దేశవ్యాప్తంగా విస్తరించనున్న ఫ్లిప్‌కార్ట్ - 3 వేల కోట్ల పెట్టుబడి
లాజిస్టిక్ రంగంలో తనకంటూ ఎదురే లేకుండా దూసుకెళుతున్న ఇండియన్ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరో అసాధారణమైన నిర్ణయం తీసుకుంది. ఇటీవలే తన వ్యాపారాన్ని మరింత విస్తృతం చేసేందుకు , నూతన టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అమెరికా కంపెనీ అమెజాన్‌కు ధీటుగా ఈ సంస్థ సాగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కస్టమర్లకు భారీ ఆఫర్లు ప్రకటించడం, ఆదాయాన్ని సమకూర్చు కోవడం, ఆయా కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం చేస్తూ వస్తోంది యాజమాన్యం. ఈకామర్స్ రంగంలో ఇప్పటికే స్నాప్ డీల్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, షాప్ క్లూస్ ,తదితర కంపెనీలు ఎన్నో ఇండియన్స్ ను టార్గెట్ చేశాయి. ఎవరికి వారే బంపర్ ఆఫర్లు, బొనాంజాలు ప్రకటిస్తూ వల వేస్తున్నాయి.
ఆన్‌లైన్‌లో కోట్లాది వ్యాపారం రోజుకు జరుగుతోంది. లక్షలాది మంది తమ అభిరుచులకు తగ్గట్టు అన్నింటిని కొనుగోలు చేసేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. ఎంత డబ్బైనా పెట్టేందుకు వెనుకాడడం లేదు. అందుకే ఈకామర్స్ కంపెనీలన్నీ ఎక్కడికక్కడ వినియోగదారులకు తక్షణమే బుకింగ్ చేసిన కొద్ది గంటల్లో లేదా ఒకే ఒక్క రోజులో డెలివరీ చేసేలా కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. ఇందు కోసం దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలు, ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నాయి. దాని లో భాగంగానే ఏయే వస్తువులు ఎక్కడికి వెళుతున్నాయి. ఎంత సమయం పట్టనుంది. కస్టమర్లు సంతృప్తిగానే ఉన్నారా అనే విషయాలను పరిగణలోకి తీసుకుంటున్నాయి. వారి అభిప్రాయాలు, సూచనల ఆధారంగా కంపెనీలన్నీ తమ నియమ నిబంధనలు మార్చేస్తున్నాయి.
లాజిస్టిక్, వేర్ హౌస్‌లను విస్తరించేందుకు ఫ్లిప్ కార్ట్ నిర్ణయించింది. ఇందు కోసం ఏకంగా 3000 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. ఈ డబ్బులను దశల వారీగా పెట్టుబడి పెడతారు. ఇప్పటికే ఫ్లిప్ కార్డ్‌కు ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. వాల్ మార్ట్‌ను స్వంతం చేసుకుంది ఈ సంస్థ. 300 ఎకరాలను కొనుగోలు చేసింది. ఇందులో భారీ ఎత్తున వేర్ హౌజెస్‌ను ఏర్పాటు చేస్తుంది. దీంతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో కూడా లాజిస్టిక్, వేర్ హౌజ్‌లను నిర్మించేందుకు ప్లాన్ సిద్దం చేసింది. ఆటోమేషన్ ద్వారా వస్తువులను డెలివరీ చేస్తారు. కోల్‌కతాలో 100 ఎకరాలను ఎంపిక చేసుకుంది. ఇక్కడే 1000 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. దీని వల్ల 18000 నుండి 20000 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.
కర్ణాటకలో పూర్తి కాగా, కోల్‌కతాలో స్టార్ట్ అయింది... అది గనుక పూర్తయితే ఇండియాలోని తూర్పు ప్రాంతమంతా కవర్ చేసుకునే వీలు కలుగుతుంది ఫ్లిప్ కార్ట్‌కు . గురుగ్రాం, బెంగళూరులలో లాజిస్టిక్, వేర్ హౌస్‌లను నిర్మిస్తోంది. ఇందు కోసం వేయి కోట్లు ఖర్చు చేస్తోంది. ఇక్కడ కూడా 20 వేల మందికి ఉపాధి కల్పించనుంది. ఉద్యోగులతో పాటు ఆటోమేషన్ ద్వారా హై టెక్నాలజీ వాడుతూ ..వస్తువులను చేరవేయనుంది. దీని వల్ల సమయంతో పాటు డబ్బలు ఆదా అవుతాయి. కస్టమర్లకు ఆఫర్లు రావడంతో సంతృప్తి చెందే అవకాశం ఉంది. పర్యావరణ రహితంగా ఉండేలా చూస్తోంది ఈ సంస్థ. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఇండియాలోనే మొట్ట మొదటి సారిగా ఫ్లిప్ కార్ట్ డేటా సెంటర్‌ను ప్రారంభించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి