రవిశాస్త్రి ఎంపిక లాంఛనప్రాయమేనా..?
భారత క్రికెట్ జట్టుకు ఎవరు కోచ్ గా ఉంటారనే దానిపై ఇంకా కొలిక్కి రాక పోయినా రవిశాస్త్రి నే తిరిగి కోచ్ గా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ కప్ టోర్నమెంట్ లో ఇండియా జట్టు సెమీస్ దాకా వెళ్లి ఓటమి పాలవడంతో కోచ్ కథ ముగిసినట్టేనని భావించారు. అభిమానులు ఇక కోచ్ ను మార్చండని అభిప్రాయలు వ్యక్తం చేశారు. కానీ కోచ్ ఎంపిక కమిటీ ఈ రోజు వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బాద్యులు ఎమ్మెస్కె ప్రసాద్ ..ఇటీవల తమపై వస్తున్న విమర్శలకు బదులు ఇచ్చారు. తమకు కూడా అనుభవం ఉన్నదని, క్రికెట్ జట్టు ఎంపిక అన్నది కట్టి మీద సాము లాంటిదని , తాము ఏమికా చేసిన జట్టు లో ఆటగాళ్లు బాగానే ఆడారని తెలిపారు.
బీసీసీపై మాజీ సారధి గవాస్కర్ తీవ్ర ఆరోపణలు చేశారు . సెలక్షన్ కమిటీ ఏం చేస్తోందంటూ మండిపడ్డారు . దీనిపై ప్రసాద్ ఘాటుగా బదులిచ్చారు. కోచ్ ను ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చామని , భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కోచ్ ఎంపిక భాద్యతను ముగ్గురు సభ్యులు కలిగిన ఎంపిక కమిటీ చూసుకుంటుందని వెల్లడించారు. దీనికి కపిల్ దేవ్ , గైక్వాడ్ , డయానా ఉన్నారు . అయితే జట్టు ఓటమి చెందడంతో కొత్తగా కోచ్ ను ఎంపిక చేస్తారని ఊహాగానాలు వచ్చాయి . అలాగే బీసీసీఐ కూడా ప్రకటన విడుదల చేసింది . కానీ టీమిండియా సారధి కోహ్లీ మాత్రం రవిశాస్త్రి వైపు మొగ్గు చూపిస్తున్నట్లు అగుపిస్తోంది . దీంతో శాస్త్రి ఎంపిక లాంఛనమేనని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
జయవర్దనే రేస్ లోకి రాక పోవడం , టామ్ మూడి మాత్రమే ఉండటం రవికి కలిసొచ్చింది. ఇవన్నీ కాక అసలు టీమ్ నాయకుడు పూర్తిగా అతడే కావాలని కోరడం కూడా ప్లస్ అవుతోంది . ప్రస్తుతం జట్టుతో కలిసి వెస్టిండీస్‌లో ఉన్న శాస్త్రి.. కుదిరితే వచ్చే నెలలో స్వదేశంలో జరిగే సౌతాఫ్రికా సిరీస్‌లో టీమిండియాను గైడ్ చేయనున్నారు. కోచ్ ఎంపిక బాధ్యతను దక్కించుకున్న క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ)లోని ఓ మెంబర్‌తో పాటు బీసీసీఐకి చెందిన ఓ అధికారి చేసిన వ్యాఖ్యలు శాస్త్రి కొనసాగింపు లాంఛనమేనని చెబుతున్నాయి. కోచ్ ఎంపికలో తుది నిర్ణయం చైర్మన్ కపిల్‌దేవ్ ఓటు కీలకం కానుందని తెలిపారు. కాగా ఇండియా మాజీ స్పిన్నర్ సునీల్ జోషి నేషనల్ టీమ్ బౌలింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి