ప‌వ‌న్ ఎంట‌రైతే వార్ వ‌న్ సైడే

కోట్లాది అభిమానుల‌ను క‌లిగిన కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు ఇపుడు దేశంలోనే సంచ‌ల‌నం రేపుతోంది. ఆహార్యంలోను..ఆలోచ‌నా విధానంలోను ప్ర‌త్యేక‌త‌ను క‌లిగిన వ్య‌క్తిగా ఈ ప‌వ‌ర్ స్టార్‌కు ఉన్న‌ది. అటు ఏపీలోను ఇటు తెలంగాణ‌లోను ఈ హీరోకు లెక్క‌లేనంత ..లెక్కించ‌లేనంత మంది అభిమానులు ఉన్నారు. చిటికె వేస్తే చాలు ఏ త్యాగానికి సిద్ధంగా ఉన్న బ‌లగం ఆయ‌న‌కు ఉన్న‌ది. స‌మ‌స్త ప్ర‌జ‌ల ప‌ట్ల అచంచ‌ల‌మైన న‌మ్మ‌కం..స‌మాజం ప‌ట్ల బాధ్య‌త ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను న‌టుడి స్థాయి నుండి నాయ‌కుడిగా మారేందుకు దోహ‌ద ప‌డింది. ఎక్క‌డికి వెళ్లినా ..ఏ స్థాయిలో ఉన్నా ప్ర‌తి ఒక్క‌రిని ఈ హీరో ఆప్యాయంగా పల‌క‌రిస్తారు. జ‌న సంక్షేమ‌మే ధ్యేయంగా.. ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లే ఎజెండాగా దూసుకెళుతున్నారు. రేయింబ‌వ‌ళ్లు పేద‌ల‌కు ఏదో ఒక‌టి చేయాల‌న్న క‌సి..సంక‌ల్పం ఆయ‌న‌లోని మాన‌వ‌త్వ‌పు కోణాన్ని సూచిస్తుంది. ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క పోయినా త‌న అడుగులు మాత్రం ముందుకు క‌దులుతూనే ఉన్నాయి. ఇసుక వేస్తే రాల‌నంత జ‌నం ప‌వ‌న్ ఎక్క‌డికి వెళ్లినా తండోప‌తండాలుగా వ‌స్తున్నారు. ఆయ‌న‌ను త‌మ ఆరాధ్య దైవంగా భావిస్తున్నారు. స్వంత మ‌నిషిలాగా..త‌మ కుటుంబంలోని వ్య‌క్తిగా ఆయ‌న‌ను ప్ర‌జ‌లు త‌మ‌లో తాము చూసుకుంటున్నారు.

తెలుగు సినిమా రంగంలో విస్మ‌రించ‌లేని న‌టుడిగా పేరు తెచ్చుకున్న ఆయ‌న ..ఏది చేసినా అది ఓ సంచ‌ల‌న‌మే. ఒక్క పిలుపుతో ప్ర‌భంజ‌నం సృష్టించారు. ఒకే ఒక్క మాట‌తో జ‌నాన్ని జాగృతం చేస్తున్నారు. పోరాడితే పోయేదేమీ లేదు..ప్ర‌జ‌లు మేల్కోవాలి. త‌మ హ‌క్కుల కోసం..ఉద్య‌మించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఒక్కో అడుగు పేర్చుకుంటూ పోతున్నారు. పిలుపునిస్తే చాలు కోట్లాది రూపాయ‌లు, డాల‌ర్లు ఇచ్చేందుకు సంస్థ‌లు, వ్య‌క్తులు రెడీగా ఉన్నారు. కానీ ఆయ‌న ఎవ‌రినీ కోర‌డం లేదు. స‌మాజ హిత‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని..త‌రత‌రాలు శాశ్వ‌తంగా గుర్తుంచుకునేలా ప్ర‌తి ఒక్క‌రు గౌర‌వ ప్ర‌దంగా..ఆత్మ గౌర‌వంతో బ‌తికేలా చేయాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంక‌ణం క‌ట్టుకున్నారు. భావ సారూప్య‌త క‌లిగిన వేలాది మందితో ఆయ‌న అనుసంధానం అయ్యారు. వారి ఆలోచ‌న‌ల‌ను పంచుకున్నారు. ఈ స‌మాజం బాగు కోసం ఏం చేస్తే బావుంటుందో దాని కోసం మేధావులు, ప్ర‌జా సంఘాలు, స్వ‌చ్ఛంధ కార్య‌క‌ర్త‌లు, సేవ‌కులు, క‌ళాకారులు, క‌వులు, ర‌చ‌యిత‌లు, గాయ‌నీ గాయ‌కులు, కార్పొరేట్ దిగ్గ‌జాలు, వ్యాపారులు , సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్లు ..ముందుకు రావాల‌ని ప‌వ‌న్ పిలుపునిచ్చారు. స‌మ‌స్త జ‌నంలో స‌గం జ‌నం అర్ధాక‌లితో..ప‌స్తుల‌తో వుంటే మ‌నం హాయిగా ఎలా నిద్ర పోగ‌ల‌మ‌ని ప్ర‌శ్నించారు. రండి మ‌నంద‌రం క‌లిసిక‌ట్టుగా న‌డుద్దాం. అడుగులో అడుగు వేసుకుంటూ అభివృద్ధి వైపు అచంచ‌ల‌మైన న‌మ్మ‌కంతో క‌దులుదామ‌ని ఆయ‌న పిలుపునిస్తున్నారు.

రోడ్ షోలు, ప్ర‌ద‌ర్శ‌న‌లు, స‌భ‌లు, స‌మావేశాల ద్వారా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఓ వైపు ఎండ‌లు మండుతున్నా..వేలాది మంది అభిమానులు త‌న కోసం వేచి ఉండ‌టాన్ని చూసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రింత ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అధికారం కోసం కాదు నా త‌ప‌న‌. నేను బ‌త‌క‌డానికి స‌రిపోతుంది. లెక్క‌లేనంత ఆస్తుల‌క‌న్నా అంతులేని ..ఆకాశమంత అభిమానం..ప్రేమానురాగాలు చూపించే ల‌క్ష‌లాది మంది అభిమానులు ఉండ‌డ‌మే త‌న‌కు బ‌లాన్ని ఇస్తుందంటారు. ఎక్క‌డ‌లేని శ‌క్తిని క‌లిగిస్తుంద‌ని చెబుతారు. ప్ర‌జ‌లే దేవుళ్లు..స‌మాజ‌మే దేవాల‌యంగా మారే రోజునే నిజ‌మైన స్వ‌తంత్రం వ‌చ్చిన‌ట్టు అంటారు. ఒక్క‌రు అని అనుకుంటే ఎలా..ఈ ఒక్క‌రే వ్య‌వ‌స్థ‌ను మార్చ‌గ‌ల‌రు. ఒక్క‌రు మ‌రో ప‌ది మందితో క‌ల‌వాలి..ఆ ప‌ది మ‌రో వంద మందిని క‌లిసేలా చేయాలి. అంద‌రి ల‌క్ష్యం ఒక్క‌టే కావాలి. అదే కుల‌, మ‌తాలు, వ‌ర్గాలు , ఆధిప‌త్యాలు లేని స‌మాజం రావాలి. ఆ దిశ‌గా మ‌నం ప్ర‌యాణం చేయాలి. ఇదే నా ముందున్న ల‌క్ష్యం. హీరోగా ఉంటే కొంద‌రినే నేను ఎంట‌ర్ టైన్ మెంట్ చేయ‌గ‌ల‌ను. అదే రాజ‌కీయ నాయ‌కుడిగా మారితే కోట్లాది మందికి సేవ చేసే అవ‌కాశం ద‌క్కుతుంద‌ని అంటారు. అందుకోస‌మే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

నీతి, నిజాయితీకి తావులేకుండా పోయింద‌ని..ఈ కుళ్లి పోయిన రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క్షాళ‌న చేయాల్సిన బాధ్య‌త త‌న‌తో పాటు మీ అంద‌రిపైనా ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. భూమి ఆదాయ వ‌న‌రు కాదు..అది మ‌నుషుల‌కు అన్నం పెట్టే ఆదెరువు. దానిని అమ్ముకుంటే త‌మ‌ను తాము అమ్ముకున్న‌ట్టే. అందుకే ఏది కోల్పోయినా..పొలాల‌ను మాత్రం కోల్పోకండి అంటూ బోధిస్తున్నారు. దేశానికి వెలుగులు పంచిన సావిత్రి భాయి పూల్, సామాజిక సంస్క‌ర‌ణ కోసం జీవితాన్ని ధార పోసిన నారాయ‌ణ గురు, కోట్లాది ఆస్తుల‌ను వ‌దులుకుని స‌మాజం బాగుండాల‌ని ప‌రిత‌పించిన మ‌హోన్న‌త మాన‌వుడు సంత్ గాడ్గే బాబా ను ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని పిలుపునిస్తున్నారు. జ‌నం బాగు పడాల‌ని..స‌మున్న‌త‌మైన స్థానాన్ని అందుకోవాల‌ని..వారి కాళ్ల మీద వాళ్లు నిల‌బ‌డేలా ఉండాల‌న్న స‌త్ సంక‌ల్పంతో..స‌దాశ‌యంతో జ‌న‌సేన పార్టీని స్థాపించ‌డం జ‌రిగింద‌ని ప‌వ‌న్ మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసినా వారికి ఏ రీతిలో స‌మాధానం చెప్పాలో త‌న‌కు బాగా తెలుసున‌ని ఆయ‌న హెచ్చ‌రిస్తున్నారు. ద‌మ్ముంటే త‌న వ‌ద్ద‌కు రావాల‌ని స‌వాల్ విసురుతున్నారు. కేవ‌లం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌నే ప్ర‌స్తావిస్తున్నారు. పాల‌కుల నిర్ల‌క్ష్యాన్ని, బాధ్య‌తా రాహిత్యాన్ని క‌డిగేస్తున్నారు. ఉద్దానం విష‌యంలో , ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఆయ‌న బేష‌ర‌తుగా ప్ర‌జ‌ల ప‌క్ష‌మే వ‌హించారు.

 ప్ర‌ధాన‌మంత్రి మోడీతో క‌లిసినా..గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌తో మాట్లాడినా..చంద్ర‌బాబుతో స్నేహ పూర్వ‌కంగా ఉన్నా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంతా ఏపీ బాగుండాల‌ని ప్ర‌య‌త్నం చేశారు. సామాజిక‌, రాజ‌కీయ‌, ఆర్థిక‌, సాంస్కృతిక రంగాల‌లో ఏపీ దేశానికి ఆద‌ర్శం కావాల‌ని ..కానీ ఇలాంటి పాల‌కులు ఉంటే సాధించ‌లేమ‌ని ఆధారాల‌తో స‌హా జ‌నానికి అర్థం చేయిస్తున్నారు. ఏపీలో ఎన్న‌డూ లేనంత‌గా పార్ల‌మెంట్, అసెంబ్లీ ఎన్నిక‌లు యుద్ధ రంగాన్ని త‌ల‌పింప చేస్తున్నాయి. అప‌ర చాణుక్యుడిగా పేరున్న చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రో వైపు పాద‌యాత్ర‌ల‌తో జ‌గ‌న్ ప‌వ‌ర్ లోకి రావాల‌ని ..ఎలాగైనా స‌రే..ఏమైనా స‌రే అని డిసైడ్ అయ్యారు. ప్ర‌చారాన్ని మ‌రింత వేగం పెంచారు. పోటీ టీడీపీ, వైసీపీల మ‌ధ్యే గ‌తంలో ఉండేది. కానీ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంట‌ర్ అయ్యాక‌. ఏపీలో రాజ‌కీయాలు ఒక్క‌సారిగా మారి పోయాయి. అన్ని పార్టీలు, ప్ర‌జ‌లు ప‌వ‌న్ వైపు చూడ‌టం ప్రారంభించారు. ఆయ‌న ఎవ‌రిని టార్గెట్ చేస్తున్నారు. దేనిపై ఎక్కువ‌గా దృషి పెడుతున్నారు. ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నారు. అన్న దానిపై ఇప్ప‌టికే ప‌వ‌న్ క్లారిటీ ఇచ్చారు. జ‌న‌సేన చాప కింద నీరులా త‌న ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింది. స‌చ్చీలురికి ఈసారి ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇచ్చారు. దీంతో ఏపీలో వివిధ రంగాల‌లో ల‌బ్ద‌ప్ర‌తిష్టులతో పాటు వామ‌ప‌క్ష పార్టీలు, మేధావులు , ఆలోచ‌నా ప‌రులు, బుద్ధి జీవులు ప‌వ‌న్ వెంట న‌డుస్తున్నారు. దేశంలోనే అత్యంత నిజాయితీ క‌లిగిన పోలీస్ ఆఫీస‌ర్ గా పేరు తెచ్చుకున్న జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ప‌వ‌న్‌ను ఎంచుకున్నారు. ఇది దేశ వ్యాప్తంగా వైర‌ల్ అయ్యింది.

ఇంకో వైపు చాలా ప‌ద్ధ‌తిగా వుండే నాయ‌కుడిగా పేరున్న నాదెండ్ల మ‌నోహ‌ర్ తో పాటు లోక్‌స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్, ఇంట‌ర్నేష‌న‌ల్ మేనేజ్‌మెంట్ గురు శ్రీ‌ధ‌ర్ బెవ‌ర , త‌దిత‌రులు థింక్ ట్యాంక్ లో స‌భ్యులుగా ఉన్నారు. ఆయ‌న యువ‌తీ యువ‌కుల‌ను టార్గెట్ చేశారు. మిగ‌తా వ‌ర్గాల వారిని, బ‌హుజ‌నుల‌ను ఆద‌రిస్తున్నారు. ఏ రంగాన్ని వ‌దిలి పెట్ట‌డం లేదు. పేద‌లు ఉండ‌ని స‌మాజం..పేద‌రికం లేని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కావాల‌న్న‌దే త‌న ఆశ‌య‌మ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి ప్ర‌జ‌ల సాక్షిగా వెల్ల‌డించారు. ఇంకో వైపు రాజ‌కీయ శ‌క్తిగా అవ‌త‌రించిన బీఎస్పీ అధినేత్రి మాయ‌వ‌తితో క‌లిసి జ‌న‌సేన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. హైద‌రాబాద్‌లో భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేసింది. బాబును, జ‌గ‌న్‌ను ఉతికి ఆరేశారు. అలాగ‌ని కేసీఆర్‌ను కూడా విడిచి పెట్ట‌లేదు. ఏపీ ప్ర‌జ‌ల‌ను ఏమైనా అంటే తాను ఊరుకోన‌ని..ఆందోళ‌న చేస్తాన‌ని హెచ్చ‌రించారు.

నిన్న‌టి దాకా హాయిగా నిద్ర పోయిన బాబు, జ‌గ‌న్‌లు ఇపుడు ప‌వ‌న్ ఎంట‌ర్ కావడంతో కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు. జ‌న‌సేన ఓట్లు ఎవ‌రికి న‌ష్టం చేకూరుస్తాయోన‌ని ఆందోళ‌న చెందుతున్నారు. ప‌వ‌న్ ప్ర‌భావం చాలా మటుకు ఉంటుంద‌ని..ఆయ‌న‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అని..యువ‌తీ యువ‌కులు ఆయ‌నంటే ప్రాణం పెడ‌తార‌ని..కొత్త‌గా న‌మోదు చేసుకున్న ఓట‌ర్లంతా ఆయ‌న వైపే ఉంటార‌ని ..ఇది రెండు శాతానికి గ‌నుక చేరుకుంటే ఫ‌లితాలు తారుమార‌య్యే అవ‌కాశం లేక పోలేద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా మాట్లాడటం..ప‌వ‌న్ క‌ళ్యాన్‌కు ముందునుండి అల‌వాటు. వ్య‌క్తి నుండి స‌క్సెస్ ఫుల్ హీరోగా ప్రారంభ‌మైన ఆయ‌న జ‌ర్నీ ఇపుడు దేశ‌మంతా త‌న వైపు చూసే స్థాయికి చేరుకున్నాడు ఈ నాయ‌కుడు. ప్ర‌స్తుతం జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ కీల‌క భూమిక పోషించ‌డం ఖాయం. 

కామెంట్‌లు