అమితాబ్ కు అరుదైన గౌరవం..అత్యున్నత పురస్కారం..!
భారత దేశంలో గొప్ప నటుడిగా పేరున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అత్యున్నతమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ను ప్రకటించింది. సినీ ప్రస్థానంలో దీనిని గొప్పగా భావిస్తారు. అమితాబ్ బచ్చన్ ను ఏకగ్రీవంగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్విట్టర్ లో వెల్లడించారు. నటుడిగా, ప్రయోక్తగా, గాయకుడిగా, నిర్మాతగా అమితాబ్ బచ్చన్ ఎక్కని మెట్లు లేవు. ఒకప్పుడు నటనకు పనికి రావంటూ హేళనకు, అవమానాలకు గురైన ఈ అరుదైన వ్యక్తి ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎల్లప్పటికిని గుర్తుంచుకునేలా తనను తాను నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు. ఎక్కడైతే తనను వద్దన్నారో వాళ్ళే తనతో సినిమాలు తీసే స్థాయికి చేరుకున్నారు. ఏ గొంతు పూర్తిగా పనికే రాదని హేళన చేసిన వాళ్ళు సిగ్గు పడేలా అదే గొంతుతో అలవోకగా, అత్యంత గాంభీర్యంతో కవితలు చదువుతూ ఉంటే కోట్లాది మంది ఫిదా అయి పోయారు. ఆయన నటించిన సినిమాలన్నీ అద్భుతమైన విజయాలు నమోదు చేసుకున్నాయి.
బిగ్ బి గా పేరున్న అమితాబ్ చేయని పాత్ర అంటూ లేదు. ఏది ఇచ్చినా దానికి న్యాయం చేశారు. తాజాగా తెలుగులో చిరంజీవితో కలిసి సైరా సినిమాలో కూడా నటించారు. అమితాబ్ బచ్చన్ అనే సరికల్లా మొదటగా గుర్తుకు వచ్చేది కభీ కభీ సినిమా. లావారీస్, సీల్ సిలా, డాన్ లాంటి సినిమాలు భారీ వసూలు రాబట్టాయి. 1942 అక్టోబరు 11 లో పుట్టారు. పద్మశ్రీ , పద్మ భూషణ్, పద్మ విభూషణ్ లాంటి అవార్డులతో పాటు ఎన్నో అవార్డులు అమితాబ్ అందుకున్నారు. అమితాబ్ 1970లలో రిలీజైన జంజీర్, దీవార్ సినిమాలతో ప్రఖ్యాతి పొందారు. తన పాత్రలతో యాంగ్రీ యంగ్ మెన్ గా ప్రసిద్ధి చెందారు. బాలీవుడ్ లో షెహెన్ షా, స్టార్ ఆఫ్ ది మిలీనియం, బిగ్ బి అనే బిరుదులను కూడా పొందారు. దాదాపు 180 సినిమాలలో నటించారు. 70, 80లలో అమితాబ్ ఆధిపత్యం కొనసాగింది.
ఉత్తమ నటునిగా నాలుగు జాతీయ అవార్డులు, అంతర్జాతీయ స్థాయి సినిమా ఫెస్టివల్స్, అవార్డ్ వేడుకల్లోనూ ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు . 15 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ నటుడు కేటగిరీకి గాను 40 సార్లు నామినేట్ అయిన ఏకైక నటుడు. రాజకీయాలలో కూడా క్రీయా శీలకంగా పనిచేశారు అమితాబ్. 2007లో ఫ్రెంచి ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన లెగియన్ ఆఫ్ ప్రకటించింది. హాలీవుడ్ లో మొదటిసారి 2013లో "ది గ్రేట్ గేట్స్బే" అనే సినిమాతో అడుగుపెట్టారు బచ్చన్. అమితాబ్ 1969లో భువన్ షోం అనే సినిమాలో నేపథ్య కథకునిగా మొదటి సారి పరిచయం అయ్యారు. మృణాల్ సేన్ తీసిన ఈ సినిమా జాతీయ అవార్డు గెలుచుకుంది. నటునిగా మాత్రం సాత్ హిందుస్తానీ ఆయన మొదటి సినిమా. రెండో సినిమా ఆనంద్ లో రాజేష్ ఖన్నాతో కలసి నటించారు. ఉత్తమ సహాయ నటునిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఆ తరువాత పర్వానా సినిమాలో మొదటి సారిగా ప్రతి నాయకునిగా నటించారు. జంజీర్ సినిమా బిగ్ బి కి బిగ్ సక్సెస్.
రోటీ కపడా ఔర్ మకాన్ సినిమాలో సహాయ నటుని పాత్ర లో నటించారు.
1974లో అతి ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసిన సినిమా ఇది. మజ్బూర్ సినిమాలో అమితాబ్ ప్రధాన పాత్ర పోషించారు. హాలివుడ్ సినిమా జిగ్ జాగ్ కు రీమేక్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ గా నిలిచింది. 1975 బాలీవుడ్ చరిత్రలోనూ, అమితాబ్ కెరీర్ లోనూ అత్యంత భారీ హిట్లను అందించిన సంవత్సరం. ఆ సంవత్సరంలో అమితాబ్ నటించిన దీవార్, షోలే సినిమాలు భారతీయ సినిమా చరిత్రలో చెప్పుకోదగ్గ మలుపు. యశ్ చోప్రా దర్శకత్వం వహించిన దీవార్ సినిమా అతిపెద్ద హిట్ . ఇదే ఏడాదిలో రిలీజ్ అయిన షోలే సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టింది. రికార్డులను తిరగ రాసింది. 1999లో బిబిసి ఇండియా ఈ సినిమాను ఫిలిం ఆఫ్ ద మిలీనియం గానూ, ఇండియా టైమ్స్ తప్పక చూడాల్సిన 25 బాలీవుడ్ సినిమాల జాబితాలో చేర్చింది. అదే సంవత్సరంలో ఫిలింఫేర్ 50వ వార్షికోత్సవాల సందర్భంగా షోలే సినిమాకు ఫిలింఫేర్ బెస్ట్ ఫిలిం ఆఫ్ 50 ఇయర్స్ అవార్డు ఇచ్చింది.
1976లో యశ్ చోప్రా దర్శకత్వం వహించిన రొమాంటిక్ మూవీ కభీ కభీతో ఎటువంటి పాత్రలైనా చేయగలనని నిరూపించుకున్నారు అమితాబ్. ఈ సినిమాలో యువకవి అమిత్ మల్హోత్రా పాత్రలో కనిపించారాయన. అప్పటిదాకా వచ్చిన యాంగ్రీ యంగ్ మాన్ పాత్రలకు పూర్తి విరుద్ధంగా ఉండి, రొమాంటిక్ హీరోగా నటించిన అమితాబ్ కు ప్రేక్షకుల నుండే కాక, విమర్శకుల నుంచి కూడా మంచి స్పందన లభించింది. ఈ సినిమకు గాను ఆయనను ఫిలింఫేర్ ఉత్తమ నటుని అవార్డుకు నామినేషన్ లభించింది. 1977లో అమర్ అక్బర్ ఆంటోని సినిమా బిగ్ హిట్. 1978లో కసమే వాదే, డాన్ సినిమాలలో ద్విపాత్రాభినయం చేశారు అమితాబ్. యశ్ చోప్రా దర్శకత్వం వహించిన త్రిశూల్, ప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించిన ముకద్దర్ కా సికిందర్ సినిమాలలో అమితాబ్ నటించి మెప్పించారు. 1979లో అమితాబ్ సుహాగ్ సినిమాలో నటించారు. ఎక్కువ వసూళ్ళు సాధించింది.
మిస్టర్ నట్వర్ లాల్, కాలా పత్తర్, ది గ్రేట్ గేంబ్లర్ సినిమాలు కమర్షియల్ గా హిట్ గా నిలిచాయి. నటి రేఖ తో కలసి ఆయన చేసిన మిస్టర్ నట్వర్ లాల్ సినిమాలో మొదటిసారి గాయకుని అవతారం ఎత్తారు అమితాబ్. ఈ సినిమాకి గానూ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు, ఉత్తమ నేపథ్య గాయకుడు కేటగిరిల్లో నామినేషన్లు లభించాయి. కాలా పత్తర్ కు కూడా ఉత్తమ నటుని నామినేషన్ వచ్చింది. 1980లో రాజ్ కోస్లా దర్శకత్వం వహించిన దోస్తానా సినిమాలో శతృజ్ఞ సిన్హా, జీనత్ అమన్ లతో కలసి నటించిన అమితాబ్ ఉత్తమ నటుని నామినేషన్ దక్కించుకున్నారు.1981లో యశ్ చోప్రా దర్శకత్వం వహించిన సిల్ సిలా సినిమాలో తన భార్య జయ, రేఖ లతో కలసి నటించారు.1983లో ఆయన నటించిన కూలీ బిగ్ హిట్ గా నిలిచింది. 1984లో అమితాబ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి తమ ఫ్యామిలీ ఫ్రెండ్ రాజీవ్ గాంధీ కి మద్దతుగా రాజకీయాల్లోకి వచ్చారు.
ఎబిసిఎల్ కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు అమితాబ్ చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో తన చిన్ననాటి స్నేహితుడు అమర్ సింగ్ ఆయనకు అండ నిలిచారు. సమాజ్ వాదీ పార్టీకి మద్దతిచ్చారు అమితాబ్. జయ కూడా పార్టీలో చేరి రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు.1988లో అమితాబ్ షెహెన్ షా సినిమాతో తిరిగి సినిమాల్లోకి వచ్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. 1989లో విడుదలైన జాదూగర్, తూఫాన్, మే ఆజాద్ హూ సినిమాలు అంతగా ఆడలేదు. 1991లో విడుదలైన హమ్ చిత్రం హిట్ అవ్వడమే కాక, కెరీర్ లోనే మూడవ ఫిలింఫేర్ ,1990లో అగ్నిపథ్ సినిమాలో డాన్ పాత్రలో ఆయన నటనకు జాతీయ ఉత్తమ నటుని అవార్డు లభించింది. 1992లో ఖుదా గవా, 1993లో ఇన్ సానియత్ సినిమాల తర్వాత అమితాబ్ 5 ఏళ్ళ పాటు సినిమాల్లో కనిపించలేదు. 1997లో స్వంత సంస్థ నిర్మాణంలో మృత్యుదూత సినిమాతో తిరిగి నటించారు అమితాబ్. ఈ సినిమా ఆర్థికంగా పరాజయం కావడమే కాక, విమర్శకుల నుంచి వ్యతిరేకతను కూడా మూటకట్టుకున్నారు.
1998లో మియాన్ చోటే మియాన్ సినిమాతో తిరిగి సినిమాల్లోకి అడుగు పెట్టారు అమితాబ్. 2000లో యశ్ చోప్రా నిర్మించి, ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన మొహొబ్బతే సినిమాలో నటించారు అమితాబ్. ఈ సినిమా మంచి విజయం నమోదు చేసుకుంది. ఈ సినిమాలో దృఢమైన వ్యక్తిత్వం గల పెద్ద వయసు పాత్రలో, షారుఖ్ ఖాన్తో కలసి నటించారు. ఏక్ రిష్తా-ద బాండ్ ఆఫ్ లవ్ , కభీ ఖుషీ కభీ గమ్, బగ్బాన్ లాంటి సినిమాలు బాగా ఆడాయి. 2005లో సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో నటించిన బ్లాక్ సినిమాలో చెవిటి-గుడ్డి అమ్మాయికి టీచర్ పాత్రలో ప్రేక్షకులనే కాక, విమర్శకులను కూడా మెప్పించారు అమితాబ్. ఈ సినిమా కమర్షియల్ గా కూడా పెద్ద హిట్ గా నిలిచింది. ఎన్నో టెలివిజన్ ప్రకటనల్లో కనిపించారాయన. 2005, 2006ల్లో తన కుమారుడు అభిషేక్ బచ్చన్ తో కలసి బంటీ అవుర్ బబ్లీ , కభీ అల్విదా నా కెహ్నా వంటి సినిమాల్లో నటించారు అమితాబ్. ఈ రెండు సినిమాలూ మంచి విజయాలు నమోదు చేసుకున్నాయి.
బాబుల్, ఏకలవ్య, నిశ్శబ్ద్ సినిమాలు ఆర్థికంగా విజయం సాధించక పోయినా, ఆయన నటనకు ప్రశంసలు అందుకున్నారు. 2005లో విడుదలైన సర్కార్ సినిమాకు 2008లో సీక్వెల్ గా వచ్చిన సర్కార్ రాజ్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. 2009లో విడుదలైన పా సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది. 2010లో మేజర్ రవి దర్శకత్వంలో, మోహన్ లాల్ తో కలసి కందహర్ సినిమా ద్వారా మలయాళంలో మొదటి సారి నటించారు. అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతి మొదటి సీజన్ కు యాంకర్ గా వ్యవహరించారు. పెద్ద హిట్ అయింది. 2009లో రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించారు అమితాబ్. 2010లో కెబిసి నాల్గవ సీజన్ కు హోస్ట్ గా ఉన్నారు. కెబిసి-6ను కూడా అమితాబ్ హోస్ట్ చేశారు. ఈ షో 2012 సెప్టెంబరు 7న సోనీ టివిలో ప్రసారమైంది. 2014లో యుధ్ ధారావాహికలో టైటిల్ పాత్రలో నటించారు అమితాబ్. ఇది కూడా సక్సెస్. ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్న ఆయనకు అత్యున్నత ఫాల్కే అవార్డు దక్కడం అభినందనీయం.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి