జ‌న‌మే దేవుళ్లు..స‌మాజ‌మే దేవాల‌యం - ప‌వర్ స్టార్

త‌రాలు గ‌డిచినా ఇంకా ల‌క్షలాది ప్ర‌జ‌లు ఆక‌లితో ఉండ‌డం న‌న్ను బాధించింది. లెక్క‌లేనంత సంప‌ద‌..అపార‌మైన వ‌న‌రులు క‌లిగి ఉన్నా ఎందుక‌ని కొంద‌రి చేతుల్లోనే ఈ స‌మాజం బందీ అయింది. ఈ ప్రాంతంలో పుట్టిన ప్ర‌తి ఒక్క‌రికి బ‌తికే హ‌క్కుంది. గౌర‌వ ప్ర‌దంగా జీవించే సౌలభ్యం ఉంది. ఎవ‌రితో పేచీ లేదు. ఇంకెవ్వ‌రితో గొడ‌వ‌లు లేవు. నా ముందున్న ఒకే ఒక్క ల‌క్ష్యం. అంత‌రాలు లేని స‌మాజం. దాని కోసం నా జీవితాన్ని అంకితం చేశా. కోట్లాది ఆస్తులున్నా నాకు సంతృప్తిని ఇవ్వ‌వు. కానీ ల‌క్ష‌లాది అభిమానుల ఆద‌ర‌ణే నాకు కొండంత అండ‌. అందుకే నాకు ప్ర‌జ‌లు అంటే ప్రాణం. వారు బాగుండాల‌ని ..త‌ల ఎత్తుకుని బ‌త‌కాల‌న్న స‌దాశ‌యంతో తుచ్ఛ‌మైన రాజ‌కీయాల్లోకి వ‌చ్చా. న‌న్ను త‌క్కువ అంచ‌నా వేసిన వారే ఇపుడు నాతో క‌లిసి న‌డిచేందుకు వ‌స్తున్నారు. మార్పు అన్న‌ది త్వ‌ర‌గా రాదు..కొంచెం స‌మ‌యం ప‌డుతుంది. అంద‌రు ఒక్క‌డే అన్నారు. గేలి చేశారు. వేధింపుల పాలు చేశారు. కేసులు న‌మోదు చేశారు. కానీ ఆ ఒక్క‌రే దేశానికి స్వేచ్ఛ‌ను ప్ర‌సాదించారు. ఆంగ్లేయుల గుండెల్లో నిదుర పోయారు. అత‌నే మ‌హాత్మాగాంధీ.

జ‌న‌మే దేవుళ్లు..స‌మాజ‌మే దేవాల‌యం. ఇదే నా ఆశ‌యం. ప్ర‌జ‌ల కోసం ప్రాణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. నా స‌ర్వ‌స్వం మీరే. నాకు మీతో మాట్లాడుతుంటే..మీ గురించి ఆలోచిస్తుంటే ఎక్క‌డ‌లేనంత ఎన‌ర్జీ వ‌స్తుంది. ఏదో ఒక్క‌టి చేయాలి. ప్ర‌తి ఒక్క‌రు బాగుండాలి. కులాలు, మ‌తాలు, వ‌ర్గాలతో కొట్టుకు చావ‌కండి. గ‌త కొన్నేళ్ల నుండి మిమ్మ‌ల్ని పాల‌కులు విభ‌జించి పాలించారు. కానీ ఇపుడు అలా కాదు. మీరు మారాలి. విద్యావంతులు కావాలి. ప్ర‌తి ఒక్క‌రు అక్ష‌రాస్యులు అయిన‌ప్పుడే మీరేమిటో తెలుసుకోగ‌లుతారు అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చైత‌న్య‌వంతం చేస్తున్నారు. నేర్చుకున్న చ‌దువు బ‌తికేందుకు కావాల్సిన బలాన్ని ఇవ్వ‌గ‌ల‌గాలి. పాల‌కులు ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీగా ఉండాలి. అధికారిక వ్య‌వ‌స్థ జ‌నానికి సేవ‌లు అందించ‌డంలో నిమ‌గ్నం కావాలి. కానీ ఇపుడు అలా జ‌ర‌గ‌డం లేదు. ఆదాయ వ‌న‌రుల‌ను కొల్ల‌గొడుతున్నారు. ఆస్తుల‌ను పోగేసుకుంటున్నారు. అక్ర‌మాల‌కు తెర లేపారు. భూక‌బ్జాల‌కు పాల్ప‌డుతున్నారు. లెక్క‌లేనంత సంపాదిస్తున్నారు. కానీ సంక్షేమ ప‌థ‌కాల‌తో గాలం వేయాల‌ని చూస్తున్నారు. ఇంకొంద‌రు నాయ‌కులు మాయ‌మాట‌ల‌తో బురిడీ కొట్టించాల‌ని చూస్తున్నారు. వారికి కావాల్సింద‌ల్లా అధికార‌మే. మ‌ళ్లీ ప‌వ‌ర్‌లోకి వ‌స్తే మిమ్మ‌ల్ని కూడా అమ్మేస్తార‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ హెచ్చ‌రిస్తున్నారు.

ఉన్న చోట‌నే ఉపాధి ద‌క్కాలి. విద్య‌, వైద్యం , ఉపాధి ఇవే ప్రధానం కావాలి. 70 ఏళ్లు గ‌డిచినా ఇంకా గుక్కెడు నీళ్ల కోసం, సాగు కోసం ప్ర‌జ‌లు అల్లాడుతున్నారంటే ఇది ఎవ‌రి పాప‌మ‌నుకోవాలో మీరే తేల్చుకోవాలి. ఒకే ఒక్క ఓటు కదా అని నిర్ల‌క్ష్యం చేయ‌కండి. రాజ్యాంగ నిర్మాత‌, జాతికి వెలుగులు పంచిన బాబాసాహెబ్ అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం మ‌న‌కు ర‌క్ష‌ణ‌గా నిలిచింది. ఎవ‌రో ఇచ్చే నోటు కోసం క‌క్కుర్తి ప‌డి మీ భ‌విష్య‌త్‌ను పాడు చేసుకోకండి.. ఎవ‌రు నిజ‌మైన సేవ‌కులో గుర్తించండి. రాజ‌కీయ నాయ‌కులు ఎన్నో చెబుతారు. లెక్క‌లేనంత‌గా హామీలు గుప్పిస్తారు. వాటిని న‌మ్మ‌కండి. మీకు శాశ్వ‌త‌మైన ఉపాధిని ఎవరు క‌ల్పిస్తారో వారి ప‌క్షాన నిల‌వండి..ఓటు హ‌క్కు వినియోగించుకోండి. మెరుగైన పాల‌న కావాలంటే జ‌న‌సేనకు మ‌ద్ధ‌తు ఇవ్వ‌మ‌ని ఆయ‌న కోరుతున్నారు.

టీడీపీ, కాంగ్రెస్ పాలించిన ఈ రాష్ట్రంలో ఇంకా క‌రువు ప్రాంతాలు ఉండ‌డం వారి అస‌మ‌ర్థ‌త‌ను తెలియ చేస్తుంది. ప్ర‌జ‌లారా మీరే దేవుళ్లు. మీకు న‌మ‌స్క‌రిస్తున్నా..ఇది అస‌లైన స‌మ‌యం. మీ విజ్ఞ‌త‌ను ప్ర‌ద‌ర్శించాల్సిన స‌మ‌యం. మీ బ‌తుకులు బాగు చేసుకోవాల్సిన స‌మ‌యం. నోట్లు ఇవ్వాళ ఉంటాయి..రేపు అయిపోతాయి. కానీ మీరు మాత్రం ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్ట‌కండి. ఓటును అమ్ముకోవ‌డం అంటే మిమ్మ‌ల్ని మీరు అమ్ముకున్న‌టే. మీ భ‌విష్య‌త్‌ను మీరు నాశ‌నం చేసుకున్న‌ట్టే. మీ పిల్ల‌ల‌కు మీరు ఏ ముఖం పెట్టుకుని నిల‌బ‌డ‌తారు. అందుకే ఒక్క‌సారి ఆలోచించండి. ఈసారి జ‌రిగే ఎన్నిక‌ల్లో
ప్ర‌జ‌ల కోసం కోట్ల ఆఫ‌ర్ల‌ను కాద‌నుకుని మీ కోసం ..మీ ముందుకు వ‌చ్చిన జ‌న‌సేన‌ను దీవించండి..న‌న్ను ఆశీర్వ‌దించండి..ప్ర‌జల‌కు సేవ చేసే భాగ్యం క‌ల్పించ‌మ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ విన‌మ్రంగా కోరుతున్నారు. మొత్తం మీద ఏపీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీ ఇపుడు జ‌నాన్ని క‌దిలించ‌డ‌మే కాదు ఆలోచించేలా చేస్తోంది. ప్ర‌జాస్వామ్యం వ‌ర్ధిల్లాలి. జ‌న‌సేన ఆశ‌యాలు సాధించే దిశ‌గా అడుగులు వేయాలి. 

కామెంట్‌లు