టాప్ కంపెనీల్లో ఫ్లిప్ కార్ట్ నెంబర్ వన్ - ఎంప్లాయర్స్ టాప్ ప్రయారిటి ఇదే
ప్రపంచ దిగ్గజ మార్కెట్ కంపెనీలన్నీ ఇండియాపైనే దృష్టి సారిస్తున్నాయి. వంద కోట్లకు పైగా ఉన్న జనాభాను టార్గెట్ చేశాయి. ఫ్రీ మార్కెట్ పుణ్యమా అని లెక్కలేనన్ని వస్తువులు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఎక్కడలేనంత డిమాండ్ ఉండడంతో వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. కోట్లాది రూపాయల లావాదేవీలు కేవలం గృహోపకర వస్తువులపైనే జరుగుతున్నాయి. కంపెనీలకు లెక్కలేనంత లాభాలు సమకూర్చి పెడుతున్నాయి. అన్నింటికంటే ఎక్కువగా పిల్లల వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. కస్టమర్లే దేవుళ్లు అంటూ ..జీఎస్టీ కూడా వీరి పైనే వేస్తూ..కంపెనీలు మాత్రం రుపీస్‌ను తమ గల్లా పెట్టెల్లోకి వేసుకుంటున్నాయి. మొత్తం మీద ఇండియన్స్ జేబులు మాత్రం గుల్లవుతున్నాయి.
ఓ వైపు అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కంపెనీలు మార్పులు చేర్పులు చేస్తున్నాయి. మరింత ఆకట్టుకునేలా..ఆకర్షణీయంగా ఉండేలా కంపెనీలను రూపొందిస్తున్నాయి. వీటి కోసమే కోట్లు కుమ్మరిస్తున్నాయి. ఈ కామర్స్ రంగంలో లక్ష కోట్ల వ్యాపారం జరుగుతోంది. వేలాది మందికి ఈ కంపెనీల్లో కొలువులు దక్కుతున్నాయి. ఇంకో వైపు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నష్టాల బాట పట్టాయి. ఈ భారాన్ని మోయలేమంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదవీ విరమణ వయస్సును తగ్గించి వేస్తున్నాయి. స్వచ్ఛంధ పదవీ విరమణ స్కీంను ప్రవేశ పెడుతున్నాయి. తాజాగా ఎన్నికల వేళ దేశానికి ఎంతో సేవలందించి పేరున్న బీఎస్ ఎన్ ఎల్ 54 వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుకు ఫైల్ రెడీ చేసింది. ఇంకో వైపు ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉందని..మూసి వేసే పరిస్థితికి తెచ్చుకోవద్దంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంతకు ముందే హెచ్చరించారు. ప్రైవేట్ కంపెనీలు ఎప్పుడు తీసుకుంటాయో ఎప్పుడు తీసి వేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.
ఈ కామర్స్ రంగంలో లెక్కలేనన్ని కొలువులు కొలువు తీరి ఉన్నాయి. కావల్సిందల్లా టాలెంట్ కలిగి ఉండటమే. అందుకే అధిక శాతం కొనుగోలుదారులనే కాదు ఉద్యోగులను ఆకట్టుకుంటున్నాయి ఈ కంపెనీలు. ఎక్కువ మంది ఇష్టపడే వాటిలో వాల్ మార్ట్ అనుబంధ సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్‌ను ఎంచుకుంటున్నారు. ఓయో, అమెజాన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. వన్ 97 కంపెనీ నాలుగో స్థానంలో ఉండగా..కొత్తగా ఈ జాబితాలో చేరిన ఉబర్ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. సోషల్ మీడియా దిగ్గజం లింక్‌డ్ ఇన్ కంపెనీ నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడించింది. టాప్ 10 కంపెనీల్లో ఎక్కువ భాగం ఇంటర్నెట్ కంపెనీలే చోటు దక్కించుకు్నాయి. ఈ ఏడాది ఐబీఎంతో పాటు టాటా గ్రూపునకు చెందిన ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్‌కు ఈ జాబితాలో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటో కంపెనీలలో పనిచేసే వారంతా సంతోషంగా ఉన్నామని తెలిపారు.
దేశంలోనే అత్యధిక మార్కెట్ వాటా కలిగిన అంబానీ నాయకత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు వీటిలో 10 వ స్థానంతో సరిపెట్టుకుంది.బోస్టన్ ఎస్ బ్యాంకుకు 14, ఐబిఎంకు 15, దాల్మియార్ ఏజీకి 16, ఫ్రెష్ వర్క్స్ కు 17, యాక్సెంచర్ కు 18, ఓలాకు 19, ఐసీసీఐ బ్యాంకుకు 20 , కెఎంజీకి 22, ఎల్ అండ్ టికి 23, ఒరాకిల్‌కు 24, క్వాల్ కామ్ కు 25 వ స్థానం దక్కింది. అన్ని కంపెనీల్లో ఎక్కువ శాతం మంది ఇంజనీర్లే ఉండడం విశేషం. ఆపరేషన్స్, వ్యాపార అభివృద్ధి విభాగాల్లోనే ఎక్కువగా ఉన్నారు. ఎంపిక చేసుకోవడంలోను..వసతి సౌకర్యాలను కల్పించడంలోను..ఉద్యోగ భద్రత విషయంలోను ఫ్లిప్ కార్ట్ కచ్చితంగా ఉంటోంది. అందుకే ఎక్కువ మంది దీని వైపు మొగ్గు చూపిస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి