మధురమైన రాత్రులు .. మెత్తనైన వేక్ ఫిట్ పరుపులు

అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అని పాడుకోవాలన్నా, మనసైన వాళ్ళతో ప్రేమానుభూతులను నెమరు వేసు కోవాలన్నా, రొమాంటిక్ ఫీలింగ్స్ రావాలన్నా, కోరుకున్న కలలు మరింత రిచ్ గా ఉండాలన్నా ఎవ్వరూ లేని, నిశ్శబ్డం అల్లుకున్న ఓ గది ఉండాల్సిందే. అందులో ఆలోచనలు చెదిరి పోకుండా వుండాలంటే మెత్తనైన పరుపులు ఉండాల్సిందే. పడుకుంటే చాలు బాడీ మొత్తం అలసట లేకుండా అయి పోవాలి. అలాంటి పరుపులు, దుప్పట్లు, కుషన్స్, పిల్లోస్ కావాల్సిందే. వీటికి ఉన్నంత డిమాండ్ ఇంకే ఉత్పత్తులకు లేదంటే నమ్మలేం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో పెను మార్పులు చోటు చేసు పోవడం వరల్డ్ వైడ్ గా లెక్కలేనన్ని అవకాశాలు రావడంతో మన వాళ్ళు యువతీ యువకులు, పెద్దలు లక్షాధికారులు అయిపోతున్నారు. దీంతో వాళ్ళ కోరికలు, అభిరుచుల్లో చెప్పలేనంత మార్పులు చోటు చేసుకుంటున్నాయి. స్వంత ఇల్లు, విల్లాస్, ఫ్లాట్స్ అన్నీ తమకు అనుగుణంగా ఉండేలా ఇంటీరియర్ డెకొరేషన్స్ మరింత ఆకర్షణీయంగా ఉండేలా చూసుకుంటున్నారు.

అన్నిటికంటే ఎక్కువగా స్లీపింగ్ ఉత్పత్తులకు ఎనలేని డిమాండ్ ఉంటోంది ఇండియన్ మార్కెట్ లో. స్లీప్ వెల్ లాంటి కంపెనీలు మార్కెట్ ను శాసిస్తున్నాయి. కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నాయి. మనసు దోచుకునే డిజైన్స్, ఐడియాస్ కు అనుగుణంగా ఉండేలా దుప్పట్లు, పిల్లోస్ , తదితర వాటిని తయారు చేస్తున్నారు. ఆఫ్ లైన్ లో కాకుండా ఆన్ లైన్ లో కూడా వీటిని విక్రయిస్తున్నారు. తాజాగా వీటికున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకున్న వేక్ ఫిట్ స్టార్ట్ అప్ ట్రావెల్ పిల్లౌస్ ప్లాన్ చేస్తోంది. మేల్కోవాల్సిన అవసరం లేదు.. నిద్రపుచ్చితే చాలు అంటోంది. వేక్‌ఫిట్‌ పరుపు మీద 6 గంటలు నిద్రపోతే చాలు.. 8 గంటల గాఢ నిద్రతో సమానమంటోంది. కస్టమర్ల వయస్సు, లింగ భేదం, శరీరాకృతి, తత్వాలను బట్టి ఆర్థోపెడిక్‌ పరుపులను అభివృద్ధి చేయడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం మార్కెట్లో  తయారీ సంస్థ నుంచి కస్టమర్‌కు మధ్యలో డిస్ట్రిబ్యూటర్, స్టాకిస్ట్, రిటైలర్‌ మూడు రకాల మధ్య వర్తులుంటారు. ప్రతి దశలో ఎవరి మార్జిన్స్‌ వారికుంటాయి. దీంతో ఉత్పత్తి అంతిమ ధర పెరుగుతుంది. కానీ, వేక్‌ఫిట్‌లో తయారీ కేంద్రం నుంచి నేరుగా కస్టమర్‌కు చేరుతాయి. దీంతో నాణ్యమైన ఉత్పత్తులతో పాటూ ధర తగ్గుతుంది.

ఇదే లక్ష్యంగా 2016 లో బెంగళూరు కేంద్రంగా 15 లక్షల పెట్టుబడితో వేక్‌ఫిట్‌ ఇన్నోవేషన్‌ను స్టార్ట్ చేశారు. వేక్‌ఫిట్‌లో పరుపులు, దిండ్లు, పరుపుల కవచాలు, బెడ్స్‌ ఉన్నాయి. అందరికి అందుబాటు ధరల్లో ఉత్పత్త్తులు అందుబాటులో  ఉన్నాయి. త్వరలో ట్రావెల్‌ దిండ్లు, దుప్పట్లు, కుర్చీ కుషన్స్, బ్లాంకెట్‌ ఉత్పత్తులను విడుదల చేయనుంది. ప్రస్తుతం నెలకు 9 వేల పరుపులను విక్రయిస్తోంది ఈ సంస్థ. వీటికి 20 ఏళ్ల వారంటీ ఉంటుంది. అన్ని ఉత్పత్తులు కలిపి నెలకు 9 కోట్ల వరకు అమ్మడం దీని ప్రత్యేకత. అయితే బెంగళూరు, ముంబై తర్వాత హైదరాబాద్‌ మూడో అతిపెద్ద మార్కెట్‌ గా ఉంటోంది దీనికి. ఇక్కడ నెలకు 800 పరుపుల దాకా అమ్ముడు పోతున్నాయి. దాదాపు కోటికి పైగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది అంటున్నారు దీని బాధ్యులు. హైదరాబాద్, ముంబై, పుణె, బెంగళూరులో ఇప్పటికే గిడ్డంగులున్నాయి. ఇప్పటి దాకా 80 కోట్ల ఆదాయం సమకూరగా 2020 నాటికి 200 కోట్లు అందు కోవాలన్నదే వేక్ ఫిట్ టార్గెట్ గా పెట్టుకుంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!