జీ - వాటాల కోసం దిగ్గజాల పోటీ
వినోద రంగంలో ఆసియా ఖండంలోనే అతి పెద్ద నెట్ వర్క్ కలిగిన జీ గ్రూపు సంస్థ ఇపుడు కష్టాలను ఎదుర్కొంటోంది. ఏ సమయంలోనైనా ..ఎలాంటి ఉపద్రవం వచ్చినా సరే తట్టుకునే శక్తి ..సామర్థ్యం జీ గ్రూపు సంస్థల చైర్మన్ సుభాష్ చంద్రకు ఉన్నది. ఎందుకంటే ఆయన బియ్యం వ్యాపారం నుండి వచ్చారు కనుక. కింది స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు పనిచేసే ప్రతి ఒక్కరికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంలో జీ గ్రూపు తర్వాతే ఇంకే కంపెనీ అయినా. 1926లో దీనిని ప్రారంభించారు. 93 ఏళ్లు పూర్తయ్యాయి. ఎస్సెల్ గ్రూప్‌ను జగన్నాథ్ గోయొంకా దీనిని ముంబయిలో స్థాపించారు. ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా జీ విస్తరించింది. మీడియా, ఎంటర్ టైన్ మెంట్, ప్యాకేజింగ్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ , ఎడ్యూకేషన్, మెటల్స్, టెక్నాలజీ రంగాలలో జీ పనిచేస్తోంది. ప్రస్తుతం 10 వేల మందికి పైగా పనిచేస్తున్నారు.
2017లో 2.4 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరింది. జీ న్యూస్, జీ హిందూస్తాన్, వియోన్, జీ బిజినెస్, జీ 24 గంటలు (దీనిని మూసి వేశారు), జీ 24 టాస్, జీ 24 కలక్, జీ బీహార్ ఝార్ఖండ్, జీ మధ్య ప్రదేశ్ ఛత్తీస్ గఢ్ , జీ ఉత్తర ప్రదేశ్ ఉత్తరాఖండ్, జీ ఒడిస్సా, జీ పంజాబ్ హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జీ రాజస్థాన్, జీ సలాం మీడియా, జీ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్, జీ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్, డెయిలీ న్యూస్ అండ్ అనాలసిస్ అండ్ పిక్చర్స్, టీవీ, టెక్నాలజీ, డిష్ టివి, సిటీ కేబుల్, జీ టర్నర్ లిమిటెడ్ ఎంటర్ టైన్ మెంట్, ఈ సిటీ వెంచర్స్, పాన్ ఇండియా నెట్ వర్క్ లిమిటెడ్ - ప్లే విన్ , ముంబయి ఎఫ్‌సీ, ప్యాకేజింగ్, ఎస్సెల్ ప్రాప్ పాక్, ఇన్ ఫ్రా స్ట్రక్చర్, ఎస్సెల్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఎస్సెల్ వరల్డ్, వాటర్ కింగ్ డమ్, సన్ సిటీ ప్రాజెక్ట్స్, ప్రిసీయస్ మెటల్, శ్రీపూర్ గోల్డ్ రిఫైనరీ లిమిటెడ్, జ్యూయలరీ, ఎడ్యూకేషన్, హిమ్‌గిరి జీ యూనివర్శిటీ, జీ లర్న్ లిమిటెడ్, కిడ్ జీ, మౌంట్ లిటేరా వరల్డ్ ప్రీ స్కూల్స్, జీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మీడియా ఆర్ట్స్, జీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్, జీ క్యూ, హెచ్ జెడ్ యు, డిజి నెక్ట్స్ ఎడ్యూకేషన్ ప్రైవేట్ లిమిటెడ్, చారిటి, ఏకల్ విద్యాలయ, గ్లోబల్ విపాసన ఫౌండేషన్, తాలీం ఉ్నాయి.
మీడియా..వినోదం రంగంలో ఇండియా పరంగా చూస్తే ఇంతలా విస్తరించిన సంస్థ ఏదీ లేదు. అంతలా పాపులర్ చేసిన ఘనత సుభాష్ చంద్రదే. ఎంటర్ టైన్ మెంట్ రంగంలో చోటు చేసుకున్న పరిణామాల రీత్యా జీ గ్రూపు కొంత ఇబ్బందికరమైన స్థితిని ఎదుర్కొంటోంది. దీంతో కొంత వాటాలను అమ్మాలని నిర్ణయించింది. అతి పెద్ద కంటెంట్ ను కలిగి ఉన్నది జీ సంస్థ. ఈ వాటాలను కొనుగోలు చేసేందుకు అంబానీ, మిత్తల్ పోటీ పడుతున్నారు. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద మొబైల్ మార్కెట్ అయిన ఇండియాలోని ఈ సంస్థలు కంటెంట్ కోసం ప్రయత్నిస్తున్నాయి. వీరు జీ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజెస్ కోసం తలపడనున్నారు. భారతీ ఎయిర్ టెల్ సంస్థ జీ ఎంటర్ టైన్ మెంట్ కోసం చర్చలు మెదలు పెట్టింది. త్వరలో ఒక ప్రతిపాదనను కూడా ముందుకు తెచ్చినట్టు సమాచారం. మరో వైపు టెలికాం దిగ్గజం రిలయన్స్ కు చెందిన జియో కూడా జీ వాటాల కొనుగోలు అంశాన్ని పరిశీలిస్తోంది. దీనిపై బలమైన భాగస్వామ్యంతో చర్చలు జరుపుతున్నది వాస్తవమేనని వెల్లడించారు.
ఈ పోటీ తీవ్రతరం కావడం వెనుక ఓ మతలబు దాగి ఉన్నది. ప్రభుత్వం ఈ ఏడాది 5జీ కోసం వేలం నిర్వహించనుంది. వీడియో కంటెంట్ సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకు వచ్చే వీలుకలుగుతుంది. దీని ద్వారా భారీ ఆదాయాన్ని పొందవచ్చని అంచనా. వరల్డ్‌లోనే అతి పెద్ద టెలికమ్యూనికేషన్ కంపెనీలు ఏటీఅండ్‌టీ, వొడాఫోన్, కేడీడీఐ కార్ప్‌లు కూడా సినీ, టెలివిజన్ సంస్థలను కొనుగోలు చేయడంతో పాటు టీవీ రంగానికి చెందిన ఆస్తులను కూడా కొనుగోలు చేశాయి. ఈ కంపెనీలు భవిష్యత్‌లో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్‌తో పోటీ పడనున్నాయి. భారతీ ఎయిర్ టెల్ 4.6 బిలియన్ డాలర్లను రైట్స్ ఇష్యూ రూపంలో సమీకరించి నిధులను సిద్ధం చేసుకుంది. గత ఏడాది జీ సంస్థతో ఒప్పందం కూడా చేసుకుంది.
సుభాష్ చంద్ర నేతృత్వంలోని జీ సంస్థ అప్పుల్లో కూరుకు పోయింది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటోంది. వ్యూహాత్మక భాగస్వామి కోసం వెదుకుతోంది. జీ ఛానల్స్ కు 1.3 బిలియన్ల ప్రేక్షకులు ఉన్నారు. 178 దేశాల్లో 78 ఛానళ్లను నిర్వహిస్తోంది. 4,800 సినిమాలపై హక్కులు పొందింది. గతంలో సోనీ, కామ్ కాస్ట్‌లు దీనిని కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేశాయి..కానీ ఫలించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో జియో పరమవుతుందా లేక ఎయిర్ టెల్ దక్కించుకుంటుందా అన్నది వేచి చూడాల్సిందే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి