ఆస్కార్ బరిలో గల్లీ బాయ్ - జయహో జోయా అక్తర్
ప్రపంచంలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కోరుకునే కల ఆస్కార్. ఒక్కసారి వస్తే చాలు ప్రపంచమంతటా గుర్తింపు లభిస్తుంది. ఓ అరుదైన ఇమేజ్ తో పాటు బ్రాండ్ ఏర్పడుతుంది. అలాంటి ఆస్కార్ సినీ అవార్డుల కోసం మన దేశం నుంచి గల్లీ బాయ్ సినిమా ఎంపికైంది. 26 మంది కలిగిన ఫిలిం జ్యురీ పలు సినిమాలను పరిశీలించింది. చివరకు రణ్ వీర్ , ఆలియా భట్ కలిసి నటించిన గల్లీ బాయ్ నామినేట్ అయ్యింది. ఈ మూవీని జోయా అక్తర్ తీశారు. ఓ గల్లీలో ఉన్న కుర్రాడు తన సంగీతం, పాటలతో ప్రపంచ విజేతగా ఎలా నిలిచాడో అన్నదే ఈ సినిమా కథ. రితేష్ సిద్వానీ , జోయా అక్తర్ , ఫర్హాన్ అక్తర్ లు నిర్మించారు. మొత్తం సినిమాకు 84 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సినిమా విడుదలయ్యాక దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఏకంగా 238 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇండియన్ సినిమాలో ఓ మహిళ తీసిన ఈ మూవీ వసూళ్ళలో రికార్డ్ సృష్టించింది. విజయ్ మయూర దీనికి కథను సమకూర్చాడు. రణ్వీర్ ,ఆలియా తో పాటు సిద్దాంత్ చతుర్వేది అద్భుతంగా నటించారు..మెప్పించారు. సినిమాటోగ్రఫీ జె ఓజా అందించారు. ఎక్సెల్ ఎంటర్ టైన్మెంట్ , టైగర్ బేబీ ప్రొడక్షన్స్ ద్వారా గల్లీ బాయ్ ని రిలీజ్ చేసింది. ఏయే ఫిలిమ్స్, జీ స్టూడియో ఇంటర్ నేషనల్ , సినీస్థాన్ ఫిలిం కంపెనీలు ఇండియా అంతటా డిస్ట్రిబ్యూషన్ చేశాయి. మొదటగా ఈ ఏడాది ఫిబ్రవరి 9 న ప్రపంచ వ్యాప్తంగా మొదటగా బెర్లిన్ లో గల్లీ బాయ్ ను విడుదల చేశారు. ఇక ఇండియా లో అదే నెలలో 14 న రిలీజ్ చేశారు. మొత్తం 153 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమా ఆద్యంతమూ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. వీధుల్లో పాడుకునే వాళ్ళు ఈ సినిమాకు స్ఫూర్తి. స్ట్రీట్ ర్యాపర్స్ ..మురికి వాడగా పేరొందిన ముంబయిలోని ధారవి ఇందులోని పాత్రలకు ప్రేరణ. బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రదర్శించ బడింది. 2019 లో ఓవర్ సీస్ లో బాలీవుడ్ సినిమాలలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా గల్లీ బాయ్ చరిత్ర నమోదు చేసింది.
బెస్ట్ ఇంటర్ నేషనల్ ఫీచర్ అవార్డు అందుకుంది ఈ మూవీ. ఆలియా భట్ , రణ్ వీర్ సింగ్ పోటీ పడి నటించారు. అస్లీ హిప్ హాప్ , అప్నా టైం ఆయేగా , మేరే గల్లీ మే , దూరి , ఆజాది , ట్రైన్ సాంగ్, ఇండియా 91 , జహా తూ చలా, షేర్ ఆయా షేర్ పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేశారు సినిమా టీమ్. మొత్తం ఈ సినిమాలో 18 పాటలు ఉన్నాయి. 54 మంది వీటిని కంట్రిబ్యూట్ చేశారు. డివైన్ , నాజే, రిషి రిచ్ , డబ్ శర్మ , జస్లీన్ రాయల్, యేసే, ఇష్క్ వెక్టర్ , ఎంసీ ఆధ్లాఫ్, ఎంసీ టాడ్ ఫోడ్, 100 ఆర్బీహెచ్ , మహార్య , నొక్సియోస్, వివేలాక్ రాజగోపాలన్ తదితరులు ఈ సినిమాకు ప్రాణం పోశారు. మ్యూజిక్ సూపర్ వైజర్ అంకుర్ తేవారి డిఫరెంట్ గ్రూప్స్ ఆర్టిస్ట్స్ ను వాడుకున్నారు. వారిలోని టాలెంట్ ను ఈ లోకానికి పరిచయం చేశాడు.
ఇప్పుడు బాలీవుడ్ లో హిప్ హాప్ ఓ సెన్సేషనల్. అమెరికన్ ర్యాపర్ నాస్ కూడా తన వాయిస్ తో ఆకట్టుకున్నాడు. రణ్ వీర్ , ఆలియా సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగానే ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. వరల్డ్ వైడ్ గా 4101 థియేటర్లలో గల్లీ బాయ్ ని విడుదల చేశారు. ఈ సినిమాపై విమర్శలు కూడా వచ్చాయి. ఈ మూవీ ఇంగ్లీష్ సినిమాను కాపీ కొట్టారని. దానిని డైరెక్టర్ జోయా అక్తర్ ఖండించారు. మొత్తం 20 అత్యుత్తమమైన రివ్యూ స్ లలో పది మార్కులకు గాను గల్లీ బాయ్ ఏకంగా 8 మార్కులు వేశారు. సినిమా విడుదలైన మొదటి రోజే 19.4 కోట్లు వసూలు చేసింది. రెండు వారాల్లో ఏకంగా 220 కోట్లు రాబట్టింది. ఇండియాలో 165 . 58 కోట్లు వచ్చాయి. ఓవర్ సీస్ తో కలుపుకుని 238 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డులను బ్రేక్ చేసింది. పలు చోట్ల గల్లీ బాయ్ సక్సెస్ ఫుల్ తో దూసుకు పోతోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి