పసిడి కోసం అతివల ఆరాటం..జోరు మీదున్న బంగారం
ఇండియన్ మార్కెట్ టోటల్లీ డిఫరెంట్. ఇక్కడ నమ్మకాలకు ప్రయారిటీ ఎక్కువ. మహిళలు ఉపవాసమైనా ఉంటారేమో కానీ బంగారం కనిపిస్తే చాలు కొనకుండా ఉండలేరు. అంతలా పసిడి వారి కుటుంబంలో భాగమై పోయింది. కనీసం గ్రామ బంగారమైనా సరే అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేసేందుకు క్యూ కడతారు. నిన్నటి దాకా ఖాళీగా ఉన్న పసిడి దుకాణాలు ఇపుడు కళకళలాడుతున్నాయి. భారీ ఎత్తున మహిళలు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. దీంతో హైదరాబాద్, తదితర నగరాల్లో గోల్డ్ షాపులు జిగేల్ మంటున్నాయి. 25 శాతం అమ్మకాలు పెరిగాయి. అక్షయ తృతీయ పుణ్యమా అంటూ నగల వ్యాపారులకు పంట పండుతోంది. ఎక్కువగా పసిడి కొనుగోలు చేయడంతో వీరికి బాగానే కలిసొచ్చింది. ప్రధాన నగరాల్లోని నగల దుకాణాల్లో కొనుగోలుదారుల సందడి కనిపించింది.
గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు భారీగా పెరిగాయి. మరికొన్ని దుకాణాల్లో 40 శాతానికి పైగా అమ్మకాలు జరగడం చాలా మంది వ్యాపారస్తులను పునరాలోచనలో పడేసింది. గత రెండు నెలల కాలం నుండి బంగారం ధరల్లో మార్పు లేక పోవడం..రేటు స్థిరంగా ఉండడం వల్ల కొనుగోలుదారులు పసిడిని తీసుకునేందుకు బారులు తీరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తులం బంగారం ధర 33 వేల 700 రూపాయలు ఉండగా వివిధ నగరాల్లో మేలిమి బంగారం ధర 31 వేల 800 నుండి 32 వేల మధ్య ట్రేడింగ్ జరిగింది. దీంతో చాలా మంది కొనుగోలుదారులు అక్షయ తృతీయ పండుగ రోజు డెలివరీ తీసుకునేలా ..ముందస్తుగానే నగలు , ఆభరణాలు, ఇతర వస్తువులు బుక్ చేసుకున్నారు. అటు దుకాణాలకు ఇటు కొరియర్ , డెలివరీ సంస్థలకు పంట పండింది.
మరో వైపు ఎండలు భగభగమంటున్నా లెక్క చేయకుండా మహిళలు, పురుషులు దుకాణాలకు పరుగులు తీశారు. ఆఫీసు పనివేళల తర్వాత చాలా మంది మహిళలు కోనుగోలు కోసం ..ముందే బుక్ చేసుకున్న నగలు తీసుకునేందుకు వెళ్లారు. ప్రతి నగరంలో రాత్రి పది గంటల వరకు దుకాణాలు తెరిచే ఉంచారు. గతంలో తృతీయ పండుగ రోజు భారీ ఎత్తున దేశ వ్యాప్తంగా కొనుగోళ్లు కోట్లల్లో ఉంటే ఈ సంవత్సరం తృతీయ పండుగ రోజు మాత్రం కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయి. కేవలం పది గ్రాముల లోపు ఉండే నగలను కొనుగోలు చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పోయేలా చేసింది. తయారీ ఛార్జీలపై దుకాణాదారులు 25 శాతం నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్స్ ఇచ్చాయి. కొన్ని కార్పొరేట్ నగల దుకాణాలు ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం పేరుతో కొనుగోలుదారులను ఆకర్షించాయి. మొత్తం మీద కొనుగోలు దారులకు..ఇటు దుకాణాదారులకు ఈ అక్షయ తృతీయ ఆనందాన్ని మిగిల్చింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి