అత్యంత గౌరవ ప్రదమైన కంపెనీలు మనవే
అమెరికాకు చెందిన ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలో అత్యంత గౌరవ ప్రదమైన కంపెనీల జాబితాను వెల్లడించింది. ఇందులో మన భారత్ కు చెందిన కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. గతంలో లిస్టులో వెనుకబడిన ఇండియన్ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ ముచ్చటగా మూడో స్థానంలో నిలిచింది. తన సత్తాను చాటింది. అంతే కాకుండా ఈసారి ప్రకటించిన జాబితాలో 16 భారతీయ కంపెనీలకు చోటు దక్కడం విశేషం. గత ఏడాది 2018 లో ఇన్ఫోసిస్ ప్లేస్ 31 ఉండగా.. ఈసారి 3 లో నిలిచి విస్తు పోయేలా చేసింది. ఫోర్బ్స్ మొత్తం 250 కంపెనీలతో జాబితా రూపొందించింది. టీసీఎస్ , టాటా మోటార్స్, హెచ్ డి ఎఫ్ సి సహా ఇతర కంపెనీలు గతంలో కంటే మరింత మెరుగైన రాంక్ లు పొందాయి. ఉన్న వాటిలో టాటా గ్రూప్ కంపెనీస్ కు చెందినవి మూడు కంపెనీలకు చోటు దక్కింది.
వరల్డ్ వైడ్ గా చూస్తే సాంకేతికంగా సేవలు అందిస్తున్న వీసా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే కంపెనీ మూడో ప్లేస్ లో ఉండగా ఈసారి ఏకంగా ప్రథమ స్థానానికి ఎగబాకింది. మరో వైపు కిందటి ఏడాదిలో మొదట ఉన్న అమెరికాకు చెందిన వాల్ డిస్ని కంపెనీ ఏకంగా ఏడో ప్లేస్ కు పడి పోయింది. ఇక ఇండియాకు సంబంధించి ఇన్ఫోసిస్ కంపెనీతో పాటు టాటా మోటార్స్ , టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, హెచ్ డి ఎఫ్ సి , బజాజ్ ఫిన్ సర్వ్ , పిరమిల్ ఎంటర్ ప్రైజెస్ , సెయిల్ , హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ , హిందాల్కో ఇండస్ట్రీస్, విప్రో , సం ఫార్మా , జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ కంపెనీలున్నాయి. మొత్తం ప్రకటించిన వాటిలో ఎక్కువగా అగ్ర రాజ్యం అమెరికా దేశానికి చెందిన కంపెనీలకే చోటు దక్కింది. వీటిలో 59 కంపెనీలు ఉన్నాయి.
ఇక ఆసియా కాంటినెంట్ పరంగా చూస్తే చైనా, జపాన్, ఇండియా దేశాలకు చెందిన కంపెనీలు 89 దాకా వున్నాయి. గత ఏడాది కొన్ని కంపెనీలకే చోటు లభించగా ఈ ఏడాది మాత్రం అదనంగా మరి కొన్ని కంపెనీలు చేరాయి. ఆయా కంపెనీలను ఈ జాబితాలో ప్రకటించేందుకు ఫోర్బ్స్ భారీ ఎత్తున కసరత్తు చేసింది. కంపెనీల ఓవర్ ఆల్ పెర్ఫార్మెన్స్ , నమ్మకం, సామాజిక బాధ్యత, ఉద్యోగుల పనితీరు తదితర వాటిని పరిగణలోకి తీసుకుని ఆయా కంపెనీలకు రేటింగ్స్ ఇచ్చింది ఫోర్బ్స్. ఇక మొత్తంగా చూస్తే మొదటి ప్లేస్ లో వీసా కంపెనీ ఉండగా, రెండో ప్లేస్ లో ఫెరారీ, మూడో ప్లేస్ లో ఇన్ఫోసిస్, నాల్గో స్థానంలో నెట్ ఫ్లిక్స్ , ఐదో ప్లేస్ లో పే పల్, ఆరో స్థానంలో మైక్రో సాఫ్ట్ , ఏడో ప్లేస్ లో వాల్ట్ డిస్ని, ఎనిమిదో స్థానంలో టయోటా, తొమ్మిదిలో మాస్టర్ కార్డు, పదో ప్లేస్ లో కాస్ట్ కో కంపెనీలు ఉన్నాయి. మొత్తం మీద ఫోర్బ్స్ లో చోటు దక్కించు కోవడం మాములు విషయం కాదు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి