అభివృద్ధి వైపే జనం - మళ్ళీ బాబుకే పట్టం - సర్వేలన్నీ అటు వైపే
సీన్ మారింది . ఏపీ రాజకీయాలు మరోసారి హీట్ పెంచినా మరోసారి చంద్ర బాబు నాయుడే సీఎం కాబోతున్నారంటూ పలు ముందస్తు సర్వేలు వెల్లడించాయి . మిషన్ చాణక్య తో పాటు వివిధ చానళ్ళు తమ సర్వేల ఫలితాలను ప్రకటించాయి . చాణక్య సంస్థ 101 సీట్లు టీడీపీకి రానున్నాయని ..మిగతా చానళ్ళు 105 సీట్లు వస్తాయని పేర్కొన్నాయి . కొంత మేరకు వ్యతిరేకత ఉన్నా ఆంధ్రా జనం మాత్రం బాబు వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అమలు చేస్తున్న పథకాలు . అభివృద్ధి ఇదే ముఖ్యం కానున్న్నాయి . టిడిపికి గణనీయమైన ఓటు బ్యాంకు ఉన్నది . ఏ సమయంలోనైనా కేంద్ర బిందువుగా మారే బాబు ఏది చేసినా ..ఓటమి మాత్రం ఒప్పుకోరు. ఆయన ఒక్కరే దేశం లో పీఎం మోడీని టార్గెట్ చేశారు . నిన్నటి దాకా కమలంతో దోస్తీ చేసిన బాబు ఈసారి ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేస్తున్నారు .
చంద్రబాబును అటు మోడీ ఇటు కేసీఆర్ , జగన్, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు . అయినా బాబు చలించలేదు . ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నారు . బీజేపీయేతర పార్టీలు, నాయకులను ఒకే తాటిపైకి తీసుకు వస్తున్నారు . ఓ వైపు ఏపీలో ఎన్నికలకు సిద్దమవుతూనే దేశంలో పర్యటించారు . వారిని ఒకే చోటుకు తీసుకు వచ్చారు. కర్ణాకటలో దేవెగౌడ ..తమిళనాడులో స్టాలిన్ ..కమల హాసన్ , ఢిల్లీలో కేజ్రీవాల్ .. యూపీలో మాయావతి ..బెంగాల్లో మమతా ..ఇలా ప్రతి ఒక్కరిని కూడగడుతూ ..మోడీజీని టార్గెట్ చేశారు . ఇంకో వైపు ఆంధ్రాకు ప్రత్యేక హోదా విషయంలో జగన్, కేసీఆర్ మాట్లాడటం లేదంటూ జనాన్ని జాగృతం చేశారు . రైతులకు , మహిళలకు , యూత్ కు చంద్ర బాబు భారీ తాయిలాలు ప్రకటించారు .
ఎన్నికలకంటే ముందే ప్రతి ఒక్కరు లబ్ది పొందేలా ..అందరి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు చేరేలా ముందస్తుగానే చెక్కులు అండ చేశారు . రాజధాని నిర్మాణం , కంపెనీల ఏర్పాటు , నిరుద్యోగ భృతి ..ఇలా లెక్కలేనంత పథకాలు అమలవుతున్నాయి . అందరు మూకుమ్మడిగా తనపై దాడి చేసినా ఒక్కడే ఎన్నికల యుద్ధంలోకి దిగారు . అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించారు . కేవలం ఆయా ప్రాంతాలలో గెలిచే అవకాశం ఉన్న వారికే పట్టం కట్టారు . చాలా పకడ్బందీగా ..చాప కింద నీరులా తన ప్లాన్ ను అమలు చేసుకుంటూ పోయారు . ఓ వైపు కేసులు ..ఇంకో వైపు జగన్ నుండి గట్టి పోటీ ఎదుర్కుంటున్నారు .
ఇంకో వైపు చెలిమి చేసిన పవన్ ..మోడీ దూరమయ్యారు . అయినా చంద్ర బాబు వెనక్కి తగ్గలేదు . దేశంలోనే తానొక్కడే మోడీని ఢీకొడుతున్నారు పోరాటం ప్రకటించారు . ఎన్ని ఐటి దాడులు చేసినా వెనక్కి తగ్గలేదు . దమ్ముంటే నాతో నేరుగా పోటీకి దిగాలంటూ సవాల్ చేశారు . అదీ నాయకుడికి ఉండాల్సిన లక్షణం. జగన్ ..కేసీఆర్ ఇద్దరు ఒక్కటైనా ..ఒవైసి మద్దతు తెలిపినా ..సర్వేలు మాత్రం మరోసారి బాబే సీయం కాబోతున్నారంటూవెల్లడించాయి . బాబు చాణక్యం పని చేస్తున్నా లేక జగన్ పవర్ లోకి వస్తారా ..పవన్ చక్రం తిప్పుతారా అన్నది త్వరలో తేలుతుంది .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి