ఇండియాలో నెంబర్ వన్ .. ఆదాయంలో టాప్

తెలుగమ్మాయి, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సరికొత్త రికార్డ్ సృష్టించింది ..ఆటలో అనుకుంటే పొరపడినట్లే ..ఆటతో వచ్చిన ఆదాయంలో దేశంలోని మహిళా క్రీడాకారిణుల్లో సింధు టాప్ వన్ లో నిలిచారు. రికార్డ్ బ్రేక్ చేసారు . గతంలో టెన్నిస్ లో హైదరాబాద్ కు చెందిన సానియా మీరజా టాప్ లో ఉండేది ..ఇప్పుడు ఆమె ప్లేస్ ను సింధు ఆక్రమించింది. సింధు ఏడాది ఆదాయం ఏకంగా 39 కోట్ల రూపాయలుగా తేల్చింది ప్రముఖ సంస్థ ‘ఫోర్బ్స్‌’. ప్రతి ఏటా ఎవరెవరు ఎంతెంత సంపాదించారో లెక్కించి రేటింగ్ ఇవ్వడం పరిపాటి.

ఈ సారి తెలుగమ్మాయి సింధు చోటు దక్కించుకుంది. ఒలింపిక్‌, ప్రపంచ చాంపియన్‌షిప్‌ సాధించింది. ఆటతో పాటు ఆర్జనలోనూ ఆమె వేగంగా దూసుకెళుతోంది. తాజాగా ‘ఫోర్బ్స్‌-2019 మహిళా అథ్లెట్ల’ జాబితాలోఇండియా నుంచి అగ్రస్థానంలో నిలిచింది. మొత్తంగా 13వ స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఓ ఏడాదిలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న తొలి 15 మంది మహిళా అథ్లెట్ల జాబితాను ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రకటించింది. ఆ జాబితా ప్రకారం సింధు ఏడాదికి అక్షరాలా రూ. 39 కోట్లు పారితోషికంగా అందుకుంటోంది. సింధు మినహా భారత్‌ నుంచి మరే క్రీడాకారిణికి ఫోర్బ్స్‌ జాబితాలో చోటు లభించక పోవడం విశేషం.

ఇక అమెరికాకు చెందిన టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ 207 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. జపాన్‌ టెన్నిస్‌ కెరటం నవోమి ఒసాకా . 172 కోట్లు సంపాదనతో రెండో స్థానంలో నిలవగా.. జర్మనీ టెన్నిస్‌ తార ఏంజెలికా కెర్బర్‌ 84 కోట్లతో మూడో స్థానం పొందింది . ‘సింధు ఇప్పటికీ భారత్‌లో అత్యధిక మార్కెట్‌ కలిగిన మహిళా అథ్లెట్‌ గా పేరొందారు . గత సీజన్‌ చివర్లో ఆమె వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌తో ఈ టైటిల్‌ గెలిచిన తొలి భారత షట్లర్‌గా రికార్డు సృష్టించింది’ అని ఫోర్బ్స్‌ పేర్కొంది . ప్రైజ్‌మనీ కింద రూ. 3. 50 కోట్లు అందుకున్న సింధు.. ఎండార్స్‌మెంట్ల నుంచి ఏకంగా రూ. 35.50 కోట్లు ఆర్జించింది. మొత్తం మీద సింధు కు చోటు దక్కడం విశేషమే అయినా ..ఆదాయం మీద కంటే ఆట మీద ద్రుష్టి పెడితే బాగుంటుందని అభిమానులు అంటున్నారు.

కామెంట్‌లు