ఓరియంటేషన్‌ క్లాసెస్‌ స్టార్ట్ .. భయపడుతున్న స్తూడెంట్స్

తెలంగాణాలో ఇంజనీరింగ్ చదువు కోవడం గగనంగా మారింది. ఇప్పటికే ఎంసెట్ కౌన్సిలింగ్ ముగియడంతో విద్యార్థులు తాము కోరుకున్న కాలేజీలు , ఎంచుకున్న కోర్సులలో చేరారు. అయితే ర్యాగింగ్ భయం స్తూడెంట్స్ ను వేధిస్తోంది. ఇప్పటికే గతంలో పలు సంఘటనలు చోటు చేసుకున్న దృష్ట్యా ఆయా కాలేజీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది . ఎవరైనా సరే ర్యాగింగ్ కు పాల్పడినట్లు తేలితే , వారిని కాలేజీల నుండి తొలగించడం, జీవిత కాలంలో ఎక్కడా చదువుకునే అవకాశం లేకుండా చేస్తామని హెచ్చరికలు జారీ చేసారు.

అయినా ఎక్కడో ఒక చోట ర్యాగింగ్ జరగక పోయినా, ఏదో రకంగా సీనియర్లు జూనియర్లను వేధిచడం మామూలై పోయింది. ఈ సారి జవహర్ లాల్ నెహ్రు టెక్నాలజికల్ యూనివర్సిటీ వినూత్న రీతిలో ర్యాగింగ్ కు వ్యతిరేకంగా భారీ ఎత్తున ప్రచారం ప్రారంభించింది. ఇప్పటికే ఆయా కాలేజీలలో ఓరియంటేషన్ క్లాసులు మొదలయ్యాయి. విద్యార్థులు అటెండ్ అవుతున్నారు. ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభం కావడంతో స్తూడెంట్స్ కొత్తగా ఫీల్ కావడం కూడా మరో కారణం అవుతోంది. దీంతో నూతన విద్యార్థుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు శ్రీకారం చుట్టింది. ‘ర్యాగింగ్‌ చేస్తే ఇక ఇంటికే’ అనే నినాదంతో జేఎన్‌టీయూ హైదరాబాద్‌ ప్రచారం చేపట్టింది.

క్లాసులు ప్రారంభం కావడంతో ర్యాగింగ్ కు వ్యతిరేకంగా కార్యాచరణ చేపట్టింది . ప్రత్యేక కమిటీలను నియమించడం. నూతన విద్యార్థులకు ప్రత్యేక వసతులు కల్పించడం. దీనికి అనుబంధంగా రాష్ట్రంలో 423 కళాశాలలు ఉండగా... వాటిలో 3.50 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ప్రతి ఏటా కొత్తగా వీటిలో చేరుతున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కళాశాల చైర్మన్, ప్రిన్సిపాల్, వైస్‌ ప్రిన్సిపాల్, వార్డెన్, హెచ్‌ఓడీలు, స్థానిక ఇన్‌స్పెక్టర్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ల ఫోన్‌ నంబర్‌లను విద్యార్ధులకు అందుబాటులో ఉంచాలి. అధ్యాపకులు తరచూ నూతన విద్యార్థులతో మాట్లాడుతూ వారిలో భయాందోళనను తొలగించాలి. హాస్టల్‌ లొకేషన్‌ కమిటీ, క్యాంటీన్‌ కమిటీ, డిపార్ట్‌మెంట్‌ కమిటీ, స్పోర్ట్స్‌ ఏరియా కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!