండ వచ్చునని భావిస్తున్నారు. నకిలీ పాస్‌పోర్టు ఉపయోగించి నిత్యానంద ఆస్ట్రేలియా దగ్గర్లోని ద్వీపానికి వెళ్లినట్లు వార్తలొచ్చాయి. కాగా అహ్మదాబాద్‌లోని నిత్యానంద ఆశ్రమంలో నిర్భంధించిన తన ఇరువురు కుమార్తెలను విడిపించాలని ఓ తల్లిదండ్రులు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
కోర్టు ఆదేశాల మేరకు ఇరువురిని విముక్తి కల్పించిన పోలీసులు నిత్యానందతో పాటు అహ్మదాబాద్‌కు చెందిన ఇరువురు ఆశ్రమ ముఖ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వివాదాలు తారా స్థాయికి చేరడంతో నిత్యానంద ఆచూకీ తెలుసుకునేందుకు బిడిదిలోని ధ్యానపీఠంకు పోలీసులు వెళ్ళగా సమగ్ర సమాచారం ఇవ్వలేదు. నిత్యానంద బిడిది ధ్యానపీఠంకు వచ్చి కొన్ని నెలలు అయ్యిందని, అహ్మదాబాద్ ఆశ్రమంలో ఉండవచ్చునని తెలిపినట్లు సమాచారం. అయితే నిత్యానంద విదేశాలకు పారి పోకుండా ఉండేందుకు అధికారులు ముందస్తుగానే పాస్‌పోర్ట్‌ను రద్ద చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి