కాంగ్రెస్‌కు కాయ‌క‌ల్ప చికిత్స - ప్ర‌త్యక్ష పోరుకు రాహుల్ సిద్ధం

ప‌రిణ‌తి చెందిన నాయ‌కుడిగా రాహుల్ గాంధీ త‌న‌ను తాను మ‌లుచుకున్నారు. హుందాగా పార్టీలో ఏం జ‌రుగుతుందో పూస‌గుచ్చిన‌ట్టు చెప్పారు. వ‌య‌సు మ‌ళ్లిన వారు ప‌ద‌వుల‌ను, అధికారాన్ని అంటిపెట్టుకుని వుంటే పార్టీ మ‌నుగడ ఎలా సాధ్య‌మ‌వుతుంద‌ని రాహుల్‌జీ ప్ర‌శ్నించారు. దేశాన్ని సంస్క‌రించ‌డం కంటే పార్టీని ప్ర‌క్షాళ‌న చేయ‌డ‌మే ముఖ్య‌మని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీనే పార్టీకి అధ్య‌క్షుడిగా వుండాల‌ని ఒత్తిళ్లు పెరిగినా ఆయ‌న స‌సేమిరా ఒప్పుకోలేదు. కింది స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి దాకా ఘ‌న‌మైన పార్టీ కేడ‌ర్ క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ ఎందుకు ప‌వ‌ర్‌లోకి రాలేక పోయామ‌ని , ప్ర‌తి ఒక్క‌రు పున‌రాలోచించు కోవాల‌ని సూచించారు. పార్టీ అంటే స‌మూహం, ఏ ఒక్క‌రితోనో అది న‌డ‌వ‌దు. వంద‌లాది చేతులు క‌లిస్తేనే అనుకున్న‌ది సాధించ‌గ‌లం.

పార్టీని న‌డిపించ‌డం కంటే ముందు మ‌నం ఎక్క‌డ దారి త‌ప్పామో స‌మీక్షించు కోవాలి. అందుకు ప్ర‌త్యామ్నాయ మార్గాలు ఏవైనా ఉన్నాయా అనేది ఆలోచించు కోవాలి. పొద్ద‌స్త‌మానం ప్ర‌తిప‌క్షాల‌నో లేక వ్య‌క్తుల‌నో టార్గెట్ చేస్తూ కాలం గ‌డ‌ప‌డం మ‌న‌కు అలవాటుగా మారి పోయింది. అధికారంలో ఉన్న పార్టీ చేస్తున్న త‌ప్పిదాలు ఏమిటో గుర్తించ‌గ‌ల‌గాలి. వాటిని ఎత్తి చూపాలి. ప‌రిష్కారం కోసం కృషి చేయాలి. ఈ రోజు వ‌ర‌కు ప‌ద‌వుల కోసమే పార్టీలో చేరుతున్నారు. తాయిలాల‌కు ఆశ‌ప‌డి ఇత‌ర పార్టీల వైపు చూస్తున్నారు. ఏ పార్టీ అయితే మీకు స‌మాజంలో ఓ గుర్తింపును తీసుకు వ‌చ్చేలా చేసిందో దానిని మీరు మ‌రిచి పోతే ఎలా. నాయ‌కులు వ‌స్తుంటారు..వెళుతుంటారు.కార్య‌క‌ర్త‌లే ముఖ్యం. వారికి ఈ స‌మ‌యంలో ఆప‌న్న హ‌స్తం అందించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉన్న‌ది. దేశాన్ని మోడీ పాలించ‌డం లేదు, రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ ప‌రిపాలిస్తోంది. కీల‌క నిర్ణ‌యాలలో ప్ర‌ధాన‌మంత్రి ఓ బొమ్మ లాగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంతే.

పార్టీకి పూర్వ వైభ‌వం తీసుకు రావ‌డానికి నేను శాయ‌శ‌క్తులా కృషి చేస్తా. ఆరెస్సెస్ , బీజేపీల‌పై సైద్ధాంతిక‌మైన పోరు మాత్రం ఆగ‌ద‌ని రాహుల్ గాంధీ స్ప‌ష్టం చేశారు. జ‌ర్న‌లిస్టు గౌరీ లంకేశ్ హ‌త్య కేసులో ఆరెస్సెస్ పాత్ర ఉంద‌న్న ఆరోప‌ణ‌ల‌పై ప‌రువు న‌ష్టం కేసు ఎదుర్కొంటున్న రాహుల్ ముంబ‌యి కోర్టుకు హాజ‌ర‌య్యారు. గ‌డిచిన ఐదేళ్ల‌లో కంటే ఇంకా ఎక్కువగా పోరాటం కొన‌సాగుతుంది. స్వ‌యం సేవ‌క్ సంఘ్ పై తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న స‌మ‌ర్థించుకున్నారు. ఇదే కేసును సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఏచూరి కూడా ఎదుర్కొంటున్నారు. రాహుల్, ఏచూరిలు ఇద్ద‌రు బోనులో నిల‌బ‌డ్డారు. త‌మ వాద‌న‌లు వినిపించారు. తాము చేసిన వ్యాఖ్య‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని తెలిపారు. 15 వేల పూచీ క‌త్తుపై బెయిలు మంజూరుచేసింది. మొద‌టి నుంచీ సంఘ్ దేశ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల్లో పాల్గొంది. హింస‌కు ప్రోద్బ‌ల‌మిచ్చింది. మ‌హాత్ముడి హ‌త్య‌కు కార‌ణ‌మైందంటూ కాంగ్రెస్ తీవ్ర ప‌ద‌జాలంతో ఓ విడియోను విడుద‌ల చేసింది. రాహుల్ తీసుకున్న ఈ డిసిష‌న్ తో నైనా కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్లు త‌మ ప‌ద‌వులను వదులుకుంటారా లేక అంటిపెట్టుకుని వుంటారా చూడాలి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!