విరాట్ కోహ్లీకి ఏమైంది ..?- అభిమానుల ఆందోళన - గంభీర్ ఆగ్రహం
విజయం ఊరిస్తుంది . అంతులేని సంతోషాన్ని ఇస్తుంది. గెలిచినప్పుడు చాలా మంది పొగిడేందుకు రెడీగా ఉంటారు . ఓటమి పాలైనప్పుడు మాత్రం మనం ఒక్కరమే మిగిలి ఉంటాం . ఇది సహజం . నిన్నటి దాకా దమ్మున్న ప్యేయర్ గా ప్రపంచం మెచ్చుకున్న ఇండియన్ డైనమిక్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ..ఐపీఎల్ లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. వరల్డ్ లోనే గొప్ప ఆటగాడిగా కోహ్లీకి పేరుంది. ఏ ఫార్మాట్ లోనైనా ఆడే దమ్ము ..ధైర్యం ఈ ఆటగాడికి ఉంది . లెక్కలేనన్ని పరుగుల వరద పారించిన కోహ్లీ ..ఈ టోర్నీలో నాయకుడిగా రాణించలేక పోతున్నాడు . అటు వన్డేలోను ..ఇటు టెస్టుల్లోనూ సెంచరీల మోత మోగించిన ఈ డాషింగ్ బ్యాట్స్ మెన్ పరుగుల కోసం వెయిట్ చేస్తున్నాడు.
ఇప్పటికి ఆరు మ్యాచులు ఆడితే అందులో ఏ ఒక్క దానిని గెలిపించలేక పోయాడు . మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న ఈ అరుదైన ఆటగాడు ఇప్పుడు లెక్కలేనంత విమర్శలు ఎదుర్కొంటున్నాడు. విజయాలు ..గెలుపులు అన్నీ కొద్దీ పాటే ఉంటాయి . దానిని అర్థం చేసుకున్న ఆటగాళ్లు కొద్దీ మందే. కోహ్లీకి కోపం ఎక్కువ . బెంగుళూరు చాలెంజర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ తన సహచర ఆటగాళ్లలో ధైర్యాన్ని ఇవ్వలేక పోతున్నాడు . దేశమంతటా అభిమానులు కోహ్లీని జీర్ణించుకోలేక పోతున్నారు . దాదాపు ఆ జట్టు యాజమాన్యం 17 కోట్ల రూపాయలు వేలం పాటలో కొన్నది . దానికి తగ్గట్టు ఆడాల్సిన ఈ క్రికెటర్ ఆశించిన ప్రదర్శన ఇవ్వలేక అటు మేనేజ్ మెంట్ ను ఇటు ఫాన్స్ ను ఇబ్బందుల పాలు చేస్తున్నాడు .
తలకు మించిన భారంగా తయారైంది కోహ్లీ వ్యవహారం. ఓ వైపు ఆయన భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు ..ఇంకో వైపు ప్రకటనల రూపేణా కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు . కానీ అసలైన టైం లో మాత్రం అత్యంత పేలవమైన ఆట ఆడుతుండడడంతో అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు . క్రికెట్లో ఇంతే ..గెలిస్తే దండాలు వేస్తారు ..ఓటమి పాలైతే రాళ్లు ...బాటిల్స్ ..పూలు చల్లేందుకు వెనుకాడరు . ఇప్పుడు ఈ డైనమిక్ ప్లేయర్ ఇదే ఫేస్ చేస్తున్నారు .
ఇక గౌతమ్ గంభీర్ మాత్రం కోహ్లీని టార్గెట్ చేసాడు . టోర్నీలో బెంగుళూరు ఓటమి పాలు కావడానికి కోహ్లీ నే కారణమని ఆరోపించాడు . తాను సరిగా ఆడలేక బౌలర్ల మీదకు నెట్టి వేయడం మంచి పద్ధతి కాదని నిప్పులు చెరిగారు. అన్ని వైపులా కోహ్లీ పై దాడులు ..విమర్శలు పెరిగాయి . ఇప్పటికైనా మించి పోయింది ఏమి లేదు ..కోహ్లీ నాయకత్వ బాధ్యతల నుండి తప్పుకుంటే మంచిదన్న అభిప్రాయం సీనియర్ ఆటగాళ్ల నుండి వ్యక్తమవుతోంది . కోహ్లీ.. ఆర్సీబీ ఇన్నేళ్లు నిన్ను కెప్టెన్‌గా భరించింది. అది చాలా గొప్పవిషయం. కానీ నువ్వు ఇంతవరకూ ఒక్క ట్రోఫీ కూడా గెలిపించలేకపోయావు’ అని అన్నాడు.
‘కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ కావచ్చు.. కానీ అత్యుత్తమ కెప్టెన్ మాత్రం కాదు. కెప్టెన్సీలో కోహ్లీ ఎప్పటికీ అప్రెంటీసే’ అంటూ ఘాటు గా విమర్శలు గుప్పించాడు . భారత జట్టు కెప్టెన్‌గా ఉండి ఐపీఎల్ గెలవని కెప్టెన్ కోహ్లీ మాత్రమే అని గంభీర్ పేర్కొన్నాడు. ధోనితో కోహ్లీని పోల్చడం సరికాదన్నాడు. భారత జట్టు వైస్ కెప్టెన్ అయిన రోహిత్‌శర్మ కూడా తన జట్టును రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలబెట్టాడని గుర్తు పెట్టుకోవాలన్నాడు. మొత్తం మీద ఈ వ్యవహారం ఇద్దరి మధ్య మాటల యుద్దానికి తెర లేపింది . టోర్నీలో కనీసం ఒక్క మ్యాచ్ అయినా కోహ్లీ గెలిపిస్తాడా లేక ఓటమితో సమాప్తం చేస్తాడో చూడాలి .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి