విధ్వంసకర విన్యాసం..రస్సెల్ సంచలనం - ఓటమి పాలైన కోహ్లి సేన
కోల్‌కతా జట్టు ఏ ముహూర్తాన అండ్రూ రస్సెల్‌ను వేలం పాటలో పనిగట్టుకుని కొనుగోలు చేసిందో కానీ ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒక మ్యాజిక్‌తో గట్టెక్కిస్తున్నాడు. విజయపు అంచులకు చేరుస్తున్నాడు. బంతులను అలవోకగా ..రాకెట్ కంటే వేగంగా..తూటాలకంటే బలంగా పరుగులు సాధిస్తున్నాడు ఈ ఆఫ్రికన్ ఆటగాడు. ఎక్కడా తొట్రుపాటు కానీ..ఆందోళనకానీ చెందకుండా..జస్ట్ కూల్‌గా ఆడుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఐపీఎల్ టోర్నీలో టీ-20 మ్యాచ్ ఫార్మాట్‌లలో రస్సెల్ సిట్యూయేషన్‌కు తగ్గట్టు ఆడటం లేదు. ఎంత టార్గెట్ ఉన్నా..జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి అంచనాలు లేని సమయాల్లో ఆపద్బాంధవుడి అవతారం ఎత్తుతున్నాడు. మైదానంలో ఒక్కసారి స్టిక్ అయిపోతే చాలు బంతుల్ని పెవీలియన్ బాట పట్టిస్తున్నాడు. ఈ టోర్నీలో అండ్రూ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారాడు. ఎవరి బౌలింగ్‌లోనైనా బంతులను ఫోర్లు లేదా సిక్సర్లు వచ్చేలా చేస్తున్నాడు.
దీంతో కోల్‌కతా జట్టు రస్సెల్ వుంటే చాలు అనుకుంటోంది మేనేజ్‌మెంట్. ఇండియన్ క్రికెట్ జట్టు కెప్టెన్ ..మోస్ట్ వాంటెడ్ ప్లేయర్‌గా పాపులర్ అయిన విరాట్ కోహ్లి ప్రాతినిథ్యం వహిస్తున్న బెంగళూరు జట్టు ఈ టోర్నోలో ఇంకా బోణి చేయలేదు. ఆండ్రూ విధ్వంసకర బ్యాటింగ్ విన్యాసాలను చూసి కోహ్లి కూడా పరేషన్ లో పడిపోయారు. అయిదు మ్యాచ్‌లు ఆడితే అన్నీ ఓటమి పాలే. ఆఖరు వరకు తీవ్ర ఉత్కంఠను..తట్టుకోలేని టెన్షన్‌ను గురి చేసిన ఇలాంటి మ్యాచ్‌లే క్రికెట్ అభిమానులకు ఎక్కడలేని మజాను..కిక్కు ఇస్తుంది. నిన్నటి వరకు పేలవమైన ప్రదర్శనను ప్రదర్శించిన కోహ్లి, డివిలియర్స్ లు కోల్‌కతా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో దుమ్ము రేపారు. పరుగుల వరద పారించారు. నిర్ణీత 20 ఓవర్లలో స్కోరు 200 పరుగులు దాటించింది. ప్రత్యర్థి జట్టుకు భారీ టార్గెట్ ముందుంచింది. వేలాది మంది అభిమానులు ఎక్కడలేని రీతిలో ఎంజాయ్ చేశారు. క్రికెట్ ఆటలోని టేస్ట్‌ను ఆస్వాదించారు.
కేవలం 16 బంతులు 53 పరుగులు చేయాల్సిన పరిస్థితిని కోల్‌కోతా కొనితెచ్చుకుంది. ఈ దశలో ఎవరైనా ..ఏ జట్టయినా తామే గెలుస్తామని అనుకుంటుంది. కానీ రస్సెల్ రూపంలో బ్యాటింగ్ ఉగ్రరూపం దాల్చింది. ఎట్టకేలకు ఖాతా తెరవబోతున్నట్టే అనిపించింది. కానీ ఒకే ఒక్క బంతి మొత్తం ఆట స్థితినే మార్చేసింది. ఆండ్రూ రసెల్‌ను విధ్వంసకారుడిని నిద్ర లేపింది. పూనకం వచ్చినట్టు..ఉగ్ర రూపం దాల్చాడు. బంతి ఎలా వేసినా..ఎంతగా ఇబ్బంది పెట్టినా ఒక్కడే సునామీలా రెచ్చి పోయాడు. ఉప్పెనలా విరుచుకు పడ్డాడు. ప్రతి బాల్‌ను కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. అలవోకగా ఈజీగా పరుగులు సాధించాడు. ఆర్‌సీబీ బౌలర్లను ఆటాడుకున్నాడు. పిడుగులు పడినట్టు మోత మోగించాడు. రసెల్ ధాటికి ఇంకో 5 బంతులు ఉండగానే మరిచి పోలేని గెలుపును కోల్‌కతాకు అందించాడు.
సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా పేరున్న కోహ్లికి ఈ సీజన్ అచ్చొచ్చినట్టు లేదు. ఏ మ్యాచ్ గెలవడం లేదు. అయిదు వికెట్ల తేడాతో బెంగళూరు ఓటమి పాలైంది. కేవలం 13 బంతులు ఆడి ఒకే ఒక్క ఫోర్ కొట్టి..ఆరు సిక్సర్లతో విరుచుకుపడి 48 పరుగులు చేసిన రస్సెల్‌ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపిక చేసింది. ఆర్సీబీకి కోలుకోలేని షాక్ ఇచ్చాడు ఈఆటగాడు. అంతకు ముందు బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు ధాటిగా ఆడింది. కెప్టెన్ కోహ్లి 49 బంతుల్లో 84 పరుగులు చేశాడు. డివిలియర్స్ 32 బంతులు ఆడి 63 పరుగులు చేసి తమ సత్తా చాటారు. స్టాయినిస్ 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కట్టుదిట్టమైన బౌలింగ్ చేసినా బెంగళూరు గెలవలేక పోయింది. అనుకోని రీతిలో సునామిలా రసెల్ వచ్చాడు. ఇంకేం సక్సెస్‌ను ఎగురేసుకు పోయాడు. సిరాజ్ భుజం మీద నుంచి వేసిన బంతిని కళ్లు చెదిరేలా సిక్సర్‌గా మలిచాడు. క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇది పండగను తలపింప చేసింది. మొత్తం మీద ఐపీఎల్ పుణ్యమా అని క్రికెట్ మాత్రం మరింత మజాను కలిగిస్తోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి