సకల కళా నైపుణ్యం ఆమె స్వంతం
నటిగా , గాయనిగా తెలుగు సినిమా ఉన్నంత కాలం ఆమె బతికే ఉంటారు. తెలుగు వారికి ఇష్టమైన నటీమణుల్లో భానుమతి ఒకరు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పుట్టారు . కొందరిలో కొన్ని కళలు మాత్రమే ఉంటాయి . కానీ ఆమెకు మాత్రం అన్ని కళల్లో ప్రావీణ్యం ఉన్నది . అందుకే ఆమె అంటే చాలా మంది అభిమానులు ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటారు . నటి గా , నిర్మాతగా , డైరెక్టర్ గా , రచయిత్రిగా , సింగర్ గా రాణించారు మెప్పించారు . తనను తాను నిరూపించుకున్నారు. సంగీత దర్శకురాలిగా మెప్పించారు. తండ్రి దగ్గర సంగీతం అభ్యసించిన ఆమె పదమూడేళ్ళ వయసులోనే వర విక్రయం అనే సినిమాలో నటించింది. తమిళ, తెలుగు చిత్రాల నిర్మాత, దర్శకుడు, ఎడిటర్ అయిన రామకృష్ణారావునుపెళ్లి చేసుకుంది . . తర్వాత భరణి స్టూడియోస్ అనే పేరుతో పలు చిత్రాలు నిర్మించారీ దంపతులు.
భానుమతి రాసిన అత్తగారి కథలు తెలుగు సాహిత్యంలో గుర్తింపు పొందాయి. 1966 లో ఆమెకు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం లభించింది. సినిమా నిర్మాణ సమయములో తన కుమార్తెను తాక రాదని ఆమె తండ్రి షరతు విధించాడు. హీరో, నిర్మాతలు అలాగే నడుచుకున్నారు.భానుమతి అంటేనే మొదటగా గుర్తుకు వచ్చేది మల్లేశ్వరి సినిమా. ఆ సినిమాలో భానుమతి పాడి, నాట్యం చేసిన పిలచిన బిగువటరా పాట ఇప్పటికీ టాప్ లో ఉంది. అర్ధ శతాబ్దానికి పైబడి సినీ రంగంలో ఉన్నప్పటికీ, భానుమతి నటించిన చిత్రాలు సుమారు వంద మాత్రమే. ఆమె సినిమాలలో మల్లీశ్వరి, మంగమ్మగారి మనవడు వంటి ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి. విజయా వారి మిస్సమ్మ సినిమాలో ప్రధాన పాత్రకు మొదట భానుమతినే తీసుకున్నారు.
అయితే షూటింగు మొదలైన తర్వాత చక్రపాణికి ఆమె వ్యవహార శైలి నచ్చక పోవడంతో ఆమె స్థానంలో సావిత్రిని తీసుకున్నారు. ఈ సంగతి గురించి ప్రస్తావిస్తూ భానుమతి ఏటా తాను వరలక్ష్మీ వ్రతం చేసుకుంటాను కనుక ఒక గంట లేటుగా వస్తానని ముందు రోజు చెప్పినా అధికార పూర్వకంగా చక్రపాణి నొప్పించారని రాసుకున్నారు. సావకాశంగా ఆలోచిస్తే చక్రపాణి తప్పేముంది నా సమయం బాగోలేదేమోనని భావించినట్టుగా వివరించారు. ఆ సినిమా విడుదలై, ఘన విజయం సాధించాక భానుమతి నేను మిస్సమ్మలో నటించక పోవడం వల్ల సావిత్రిలాంటి గొప్పనటి వెలుగులోకి వచ్చింది అని సంతోషించింది. నటిగానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలిగా పలువురి మన్ననలు అందుకున్నది. ఓ గాయనిగా, సంగీత దర్శకురాలిగా, స్టూడియో యజమానిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, రచయిత్రిగా పలు పాత్రలు సమర్ధవంతంగా నిర్వర్తించింది. 2005 లో ఈ లోకం నుండి వెళ్లి పోయారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి