వెండి వెన్నెల కన్నాంబ
తెలుగు సినిమా ఎందరికో నీడనిచ్చింది. మరి కొందరికి బతుకును ప్రసాదించింది. టాలెంట్ అన్నది కొందరికి రెడ్ కార్పెట్ పరిస్తే మరి కొందరిని వెనక్కి నెట్టేసింది. కాలాన్ని గుర్తించి అవకాశాలు చేజిక్కించుకుని ముందుకు వెళ్లిన వాళ్లలో ఎందరో. అలాంటి వారిలో ఆనాటి పాతతరం నటీమణుల్లో పసుపులేటి కన్నాంబ ఒకరు. నటిగా , గాయనిగా మంచి పేరు తెచ్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1912లో జన్మించిన కన్నాంబ, ఆనాటి నావెల్ నాటక సమాజంలో పదమూడు సంవత్సరాల వయస్సులో బాల పాత్రలు వేస్తూ తొలిసారిగా నాటక రంగ ప్రవేశం చేసింది.
తన నాటకరంగ అనుభవంతో 1935లో హరిశ్చంద్ర తెలుగు చలన చిత్రంలో ' చంద్రమతిగా అడుగు పెట్టింది. ఆ తర్వాత ద్రౌపదీ వస్త్రాపహరణంలో "ద్రౌపది"గా అధ్బుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను అందుకుంది. హరిశ్చంద్ర, పాదుక, చంద్రిక, కనకతార, పల్నాటి యుద్ధం, గృహలక్ష్మి , అనార్కలి, దక్షయజ్ఞం , తోడికోడళ్ళు, కృష్ణ కుచేల, తదితర చిత్రాలలో ఆమె నటించి మెప్పించారు .
ఎం.జి.రామచంద్రన్, ఎన్.ఎస్.రాజేంద్రన్, శివాజీగణేశన్, నాగయ్య, పి.యు. చిన్నప్ప, నందమూరి తారక రామారావు, తదితర అగ్రశ్రేణి నాయకుల సరసన ఎన్నో చిత్రల్లో ఆమె నటించింది.
సుమారు 150 పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో తనదైన శైలిలో అద్వితీయంగా నటించి గొప్ప నటీమణిగా కీర్తి పొందారు.. కన్నాంబ భర్త నాగభూషణం, ఇద్దరూ కలసి ' రాజరాజేశ్వరీ ' చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి అనేక చిత్రాలు తెలుగులోను , తమిళ, కన్నడ భాషలలోను నిర్మించారు. కన్నాంబ పాడిన " కృష్ణం- భజరాధా' గ్రాం ఫోన్ గీతాలు- ఆనాటి రోజుల్లో ప్రతి ఇంతా మారు మ్రోగాయి. ఆమె గొప్ప నటీమణి మాత్రమే కాదు, చక్కని గాయని కూడా. సుమారు ఐదు దశాబ్దాలు తెలుగు చలన చిత్ర సీమలో తనదైన ప్రత్యేకత ప్రదర్శించిన శ్రీమతి కన్నాంబ 1964లో మే 7 న తుది శ్వాస విడిచారు. చివరి రోజుల్లో ఆమె భర్త గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి