దాయాదుల మధ్య తీవ్ర ఉద్రిక్తత

ఆసియా ఖండంలోని దాయాది దేశాలైన పాకిస్థాన్ , ఇండియాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థిని నెలకొంది. ఎప్పుడైతే మోదీ దేశ ప్రధాన మంత్రిగా పదవీ భాద్యతలు చేపట్టారో ఇక అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తరుచూ గిల్లికజ్జాలు మొదలయ్యాయి. పాక్ నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడడంతో మోదీ ఇక వెనుదిరగలేదు. ఏదో ఒకటి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పాక్ అనుసరిస్తున్న తీరుపై ప్రపంచానికి తెలియ చెప్పే ప్రయత్నం చేసారు. అయినా దాయాది పాకిస్థాన్ లో ఎలాంటి మార్పు రాలేదు. అంతే కాకుండా పరోక్షంగా తీవ్రవాదులకు ఊర్థం ఇవ్వడంతో గట్టి బడికి చెప్పాలని డిసైడ్ అయ్యారు మోదీ అండ్ షా.
కొన్నేళ్లుగా నాన్చుతూ వస్తున్న 370 వ ఆర్టికల్ ను రద్దు చేస్తూ భారత తీర్మానం చేసింది. దీంతో మరింత కవ్వింపు చర్యలకు దిగింది పాకిస్థాన్. ఈ విషయంపై లేనిపోని రాదాంతం చేస్తూ తనకు తానే అభాసు పాలైంది . ఒక్క చైనా, అమెరికా తప్పా అన్ని దేశాలు ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదు . అది ఇండియా అంతర్గత అంశమని కొట్టి పారేశాయి . అయినా పాక్ ఊరు కోవడం లేదు . దానిని రచ్చ రచ్చ చేస్తోంది . దీంతో ఇరు దేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనేలా తయారైంది. అమీ తుమీ తేల్చుకునేందుకు తాము రెడీగా ఉన్నామని ఆదేశ నేతలు ఒక్కరొక్కరు బీరాలు పలుకుతున్నారు . మరో వైపు ఇండియా ఒఊహించని రీతిలో పాకిస్థాన్కు ఆయువుపట్టుగా ఉన్న తీవ్రవాద స్థావరాలను టార్గెట్ చేస్తూ ...ధ్వంసం చేస్తూ వస్తోంది. ఓ వైపు ఆర్ధిక మూలాలపై దెబ్బ కొట్టేందుకు పావులు కదుపుతోంది . ఓ వైపు సైనికులు భీకర పోరాటం చేస్తున్నారు .
ఎందరో ప్రాణాలు కోల్పోయారు . అయినా ఇరు దేశాల మధ్యన ఉన్న వాస్తవాధీన రేఖ వెంట ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు . ఇక పాకిస్థాన్ అసాధారణ నిర్ణయాలు తీసుకుంది . భారత్ తో వాణిజ్య సంబంధం తెంపేసుకుంటున్నట్టు ప్రకటించింది . దౌత్య కార్యాలయం మూసి వేయాలని , రాయబారి వెళ్లి పోవాలని ఆదేశించింది . వాణిజ్య ఒప్పందాలపై మరోసారి సమీక్ష చేయనున్నట్టు ప్రకటించింది . ఢిల్లీలో ఉన్న తమ పాక్ రాయబారిని వెనక్కి వచ్చేయమని ఆదేశాలు జారీ చేసింది .పలు కీలక నిర్ణయాలు తీసుకుంది . ఇది ఇలా వుంటే మోదీ , షా , ధావల్ లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు . వీలైతే పాక్ పై వార్ ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు పంపించారు. ఏది ఏమైనా పాక్ ఒంటరిగా మిగిలింది .

కామెంట్‌లు