ఆప్-కు అగ్ని పరీక్ష..పవర్ కోసం కేజ్రీ క్రేజీ

కేంద్రంలో కొలువు తీరిన కమల సర్కార్ కు కంట్లో నలుసులా తయారైన ఆప్ సర్కార్ ను ఎలాగైనా సరే రాబోయే ఎన్నికల్లో ఓడించాలని పావులు కదుపుతోంది. చాప కింద నీరులా కామ్ గా తన పని తాను చేసుకుంటోంది. ఇంకో వైపు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళుతున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. మరో ఆరు నెలల్లో విధాన సభ కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఇందు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు స్టార్ట్ చేశారు కేజ్రీవాల్. 2013 , 2015 లలో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది. గత నాలుగు నెలల కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీట్ ను కూడా చేజిక్కించు కోలేక పోయింది .

దీంతో ఎన్నడూ లేనంతగా ఆప్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీ పెట్టినప్పుడు పేరున్న నాయకులు , సామాజిక వేత్తలు, అనుభవం కలిగిన నాయకులు పెద్దఎత్తున చేరారు . రాను రాను కేజ్రీవాల్ ఒంటెత్తు పోకడలు నచ్చక ఒక్కొక్కరు బయటకు వెళ్లి పోయారు. దీంతో ఆప్ లో కేజ్రీ ఒక్కరే ఒంటరిగా మిగిలారు . ఢిల్లీ వాసులకు కరెంట్ , నీళ్లు ఇచ్చే పథకాలపై ద్రుష్టి పెట్టారు సీఎం. విలువలే ప్రాతిపదికగా చెప్పుకుంటూ పవర్ లోకి వచ్చింది ఆప్. కానీ తాను అన్ని పార్టీల లాగానే అనే స్థాయికి దిగజారింది. బయటకు వెళ్లిన వారంతా కేజ్రీవాల్ ను టార్గెట్ చేశారు. అయినా ఆయనలో మార్పు రాలేదు.

ఆయనతో వేగలేమని వేరే కుమ్పటి పెట్టుకున్నారు సీనియర్లు. గత ఏడాది ఆఖరులో జరిగిన ఎన్నికల్లో ఆయా రాష్ట్రాలలో పోటీ చేసిన ఆప్ అభ్యర్థులు ఏ ఒక్కరు గెలవలేక పోయారు . రాను రాను ఆప్ ప్రాభవం తగ్గుకుంటూ వస్తోంది . దీంతో ప్రమాదమని గమనించిన సీఎం కేజ్రీవాల్ కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. ఢిల్లీ వాసులకు మెరుగైన వసతి సౌకర్యాలకు పెద్ద పీత వేశారు. వచ్చే ఏడాది రెండో నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ..ఇప్పటి నుంచే హామీలు గుప్పిస్తున్నారు కేజ్రీ. ఢిల్లీ పీఠం పై బీజేపీ కన్నేసింది . ఈసారి పవర్ లోకి రావాలని అమిత్ షా మరో వైపు పావులు కదుపుతున్నారు . ప్రజలను ఆకట్టుకునే పథకాలు ప్రకటిస్తున్నారు ఆయన. ఇప్పటి నుంచే తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మొత్తం మీద ఆప్ కు ..కమలానికి ..కాంగ్రెస్ కు మధ్య త్రిముఖ పోటీ ఉండనుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!