బ్లూ స్మార్ట్ లో దీపికా పదుకొనే పెట్టుబడి
ఇండియాను స్టార్ట్ అప్స్ ఏలుతున్నాయి. భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. డిఫరెంట్ ఐడియాస్ తో అంకురాలను ఏర్పాటు చేసే వారికి కంపెనీలు, బ్యాంకులే కాదు క్రీడా, సినిమా రంగాలకు చెందిన వారు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. తాజాగా ఎలక్ట్రిక్ ట్యాక్సీ స్టార్ట్ అప్ బ్లూ స్మార్ట్ లో ప్రముఖ నటి దీపికా పదుకొనే మూడు మిలియన్స్ ను పెట్టుబడిగా పెట్టింది. ఈ కంపెనీ ఢిల్లీ , ముంబై, హైదరాబాద్ లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇండియాలోనే అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటిగా దీపికకు పేరుంది. కాగా ఇప్పటి దాకా డ్రమ్స్ ఫుడ్ , బెల్లట్రిక్స్ ఎయిరోస్పెస్, మైంత్ర స్టార్ట్ అప్ లలో ఆమె పెట్టుబడులు పెట్టారు. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలన్న సామెతను ఈ ముద్దుగుమ్మ ఆచరిస్తోంది. సినిమా రంగం అన్నది జూదం లాంటిది. ఎప్పుడు స్టార్ డం ఉంటుందో తెలియదు.
అందుకే సంపాదించిన డబ్బులను ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేస్తే మరింత లాభాలు పొందవచ్చని దీపికా పదుకొనే ఆశ. ఆమె ఇన్వెస్ట్ చేసిన ప్రతి స్టార్ట్ అప్ సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. కాగా ఇప్పటికే బ్లూ స్మార్ట్ వ్యాపారం కూడా గాడిలో పడింది. తమ వ్యాపారాన్ని మరింత గా విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. వచ్చే 2020 నాటికల్లా 25 మిలియన్స్ డబ్బులను సేకరించాలన్నది టార్గెట్ గా పెట్టుకుంది. అంతే కాకుండా అల్ ఎలెక్ట్రిక్ స్మార్ట్ అర్బన్ మొబిలిటీ సర్వీసెస్ ను సింగపూర్, హాంగ్ కాంగ్ నగరాల్లో ఏర్పాటు చేసేందుకు ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. బ్లూ స్మార్ట్ స్టార్ట్ అప్ లో జిటో ఏంజిల్ నెట్ వర్క్ మూడు మిలియన్స్, సెంట్రమ్ వీసీ ఫండ్ , సర్వం పార్ట్నర్స్ , మైక్రో మాక్స్ కో ఫౌండర్ రాజేష్ ఆగ్వాల్ కొంత మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు.
అంతే కాకుండా బజాజ్ కేపిటల్ ఎండీ సంజీవ్ బజాజ్, మెకిన్సీకి మాజీ గ్లోబల్ ఎండీ రజత్ గుప్త , హీరో కార్పొరేట్ సర్వీసెస్ మాజీ ప్రెసిడెంట్ రోహిత్ చానాన పెట్టుబడులు పెట్టారు. నగరాలలో ఎలాంటి దుమ్ము , ధూళి లేకుండా, పర్యావరణాన్ని పరిరక్షించేలా సర్వీసెస్ అందజేస్తోంది బ్లూ స్మార్ట్. దీంతో దీనికి విపరీతమైన డిమాండ్ ఉండటం .. ఆదాయం రావడంతో ఇన్వెస్టర్స్ దీని వైపు చూస్తున్నారని బ్లూ స్టార్ కో ఫౌండర్ అన్మోల్ సింగ్ జగ్గీ వెల్లడించారు. ఈ అంకుర సంస్థను 2018 అక్టోబర్ లో పునీత్ సింగ్ జగ్గీ, పునీత్ కె గోయల్ స్థాపించారు. ఢిల్లీలో 200 ఎలక్ట్రిక్ కార్స్ ను ప్రవేశ పెట్టింది. మరో 500 విద్యుత్ కార్లతో ముంబై, హైదరాబాద్ నగరాలకు విస్తరించింది. మొత్తం మీద చాప కింద నీరులా బ్లూ స్మార్ట్ ..స్మూత్ గా దూసుకెళుతోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి