ఎండలే ఎండలు ..జనం గగ్గోలు
ఎన్నడూ లేనంతగా ఈసారి ఎండలు దంచి కొడుతుండడంతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. వృద్ధులు , చిన్నారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామాన్యుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. తాగేందుకు నీళ్లందని దుస్థితి నెలకొంది. జలాశయాలు అన్నీ ఎండి పోయాయి. ప్రధాన కాలువల్లో నీళ్లు లేవు. ఇటవలే ముఖ్యమంత్రి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నారాయణపూర్ నుండి నీళ్లు విడుదల చేయించారు. అవి జూరాలకు రావడానికి కొంత సమయం పడుతుంది. తాగేందుకు నీళ్లందక ప్రజలు తల్లడిల్లి పోతున్నారు. సాగు నీటికి దిక్కే లేకుండా పోయింది. వ్యవసాయం పూర్తిగా ఎండల దెబ్బకు ఉత్పత్తి గణనీయంగా పడి పోయింది. రైతులు పొలాల దగ్గరకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఒకప్పుడు 20 డిగ్రీలున్న ఎండ శాతం ఇపుడు 41 శాతానికి చేరుకుంది. ఉదయం 7 గంటలకే ఎండలు స్టార్ట్ అవుతున్నాయి.
కేపిటల్ సిటీ హైదరాబాద్ నిప్పుల కొలిమిని తలపింప చేస్తోంది. తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతోంది. బస్సులు, రైళ్లలో ప్రయాణం చేయాలంటే ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఫణి తుపాను తర్వాత ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగి పోయాయి. దీంతో ఎక్కడ చూసినా ఎండ వేడిమి దెబ్బకు పెరుగుతోంది. సాధారణం కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పుడే వివిధ రకాల పరీక్షలకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు నడుస్తున్నాయి. పిల్లలు పరీక్షలు రాయలేక ఎండల దెబ్బకు తట్టుకోలేక లబోదిబోమంటున్నారు. మరో వైపు ఎండ తీవ్రత దెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు. వీరి గురించి ఇంతవరకు ఎంత మంది నేలరాలారో లెక్కలు లేవు. ఒక్క హైదరాబాద్‌లోనే ఉష్ణోగ్రత 41కి చేరింది. ఈ నెలాఖరు వరకు ఎండలు మరింత పెరుగతాయని ..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వడగాల్పులు బలంగా వీచే అవకాశం ఉందని, జాగ్రత పాటించాలని సూచిస్తోంది.
మరో 10 రోజుల పాటు పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని, దానిని తట్టుకునేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని తెలిపింది. పగటి పూట బయట తిరగొద్దని, ఎంతో అత్యవసరమైతే తప్ప ఇతర ప్రాంతాలకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.
ఉదయం నుండే భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. మధ్యాహ్నం మరింత పెరుగుతోంది వేడిమి. వేడి, ఉక్కపోతలతో సతమతమవుతుంటే..మరో వైపు వడగాల్పులు ఇబ్బంది పెడుతున్నాయి. ఎంత నీరు తాగినా దాహం తీరక నానా అవస్థలు పడుతున్నారు జనం. పచ్చదనం లేక పోవడం, పర్యావరణం దెబ్బతినడం , ఏటా పెరుగుతున్న కాలుష్యం కూడా ప్రధాన కారణమవుతోంది. ఎండ వేడిమి నుంచి రక్షించుకునేందుకు ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. వానలు వచ్చేంత వరకు వేచి చూడక తప్పడం లేదు. మొత్తం మీద జనం జంకేలా ఎండలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వరుణ దేవుడు కరుణిస్తాడనే నమ్మకంతో ప్రజలు ఉన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి