ఐటీలో బ్లాక్ చెయిన్ దే జోష్
టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు మరెన్నో చేర్పులు. రోజుకో ప్లాట్ ఫాం తయారవుతోంది. ఇంటెర్నెట్ ఆధారిత రంగాలలో ఐటీ కీలక భూమికను పోషిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, రోబో టెక్నాలజీతో పాటు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఇపుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఈ టెక్నాలజీ సాయంతో ఏమైనా చేయొచ్చు. దీంతో దీనికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో అనుభవం పొందిన ఎక్స్‌పర్ట్స్‌కు, సాఫ్ట్ వేర్ రంగానికి చెందిన వారికి ఎనలేని డిమాండ్ ఉంటోంది. వివిధ రంగాలకు చెందిన కంపెనీలు ముఖ్యంగా ఈ కామర్స్ దిగ్గజాలకు ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగ పడుతోంది.
ఫైనాన్షియల్ గా తక్కువ ఖర్చు, ఎక్కువ ఉపయోగం కలుగుతోంది. సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్ సిస్టం ద్వారా ప్రాసెసింగ్ అన్నది వేగంగా జరుగుతుంది. బ్లాక్ చెయిన్ డెవలప్‌మెంట్ కంపెనీ డేటా బేస్ మీద పనిచేస్తోంది. దీనిని వాడడం వల్ల ఒక చోటు నుంచి మరో చోటుకు వస్తువులను చేరవేయడం సులభమవుతుంది. కాస్ట్ కటింగ్, టైమ్ మేనేజ్‌మెంట్, ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ అన్నది ఇందులో భాగంగా ఉంటోంది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. టెక్నాలజీ మరింత సులభంగా మారిపోతుంది. ఎఫిషియంట్ ప్రాసెసెంగ్ అన్నది కీలకం. ఈఆర్‌పీ సిస్టం ఇందులో వినియోగిస్తారు. డెలివరీ డాక్యుమెంట్స్‌ను డిజిటలైజేషన్ చేసేందుకు వీలవుతుంది. ఎఫిషియంట్ క్యాష్ సెటిల్‌మెంట్ అన్నది కీలకం ఇక్కడ.
ఒన్ లేయర్ ఇన్ వాయిస్ పేమెంట్ సిస్టంను బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. దీని ద్వారా క్యాష్ ఫ్లోను కంట్రోల్ చేయడం సులభమవుతుంది. స్మార్ట్ ఇన్ వాయిసెస్ ద్వారా పేమెంట్ చేస్తోంది. డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ ద్వారా బ్యాంక్ డ్రైవెన్ సిస్టంతో బ్యాంకులు చెల్లింపులు జరుపుతున్నాయి. అత్యంత వేగంగా ట్రాన్సాక్షన్స్ జరిపేందుకు వీలు కలుగుతుంది. సప్లయి చైన్ ఫైనాన్స్ కమ్యూనిటీ ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. మల్టీ కరెన్సీ , గ్లోబల్ సప్లయిర్ బేస్ ప్రోగ్రామ్స్ తో లావాదేవీలు నడపడం చాలా సులభం. ఏ కంపెనీ అయినా లేదా ఏ సంస్థ అయినా, ఏ వ్యాపారమైనా ఇన్ వాయిసెస్ ముఖ్య పాత్రను పోషిస్తాయి. బ్లాక్ చెయిన్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం వల్ల ఇన్ వాయిసెస్ ను వాలిడేటింగ్ చేయడం మరింత ఈజీ అవుతుంది.
ఒక్కోసారి ఈ టెక్నాలజీ వాడక పోతే రెండు సార్లు ఇన్ వాయిస్‌లు వచ్చే వీలుంది. దీంతో వ్యాపారస్తులకు విపరీతమైన నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. ప్రామిస్ టు పే పేరుతో ఇన్ వాయిసెస్ జారీ చేస్తారు. దీని ద్వారా చాలా వరకు బర్డెన్ అన్నది తగ్గుతుంది. ఖర్చుతో పాటు కాలం మిగులుతుంది. రోజూ వారీ కార్యకలాపాలు, ఆర్థిక పరమైన లావాదేవీలన్నీ నిర్వహించేందుకు ఈ టెక్నాలజీ దోహద పడుతుంది. సంస్థలను నిర్వహించడం కష్టతరంగా మారిన ఈ రోజుల్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎడారిలో ఒయాసిస్సులా మారింది. దీనిని వాడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. అన్ని రంగాల సంస్థలకు ప్రయోజనకరంగా మారడంతో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ తన జోష్‌ను కొనసాగిస్తూనే ఉన్నది. రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ టాప్ పొజిషన్‌లోకి రావచ్చు. అదెంతో దూరంలో లేదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి