ఆర్ధిక నేరగాళ్లకు బ్యాంకుల వత్తాసు - ప్రజల సొమ్ము దొంగల పాలు
బడా బాబులకు ..రుణాల ఎగవేత దారులకు ..దొంగలకు ..ఆర్ధిక నేరగాళ్లకు బ్యాంకులు వత్తాసు పలుకుతున్నాయి . వీరు చేసిన నిర్వాకాన్ని సాక్షాత్తు సిఇసి నిలదీసింది . పెద్ద ఎగవేతదారులను ఎందుకు వదిలి వేస్తున్నారంటూ ..వివరాలు తప్పనిసరిగా వెల్లడించాలని కోరింది . 50 కోట్లకు మించిన బకాయిదారులను మీరుందుకు వెల్లడించడం లేదని..అసలు ఎందుకు వారిని కాపాడుతున్నారని హెచ్చరించింది. ప్రజలు కస్టపడి దాచుకున్న డబ్బులను ఇలా అప్పనంగా రుణాల ఎగవేతదారుల ఎలా కట్టబెడుతున్నారు ..మిమ్మల్ని జాతి ద్రోహులుగా ప్రకటించరాదో చెప్పాలంటూ పేర్కొంది . దేశ వ్యాప్తంగా 7 వేల మంది పారిశ్రామిక వేత్తలు వేల కోట్లు కొల్లగొట్టారు . మోసగించారు . కట్టకుండా కళ్ళముందే తిరుగుతున్నారు . అయినా రుణాలు ఇచ్చిన బ్యాంకర్లు చోద్యం చూస్తున్నారు. ఈ మేరకు సిఇసి ఆర్ధిక శాఖ. ఆర్బీఐ , గణాంక శాఖలకు తాకీదులు ఇచ్చింది .
రైతులతో పాటు చిన్న మొత్తలు ఋణం తీసుకుని ..కట్టలేక పోతే వారి పేర్లు బహిర్గతం చేస్తూ అవమానాలకు గురిచేస్తున్నారని , కోట్లకు పైగా ఎగ్గొట్టిన వాళ్ళను మాత్రం వారి వివరాలు ఎందుకు వెల్లిదంచడం లేదంటూ సమాచార హక్కు చట్టం కమిషనర్ శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు . భారీ మొత్తలు ఎగవేస్తున్న వారికి ఒకసారి పరిషాకారం , వడ్డీ మాఫీతో పాటు ఇంకా అనేక సదుపాయాలు ..అధిక రాయితీలు కల్పిస్తున్నారు. మరి అదే తరహాలో సామాన్యులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు . బకాయిలు చెల్లించక పోయినా వారి గౌరవం పోకుండా బ్యాంకర్లు కాపాడుతున్నారని మండి పడ్డారు .
30 వేల మంది రైతులు అప్పులు తీర్చలేక చనిపోయారు . సమాజంలో తెలెత్తుకు తిరగలేక ఆత్మహత్యలు చేసుకున్నారు . 1998 -2018 మధ్య ఈ దారుణాలు జరిగాయి . భూమి పుత్రులు మట్టిని నమ్ముకుని చేసిన రుణాలు తీర్చలేక ఆక్కడే తనువు చాలించారు . పాలకులు పట్టించు కోలేదు . ఏడు వేల మంది పారిశ్రామిక వేత్తలు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి నా చర్యలు ఉండడం లేదు . 50 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకున్న వాళ్ళు , కావాలని రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళ వివరాలు బ్యాంకులు వెల్లడించాలని సిఇసి కోరింది . ఇది తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి వస్తుందని స్పష్టం చేసింది . ఆర్ధిక శాఖ . ఆర్బీఐ , అర్థ గణాంక శాఖలు ఎప్పటికప్పుడు వెల్లడించాలని ఆదేశాలు జారీ చేయడం దేశంలో పలు ప్రకంపనలు సృష్టించింది . ప్రజా ధనాన్ని దేశ ఆర్ధిక వ్యవస్థకు ఎలా పరిరక్షిస్తున్నారో కూడా తెలియ చేయాలనీ సూచించింది .
సమాచార హక్కు చట్టం లోని సెక్షన్ 4 (1 ) సి ప్రకారం ముఖ్యమైన విధానాలు రూపొందించేటప్పుడు ప్రజలపై ..అమిత ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకునేప్పుడు ..ప్రభుత్వ విభాగాలన్నీ తప్పక ప్రచురించాలని సిఇసి వెల్లడించింది . ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సమాచారం వెల్లడించడం సాధ్యం కాదని ఆర్బీఐ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ ను ధర్మాసనం కొట్టి వేసింది . ఇదేమి జాతిని నాశనం చేసే అంశం కాదని ..వెంటనే కోరిన వివరాలు ఇవ్వాల్సిందేనని తీర్పు చెప్పింది . 25 లక్షలు అంతకంటే రుణాలు తీసుకున్న ప్రతి ఒక్కరి వివరాలు ప్రచురించడంతో పాటు వివరాలు వెల్లడించాల్సిందేనని కోర్టు మొట్టికాయలు వేసింది . దీంతో ఆర్బీఐ కి భంగ పాటు తప్పలేదు . నేరగాళ్లు కళ్ళముందే తిరుగుతున్నా బ్యాంకర్లు ఎందుకు మౌనం వహిస్తున్నాయో ఆలోచించాలి . ప్రజల కోసం జవాబుదారిగా ఉండాల్సిన బ్యాంకులు నమ్మకాన్ని కోల్పోవడం ప్రమాదకరం .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి