జాక్ పాట్ దక్కించుకున్న ఓలా
క్యాబ్స్ రంగంలో ఓలా టాప్ పొజిషన్‌లో ఉంది. ఇంకేం ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. 3 డిసెంబర్ 2010లో భవిష్ అగర్వాల్ , అంకిత్ భాటి ఓలా కంపెనీని స్థాపించారు. అప్పటి నుంచి నేటి దాకా ఓలా తన బ్రాండ్‌ను విస్తరించుకుంటూ వెళుతోంది. వ్యాపార పరంగా సుస్థిర స్థానాన్ని స్వంతం చేసుకుంది. బెంగళూరు కేంద్రంగా స్టార్ట్ చేసిన స్టార్టప్ ఇవాళ కోట్లను కొల్లగొడుతోంది. వెహికిల్ ఫర్ హైర్ పేరుతో మొదట ప్రారంభమైన ఓలా కంపెనీ ఎన్నో కష్టాలను చవిచూసింది. 6,000 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 758 కోట్ల రూపాయల ఆదాయాన్ని గడించింది. ఫుడ్ పాండా ఇండియా, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటి ఓలాలో భాగంగా ఉన్నాయి. ఆన్‌లైన్ ట్రాన్స్ పోర్టేషన్ నెట్ వర్క్ కంపెనీని డెవలప్ చేసింది ఏఎన్ ఐ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. మే 2019 వరకు చూస్తే ..ఓలా విలువ ఇపుడు 6.2 బిలియన్ డాలర్లు.
ఓలాలో సాఫ్ట్ బ్యాంక్ భారీగా పెట్టుబడులు పెట్టింది. ముంబైలో ప్రారంభమై బెంగళూరు కేంద్రంగా ఓలా పనిచేస్తోంది. 10, 00, 000 లక్షల వాహనాలు ఈ సంస్థ పేరుతో దేశంలోని ప్రధాన రహదారులపై నడుస్తున్నాయి. ఎంతో మంది ప్రయాణికులను ఒక చోటు నుంచి మరో చోటుకు తరలిస్తూ విశిష్ట సేవలందిస్తున్నాయి. 169 నగరాలకు ఓలా విస్తరించింది. మరో వైపు ప్రయోగాత్మకంగా ఆటోరిక్షాలను రెంట్ బేసిస్ నడిపేందుకు ట్రయల్ రన్ చేసింది. దీనికి కూడా మంచి స్పందన రావడంతో ఆటో రిక్షాలను అద్దెకు ఇచ్చే పద్ధతిలో ఢిల్లీ, పూణే, చెన్నై, హైదరాబాద్‌లో ప్రారంభించింది ఓలా. 2018 జనవరిలో ఓవర్సీస్ మార్కెట్‌లోకి వెళ్లింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుకె కు విస్తరించింది. అక్కడ కూడా ఆటో రిక్షాలను అద్దె కు ఇస్తూ డాలర్లు పోగేసుకొంటోంది. 2014లో 1394 కోట్ల ఆదాయాన్ని గడించింది ఓలా. ప్రయాణికులకు మరిన్ని సేవలను అందించేందుకు ఓలా యాప్ డెవలప్ చేసింది.
ఒక్కసారి దానిని డౌన్లోడ్ చేసుకుంటే చాలు ఈజీగా బుకింగ్..నిమిషాల్లో కోరుకున్న చోటికి చేరుకోవచ్చు. ఊబెర్‌తో ఓలా పోటీ పడుతోంది అందుకే. అయినా మార్కెట్‌లో ఎన్ని క్యాబ్స్ వచ్చినా ఓలా మాత్రం తన బ్రాండ్‌ను ..తన సేవలను యధావిధిగా చేసుకుంటూ వెళుతుఓంది. ఏ వాహనం ఎక్కడికి వెళుతుంది..అనేది ఈజీగా తెలుస్తుంది. జియో ట్యాగ్ సిస్టంను డెవలప్ చేసింది ఓలా. 2015 వరకు వచ్చేసరికల్లా 20 శాతం బుకింగ్స్ అన్నీ ల్యాప్ టాప్స్, డెస్క్ టాప్‌ల ద్వారానే జరిగాయి. దీనిని గమనించిన ఓలా మొబైల్స్‌ను టార్గెట్ చేసింది. ఫుడ్ పాండా స్టార్టప్ కంపెనీతో టై అప్ చేసుకుంది ఓలా. ఫుడ్ ఆర్డర్స్ చేస్తే ఓలా డెలివరీ చేస్తూ వచ్చింది. ఫుడ్ డెలివరీ సిస్టమ్‌ను 2017లో ప్రారంభించింది.
స్కూటర్లను అద్దెకు ఇచ్చే సంస్థ ఓగోతో ఒప్పందం కుదుర్చుకుంది. ఓగో కంపెనీలో 100 మిలియన్ల పెట్టుబడి పెట్టింది. టైగర్ గ్లోబల్, మ్యాట్రిక్స్ ఇండియా లు ఓలాలో 400 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. అదే నెలలో హ్యూందాయి, కియా కంపెనీలు ఓలాలో 300 మిలియన్లు ఇన్వెస్ట్ చేశాయి. కర్ణాటక స్టేట్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్‌మెంట్ ..నిబంధనలు పాటించడం లేదంటూ ఆరు నెలల పాటు ఓలా సర్వీసులకు నో చెప్పింది. ఇదే సమయంలో బైక్‌లను అద్దెకు ఇవ్వడం స్టార్ట్ చేసింది ఓలా. డ్రైవర్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో ప్లాన్ చేసింది. వారికి శిక్షణ ఇప్పించడం..క్యాబ్స్ సర్వీసెస్‌కు వాడుకోవడం..మినిమం జీతం వచ్చేలా చేసింది. ప్రతి రోజు 15 లక్షల బుకింగ్స్ రావడం ఇదో రికార్డుగా నమోదైంది. 60 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది ఓలా.
దేశీయంగా క్యాబ్ సేవలందిస్తున్న ఓలాకు చెందిన ఓటా ఎలక్ట్రిక్‌లో రతన్ టాటా పెట్టుబడులు పెట్టారు. ఓలా మాతృ సంస్థ అయిన ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌లో కూడా రతన్ అంతకు ముందు పెట్టుబడులు పెట్టారు. అయితే ఆయన ఎంత పెట్టుబడులు పెట్టిందీ ఓలా యాజమాన్యం వెల్లడించలేదు. గ్లోబల్, మాట్రిక్స్ ఇండియా వంటి సంస్థలు వాటాదార్లుగా కొనసాగుతున్నాయి. వీటన్నిటి వల్ల ఇప్పటికే ఓలా విద్యుత్ ఎలక్ట్రిక్‌కు రూ.400 కోట్ల మేర పెట్టుబడులు అందాయి. ఈ సందర్భంగా 2021కల్లా దేశంలో 10 లక్షల విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టాలనే సంస్థ లక్ష్యానికి ఈ పెట్టుబడులు ఎంతో ఉపకరిస్తాయని ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు.టాటా దృష్టి ఎప్పుడూ లక్ష్యం వైపే ఉంటుంది. ఆయనతో కలిసి చేస్తున్న ఈ ప్రయాణంలో మరెన్నో మైలు రాయిలను దాటుకుంటూ వెళ్లగలమ’ని అన్నారు. ఓలా ఆశయం నెరవేరాలని ఆశిద్దాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి