కోటి మంది మెచ్చిన పైసాలో

టెక్నాల‌జీ మారింది. జ‌నం అభిరుచుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అవ‌స‌రాలు పెరిగాయి. అవ‌కాశాలు స‌న్న‌గిల్లాయి. ఈ స‌మ‌యంలో ఏదైనా డ‌బ్బులు కావాల్సి వ‌స్తే. ఎవ‌రిస్తారు అని ఎదురు చూసే రోజులు పోయాయి. ఎంచ‌క్కా మీ ట్రాక్ రికార్డు ..మీ సిబిల్ స్కోర్ బాగుంటే చాలు..బ్యాంకులే అక్క‌ర్లేదు..ఎన్నో డిజిట‌ల్ ఫైనాన్షియ‌ల్ కంపెనీలు ఇన్‌స్టంట్ క్యాష్‌ను మీ అకౌంట్లోకి నేరుగా జ‌మ చేస్తున్నాయి. క్యాష్ ఫ్లో అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉన్న‌ది. డిజిట‌ల్ టెక్నాల‌జీ పుణ్య‌మా అంటూ ఇపుడు రుణం పొందడం క‌ష్టం కాదు..చాలా సుల‌భం. కావాల్సింద‌ల్లా క్ర‌మం త‌ప్ప‌కుండా క‌ట్ట‌గ‌లిగితే చాలు ..మీకు తోచిన రీతిలో ..మీరు ఎంచుకున్న వాయిదాల ప‌ద్ధ‌తిలోనే డ‌బ్బులు తీసేసుకోవ‌చ్చు. ఈజీ లోన్స్ పేరుతో ఎన్నో ఎన్ ఎఫ్ బిసి లిస్టెడ్ కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. ఇంట‌ర్నెట్‌లో లోన్స్ ఇస్తామంటూ ఆఫ‌ర్లు కూడా ప్ర‌క‌టించేస్తున్నాయి. బ్యాంకుల‌కు వెళ్లాల్సిన ప‌నిలేదు.

ఎవ‌రినీ దేబ‌రించాల్సిన అవ‌స‌రం లేదు. బ్రోక‌ర్ల ఇబ్బంది అంటూ ఉండ‌దు. నేరుగా మీరు..కంపెనీ మాత్ర‌మే ఉంటుంది. కావాల్సింద‌ల్లా మీకు మొబైల్ నంబ‌ర్ క‌లిగి ఉండ‌డం, దాని ద్వారానే పైసా లో అంటూ యాప్‌ను గూగుల్ స్టోర్స్ నుండి డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఈజీగా లోన్స్ ల‌భిస్తాయి. ఢిల్లీ కేంద్రంగా పైసాలో డిజిట‌ల్ కంపెనీ లిమిటెడ్ ఏర్ప‌డింది. దీనికి సిఇఓగా సంతాను అగ‌ర్వాల్ ప‌నిచేస్తున్నారు. ప్రారంభించిన కొద్ది కాలంలోనే స‌ర్వీసెస్ బాగుండ‌డంతో ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా కోటి మందికి పైగా పైసాలో స‌భ్యులై పోయారు. అంటే ల‌క్ష‌లాది మంది ఈ సంస్థ ద్వారా ల‌బ్ధి పొందారు. త‌మ అవ‌స‌రాల‌కు స‌రిప‌డా డ‌బ్బులు తీసుకున్నారు. క‌ష్టాల నుండి గ‌ట్టెక్కారు. క‌ఠిన‌త‌ర‌మైన నిబంధ‌న‌లు అంటూ ఉండ‌వు.

ఈజీ ప్రాసెసింగ్..ఈజీ గోయింగ్..ఈజీ మ‌నీ ..ఈ సంస్థ ఉద్ధేశం. పైసాలోలో ఎనిమిది మంది బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్లుగా ఉన్నారు. వారిలో సునీల్ అగ‌ర్వాల్ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా, హ‌రీష్ సింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌గా, భామా కృష్ణ‌మూర్తి, ప్ర‌దీప్ అగ‌ర్వాల్, గౌరీ శంక‌ర్, న‌రేష్ కుమార్ జైన్, సునీల్ శ్రీ‌వాత్స‌వ్‌లు ఇండిపెండెంట్ డైరెక్ట‌ర్‌లుగా కొన‌సాగుతున్నారు. అనూప్ కృష్ణ డైరెక్ట‌ర్‌గా స‌మ‌ర్థ‌వంతంగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌మాక‌ర ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడే డ‌బ్బుల విలువ ఏమిటో తెలుస్తుంది. అందుకే దానిని అధిగ‌మించాల‌నే ఉద్ధేశంతో పైసాలో సంస్థ‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగిందంటున్నారు సిఇఓ సంతాను అగ‌ర్వాల్. అంతా ఆన్ లైన్‌లోనే ప్రాసెస్ మొద‌ల‌వుతుంది. ముందు పైసాలో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఓటిపి నెంబ‌ర్ వ‌స్తుంది. మీరు రిజిష్ట‌ర్ చేసుకోవ‌డం జ‌రిగాక‌..మీ వివ‌రాల‌తో న‌మోదు చేసుకోవాలి.

మీ రిక్వైర్ మెంట్ కోసం రిక్వెస్ట్ పంపించిన వెంట‌నే మీరు ఇచ్చిన వివ‌రాల ప్ర‌కారం సంస్థ మీ సిబిల్ స్కోర్‌ను కాల్యూక్‌లేట్ చేస్తుంది. త‌ర్వాత మీ స్కోరు బాగుంటే ఇంకెవ్వ‌రి పూచీక‌త్తు లేకుండానే మీర‌డిగిన డ‌బ్బుల‌ను రుణంగా మీ సేవింగ్స్ లేదా క‌రెంట్ బ్యాంకు ఖాతాలోకి నిమిషాల్లోనే బ‌దిలీ చేస్తారు. త‌క్కువ వ‌డ్డీ, ఎక్కువ డాక్యుమెంటేష‌న్ ఛార్జీలు లేకుండానే ఈ స‌దుపాయాన్ని పైసాలో అంద‌జేస్తుంది. దీంతో జ‌నం త‌మ అవ‌స‌రాలు తీర్చుకునేందుకు పైసాలోను ఆశ్ర‌యిస్తున్నారు. రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నియ‌మ నిబంధ‌న‌లు లోబ‌డే లావాదేవీలు, వ్య‌వ‌హారాలు సంస్థ నిర్వ‌హిస్తుంది. ఎలాంటి తేడాలు వ‌చ్చినా ఆర్బీఐ వేటు వేసే ప్ర‌మాదం ఉంది. క‌స్ట‌మ‌ర్ల‌కు నాణ్య‌మైన సేవ‌లందిస్తూ చిర‌కాలంలోనే లోన్స్ ఇవ్వ‌డంలో పైసాలో రికార్డు సృష్టించింది. కోటి మందిని త‌న ఖాతాలోకి వేసుకుంది. డ‌బ్బులు కావాలంటే ఊరికే రావు..క‌దూ..మీరూ ట్రై చేసి చూడండి.

కామెంట్‌లు