అంతటా పవనిజం..అదే అతడి డైనమిజం
పార్టీ నడపాలంటే పైసలు అక్కర్లేదు. కావాల్సందల్లా ప్రజలను ప్రేమించడం..ఇంత స్పష్టంగా చెప్పగలిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే ..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. ఆరడుగుల బుల్లెట్ లాగా ఉంటాడు కానీ మాటలతో ప్రకంపనలు సృష్టించగలడు. చూపులతో జనాన్ని మెస్మరైజ్ చేయగలడు. లక్షలాది అడుగులను తన ఆశయ సాధన కోసం..సమున్నత సమాజం కోసం నడిచేలా చేయగలడు. ఇదీ కొణిదెలకు ఉన్న క్రెడిబిలిటి. వ్యక్తిత్వ పరంగా అంతర్ముఖుడైన ఈ పవర్ స్టార్ గురించే ఇపుడంతా చర్చ. ఏపీలోను ఇటు తెలంగాణలోను ఆయనకు ఎనలేని అభిమానులున్నారు. తమకు తాముగా ఆరాధించే వాళ్లు ఎక్కువున్నారు. ఇదే ఆయనకు ఉన్న అతి పెద్ద అస్సెట్.
వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు ఎవ్వరిపైనా చేయరు. కాకపోతే తన జోలికి వస్తే మాత్రం ఊరుకోరు. ఎక్కువగా మాట్లాడరు. కానీ మాట్లాడితే అవతలి వాళ్లు ఫిదా అయి పోవాల్సిందే. ఇదే రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణం. ఒక్క చూపుతో..ఒకే ఒక్క మాటతో శాసించగలరు. నడిపించగలరు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టే ఏ రాజకీయ పార్టీని, నాయకులను విడిచి పెట్టలేదు. నిలదీశాడు..లక్షలాది ప్రజల సాక్షిగా చర్చకు పెట్టాడు. తానేమిటో తన పవర్ ఏమిటో ..తన స్టామినా ఏమిటో తెలియ చెప్పాడు. రండి తేల్చుకుందాం అని సవాల్ విసిరే దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్. వనరులు మనందరి ఆస్తి అయినప్పుడు ..ప్రజందరికి ఎందుకు భాగస్వామ్యం లేదో ఆలోచించారా అని ఆయన జనాన్ని చైతన్యవంతం చేశాడు.
ఆయనకున్న ప్రజెంట్ పొజిషన్‌కు ..ఆయనకున్న బ్రాండ్ ఇమేజ్‌కు కోట్లు కుమ్మరించే వ్యక్తులు, సంస్థలు, కంపెనీలు క్యూ కట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అందుకు ఒప్పుకోదు. ముందు నుంచి ఆయన ప్రజలను ప్రేమించాడు. తన కుటుంబంలో వారంతా ఒకరిగా భావించారు. అదే ఆయనను కన్నవారు ఇదే నేర్పించారు. మనల్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఈ సొసైటీ పట్ల మనకు కచ్చితమైన బాధ్యత ఉండి తీరాలంటారు. ఇలాంటి ఉన్నతమైన భావాలు కలిగిన నేతలు చాలా అరుదుగా కనిపిస్తారు. పవన్ స్వతహాగా అంతర్ముఖుడు. లోలోపట మధనపడతాడు. జనం కన్నీళ్లను తుడవాలని అనుకుంటాడు. ప్రతి ఒక్కరు బాగుండాలి. పక్క వారు సంతోషంగా ఉండాలి. సమస్త జీవరాశులు ఆనందం పంచుకోవాలన్న తపన పవన్ ది. ఆయన చాలా రోజులు మధన పడ్డారు.
పాలిటిక్స్‌లోకి రావాలంటే నిబద్ధత కలిగిన ..జనాన్ని ప్రేమించే వారు భయపడతారు. కానీ పవన్ కళ్యాణ్ ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారు. జనం నా పతాకం..సమాజ హితమే నా అభిమతం అని తన సందేశాన్ని వినిపించారు. అంతేనా అందరిలా మాటల వరకే పరిమితమై పోలేదు. స్పష్టమైన ప్రణాళికను తయారు చేసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన కార్యరంగంలోకి దిగారు. అదీ పవన్ కళ్యాణ్ కు మిగతా రాజకీయ నాయకులకు ఉన్న తేడా. చిటికేస్తే కోట్లు వచ్చి వాలే అవకాశం ఉన్నా ..అన్నింటిని ..అందరికీ దూరంగా ఉన్నారు. తన వారి కంటే లక్షలాది ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. కష్టాలను కొని తెచ్చుకున్నారు. జనం కోసం ఆమాత్రం చేయకపోతే ఎలా అని అమాయకంగా ప్రశ్నిస్తారు. ఇదీ పవన్ కళ్యాణ్ కు మిగతా నటులకు ఉన్న తేడా.
మనం బతికి ఉన్నామంటే ఏదో ఒకటి చేయాలి. లేకపోతే జీవితానికి ఏం అర్థం ఉంటుందని ప్రశ్నిస్తారు. పుస్తకాలను ఎక్కువగా చదివే అలవాటు ఏ కొద్ది మంది లీడర్లకు మాత్రమే ఉంటుంది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, దివంగత పీవీ నరసింహారావు, కోట్లాది ప్రజలను ఒకే తాటిపైకి నడిపించి..చివరి దాకా విలువలకు కట్టుబడిన నేతగా ఉన్న జయప్రకాశ్ నారాయణ్, అబ్దుల్ కలాం లాంటి వారంతా పుస్తక పురుగులే. నీతికి పెద్ద పీట వేస్తారు. విలువలకు కట్టుబడిన రాజకీయ నాయకులకు పవన్ కళ్యాణ్ ఎక్కువగా గౌరవిస్తారు. ఎమ్మెల్యేగా గెలిచినా ..మాజీ ఎమ్మెల్యేగా ఉన్నా గుమ్మడి నర్సయ్య ఇప్పటికీ సాదా సీదాగా బతకడాన్ని ఆయన ప్రస్తావిస్తుంటారు.
సింప్లిసిటి ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్..అవును మనల్ని మనుషులుగా..విజేతలుగా ..ఉన్నతమైన స్థానంలో నిలబడేందుకు కావాల్సిన దారిని..బలాన్ని ఇచ్చిన సమాజానికి మనం ఏమీ చేయలేక పోతే ఎలా ..ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే జనసేన. జనం కోసమే..ప్రజల కోసమే ఇది పనిచేస్తుంది. మాయ మాటలుండవు మనస్సాక్షి మాత్రమే. ఆచరణకు నోచుకోని హామీలుండవు..ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉంటుంది. ఇదంతా సామాజిక సోషలిజం. ధర్మబద్ధమైన ప్రజాస్వామ్యం ఇదే పవనిజం. ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం అందాలి. అంతరాలు లేని సమ సమాజమే జనసేన లక్ష్యం..పవన్ ధ్యేయం. సో..పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదు..కోట్లాది అభిమానులనే ఆయుధాలు కలిగిన జన నాయకుడు. ఇదే పవన్ డైనమిజం. కాదనగలరా ఎవరైనా..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి